పెళ్లి తర్వాతే మహిళలు ఎందుకు లావు అవుతారు..?
పురుషుల వీర్యం మహిళల శరీరంలోకి ప్రవేశించడం వల్ల లావు అయిపోతున్నాం అని నమ్ముతారు. కానీ అందులో ఎలాంటి నిజం లేదట.
indian bride
మీరు గమనించారో లేదో… చాలా మంది మహిళలు పెళ్లి తర్వాత అనూహ్యంగా బరువు పెరిగిపోతారు. అత్తారింటికి వెళ్లి అక్కడి ఆహారం బాగా తిని బరువు పెరిగిపోయారు అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ.. దాని వెనక వేరే కారణం ఉంటుంది. మరి అదేంటో తెలుసుకుందాం..
Weight gain
పెళ్లి తర్వాత మహిళలు దాదాపు ఐదు నుంచి పది కేజీల వరకు బరువు చాలా ఈజీగా పెరిగిపోతారు. చాలా మంది.. వివాహం తర్వాత సెక్స్ లైఫ్ కారణంగా బరువు పెరుగుతారని భావిస్తారు. పురుషుల వీర్యం మహిళల శరీరంలోకి ప్రవేశించడం వల్ల లావు అయిపోతున్నాం అని నమ్ముతారు. కానీ అందులో ఎలాంటి నిజం లేదట.
పురుషుల నుంచి వచ్చే 3 ఎంఎల్ నుంచి 5 ఎంఎల్ వీర్యం.. స్త్రీల శరీరంలోకి వెళితే.. దాని వల్ల బరువు పెరిగే అవకాశం అస్సలు లేదు. అంటే.. అందులో ఎలాంటి నిజం లేదు. మహిళల బరువు పెరగడానికి వెనక మరో కారణం ఉంది.
weight gain after marriage
మహిళల లైఫ్ స్టైల్ లో వచ్చే మార్పుల కారణంగా బరువు పెరుగుతారట. అప్పటి వరకు.. ఇంట్లో ఫాలో అయ్యే లైఫ్ స్టైల్, ఆహారపు అలవాట్లు, డైట్ డిఫరెంట్ గా ఉంటుంది. కానీ.. సడెన్ గా పెళ్లి తర్వాత అత్తారింటికి రావడం వల్ల.. అక్కడి లైఫ్ స్టైల్ లో తేడా ఉండటం వల్ల.. బరువు పెరిగిపోతారట.
అంతేకాదు.. పెళ్లి తర్వాత కొత్తలో.. భర్తతో కలిసి, భార్య భోజనం చేస్తుంది. సంతోషంలో ఎక్కువ తినేస్తారట. దీని కారణంగానే తెలీకుండానే బరువు పెరిగిపోతారట. మరో కారణం ఒత్తిడి. చాలా మంది మహిళలు.. ఒత్తిడి కారణంగానే అధిక బరువు పెరుగుతారట. ఒత్తిడి కారణంగా హార్మోన్లలో మార్పులు వస్తాయి. ఒత్తిడి కారణంగా విడుదలయ్యే హార్మోన్లు.. కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండే ఆహారం తినేలా చేస్తాయట. ఫలితంగా వెయిట్ గెయిన్ అవుతారు.