ఈజీ ట్రిక్స్ తో 25కేజీల బరువు తగ్గొచ్చా..? కరిష్మ చెప్పిన సీక్రెట్ ఇదే..!
కరీనా ఈ విషయం తన ఫ్రెండ్స్ కి చెప్పినప్పుడు వాళ్లు కూడా ఆశ్చర్యపోయారట. అయితే.. కరెక్ట్ గా ఎలా తినాలో తెలిస్తే.. ఈ రెండింటితోనే సులువుగా బరువు తగ్గొచ్చని ఆమె చెప్పారు.
ఈరోజుల్లో బరువు తగ్గాలని చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ బరువు తగ్గేందుకు ఏం చేయాలో తెలియక నానా తిప్పలు పడుతూ ఉంటారు. అయితే.. కొన్ని ట్రిక్స్ ఫాలో అయితే ఈజీగా బరువు తగ్గవచ్చని బాలీవుడ్ బ్యూటీ కరిష్మా కపూర్ చెప్పారు. ఆమె చెప్పిన ట్రిక్స్ ఫాలో అయితే.. మీరు కూడా ఈజీగా బరువు తగ్గవచ్చు. మరి ఆ ట్రిక్స్ ఏంటో మీకు కూడా తెలుసుకోవాలని ఉందా..? ఇంకెందుకు ఆలస్యం చదివేయండి..
గతంలో కరిష్మా వెయిట్ లాస్ కోసం తాను చేసిన పనిని ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశారు. డిన్నర్ లో కేవలం ఒక ఫుడ్ తినడం వల్ల ఆమె దాదాపు 25 కేజీల బరువు తగ్గారట. అదేంటో తెలుసా? రాత్రిపూట అన్నంతో పాటు చేపలకూర తినేవాట. ఈ రెండింటి కాంబినేషన్ తో ఆమె బరువు తగ్గారట. కరీనా ఈ విషయం తన ఫ్రెండ్స్ కి చెప్పినప్పుడు వాళ్లు కూడా ఆశ్చర్యపోయారట. అయితే.. కరెక్ట్ గా ఎలా తినాలో తెలిస్తే.. ఈ రెండింటితోనే సులువుగా బరువు తగ్గొచ్చని ఆమె చెప్పారు.
చాలా మంది మేము ఉడకపెట్టిన కూరగాయలు లాంటివి మాత్రమే తింటారని అనుకుంటారని, కానీ.. తాను పోహ తినడానికి ఎక్కువగా ఇష్టపడతానని ఆమె చెప్పారు. అంతేకాకుండా.. ఎక్కువ కూరగాయలు మిక్స్ చేసి.. ఉప్మా ఇష్టంగా తింటానని ఆమె చెప్పారు. తినే వాటిలో మార్పులు చేసుకుంటే.. ఏవి తిన్నా.. బరువు కంట్రోల్ చేసుకోవచ్చని ఆమె చెప్పారు.
చాలా మంది అరటిపండ్లు, సపోటా తింటే బరువు పెరుగుతారు అనుకుంటారని.. కానీ తాను వాటిని ఇష్టంగా తింటానని కరీనా కపూర్ చెప్పారు. అరటి, సపోటాల్లో న్యూట్రియషన్స్ ఉంటాయని.. శరీరాకి అవసరమైన తక్షణ శక్తిని కూడా ఇవి అందిస్తాయని ఆమె చెప్పారు. ఎంత పని ఉన్నా, ఎక్కువగా ఒత్తిడి ఉన్నప్పుడు కూడా ఈ పండ్లు.. ఆ ఒత్తిడి తగ్గించడంలో కీలకంగా పని చేస్తాయని ఆమె చెప్పారు. అందుకే వీటిని తాను క్రమం తప్పకుండా తింటానని కరిష్మా చెప్పడం విశేషం.
ఇక రాత్రి భోజనంలో రోజూ చేపల కూర, అన్నం ఉండేలా చూసుకుంటారట. దీని వల్లే తాను బరువు తగ్గానని ఆమె చెప్పారు. అయితే.. ఈ ఫుడ్ అందరికీ బరువు తగ్గడానికి ఉపయోగపడకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. కొందరికి వర్కౌట్ అవుతుంది.. కొందరికి అవ్వదని నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి.. మీరు తీసుకునే ఆహారంలో కూరగాయల శాతం ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. అలాగే.. ప్రోటీన్ ఇన్ టేక్ కూడా ఉండేలా చూసుకోవాలి. అదేవిధంగా ప్రాసెస్డ్ ఫుడ్, షుగర్ లాంటి ఫుడ్స్ కి దూరంగా ఉండేలా చూసుకోవాలి.
కూరగాయలు, పండ్లు మీ ఆరోగ్యంలో భాగం చేసుకోవాలి. ఆరోగ్యకరమైన స్నాక్స్ , ఫ్రైడ్ ఫుడ్స్ లాంటి వాటికి దూరంగా ఉండాలి... ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే.. సులభంగా బరువు తగ్గవచ్చు.