Winter wedding: పెళ్లిలో మెరిసిపోయేందుకు ఫిట్నెస్ టిప్స్..!
పెళ్లి సమయానికి బరువు పెరిగి బోల్డ్ గా కనపడకుంా.. అందంగా.. కనిపించాలంటే.. కొన్ని రకాల ఫుడ్స్ కి దూరంగా ఉండాలట. మరి అవేంటో ఓసారి చూసేద్దామా..
ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఈ సీజన్ లో మీరు కూడా పెళ్లి పీటలు ఎక్కబోతున్నారా..? అయితే.. ఈ పెళ్లిలో మీరు ఎలాంటి చీర కట్టుకున్నా.. ఆ చీరకే మీరు అందం తెచ్చినట్లు ఉండాలంటే.. ఏది పడితే అది తినేయకూడదు. ఈ చలికాలంలో.. కొద్దిగా ఫుడ్ హ్యాబిట్స్ మారిస్తే.. మీరు మరింత అందంగా మెరిసిపోయే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
ఈ చలికాలంలో ఎక్కువగా ఆహారం తీసుకోవాలని అనిపిస్తూ ఉంటుందట. కాబట్టి.. ఏది పడితే అది తినకుండా.. పెళ్లి సమయానికి బరువు పెరిగి బోల్డ్ గా కనపడకుంా.. అందంగా.. కనిపించాలంటే.. కొన్ని రకాల ఫుడ్స్ కి దూరంగా ఉండాలట. మరి అవేంటో ఓసారి చూసేద్దామా..
ఇక ఈ వింటర్ సీజన్ లో వేడి వేడిగా సూప్స్ తాగాలని చాలా మందికి ఉంటుంది. ఆ సూప్స్ లో నూ ఎక్కువగా క్రీమ్ ఉండేవి ఎంచుకుంటూ ఉంటారు. అయితే.. అలాంటి క్రీమ్ సూప్స్ తాగడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి... దానికి బదులు సూప్ తాగాలి అంటే.. కూరగాయల సూప్స్ తాగడం మేలు.
carrot halwa
ఇక.. క్యారెట్ హల్వాని ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. ముఖ్యంగా చలికాలంలో దీనికి ఇష్టంగా లాగించేవారు చాలా మంది ఉంటారు. అయితే.. దీని తయారీలో నెయ్యి, పంచదార ఎక్కువగా కలుపుతారు. కాబట్టి.. దీనికి దూరంగా ఉండటం మంచిది.
ఇక.. క్యారెట్ హల్వాని ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. ముఖ్యంగా చలికాలంలో దీనికి ఇష్టంగా లాగించేవారు చాలా మంది ఉంటారు. అయితే.. దీని తయారీలో నెయ్యి, పంచదార ఎక్కువగా కలుపుతారు. కాబట్టి.. దీనికి దూరంగా ఉండటం మంచిది.
ఇక.. శీతాకాలంలో పెళ్లి చేసుకోవాలనునేవారు.. ముఖ్యంగా ఫిట్ గా ఉండాలి అనుకునేవారు.. ప్రతిరోజూ వ్యాయామం చేయాలి. అంతేకాకుండా.. కనీసం ఒక గంట యోగా చేయడం అలవాటు చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఫిట్ గా ఉండే అవకాశం ఉంటుంది.
fiber
మీరు ఫిట్నెస్ తో రోజును ప్రారంభిస్తున్న సమయంలో... ఫైబర్ అధికంగా ఉండే, ప్రోటీన్లు ఉండే ఆహారం తీసుకోవాలి. ఎందుకంటే ఇది రోజుకి సరిపడా కేలరీలను బర్న్ చేయడంలో సహాయపడుతుంది. ఆకలిని తగ్గిస్తుంది.
మనం అలసిపోయినప్పుడు ఎక్కువగా తినడమే కాదు, కొవ్వును జీర్ణం చేసుకోవడంలో మన శరీరాలు ఇబ్బంది పడతాయనేది రుజువైన వాస్తవం. తగినంత నిద్ర పొందడం వల్ల మీరు మీ ఆహారంలో కట్టుబడి ఉండటమే కాకుండా, వ్యాయామం కూడా సరిగ్గా చేయగలుగుతారు.
షుగర్ ఎక్కువగా ఉండే ఆహారాలు, వేయించిన ఆహారాలు, ఆల్కహాల్ వంటి వాటికి దూరంగా ఉండాలి. ఇవన్నీ... అధిక బరువు పెరగడానికి కారణమౌతాయి. అంతేకాదు.. గోధుమలు, గ్లూటెన్ లు ఎక్కువగా ఉండే ఆహారాలకు కూడా దూరంగా ఉండాలి.
సూపర్ మార్కెట్‌లోని అన్ని 'తక్కువ కొవ్వు' లేబుల్‌లను చూసి మోసపోకండి, చాలా వరకు చక్కెర ,ఉప్పుతో నిండి ఉంటుంది, ఇది మీ శరీరం మరింత కొవ్వు పెంచేలా చేస్తుంది. సన్నని ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు , పుష్కలంగా పండ్లు , కూరగాయలు మీ ఆహారంలో భాగంగా ఉండేలా చూసుకోవాలి.