మల్లెపూల వాటర్ ను ముఖానికి వాడితే ఏమౌతుందో తెలుసా?
Jasmine Flower: ఆడవారికి ఎంతో ఇష్టమైన పూలల్లో మల్లెపూలు ఒకటి. పండుగలు, పెళ్లిళ్లకు ఆడవారు ఖచ్చితంగా మల్లెపూలను పెట్టుకుంటారు. ఈ పువ్వులు కేవలం అలంకరణకు మాత్రమే కాదు.. చర్మ సమస్యలను తగ్గించుకోవడానికి కూడా ఉపయోగించొచ్చు.

మల్లెపూల వాటర్ ప్రయోజనాలు
మల్లెపూల సువాసన ఎంత బాగుంటుందో మాటల్లో చెప్పలేం. అందుకే ఆడవాళ్లకు ఈ పూవ్వులంటే చాలా ఇష్టం. పెళ్లిళ్లు, పండుగలకు ఈ పువ్వులను ఖచ్చితంగా పెట్టుకుంటారు. చాలా మంది పెరట్లో కూడా ఈ మొక్క ఉంటుంది. అయితే ఈ పువ్వులు కేవలం అలంకరణకు మాత్రమే ఉపయోగపడతాయని అనుకుంటారు.
కానీ ఈ పువ్వులు మనకు ఆరోగ్యం, అందం పరంగా కూడా ఉపయోగపడతాయి తెలుసా? ముఖ్యంగా ఈ పువ్వులను ఉపయోగించి మనం ఎన్నో చర్ మసస్యలను తగ్గించుకోవచ్చంటున్నారు నిపుణులు. ముఖ్యంగా మల్లెపూల వాటర్ ను చర్మానికి రాసుకోవడం వల్ల చాలా రకాల స్కిన్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. అందుకే దీని బెనిఫిట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
జాస్మిన్ వాటర్ చర్మానికి చేసే ప్రయోజనాలు
హైడ్రేషన్ సమస్య నుంచి ఉపశమనం
జాస్మిన్ వాటర్ మన చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఈ వాటర్ ను మన చర్మం త్వరగా శోషించుకుంటుంది. దీంతో చర్మం స్మూత్ గా అవుతుంది. అలాగే చర్మానికి పోషకాలు కూడా అందుతాయి. ఈ జాస్మిన్ వాటర్ ను రోజూ ఉపయోగించడం వల్ల చర్మం డీహైడ్రేట్ అయ్యే అవకాశం ఉండదు. ఇది చర్మ రంగును మెరుగుపర్చడానికి కూడా సహాయపడుతుంది. అలాగే చర్మాన్ని కాంతివంతంగా మెరిసేలా చేయడానికి సహాయపడుతుంది. తామర, మొటిమలు వంటి సమస్యలను తగ్గించడానికి కూడా ఈ జాస్మిన్ వాటర్ సహాయపడుతుంది.
యాంటీ ఆక్సిడెంట్ రక్షణ ఉంటుంది
మల్లెపూల వాటర్ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మానికి హాని చేసే ఫ్రీరాడికల్స్ నుంచి రక్షిస్తాయి. ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడానికి కూడా సహాయపడతాయి. అలాగే వృద్ధాప్య సంకేతాలైన ముఖంపై ముడతలు, గీతలు, డల్ స్కిన్ వంటి సమస్యలను తగ్గించడానికి కూడా జాస్మిన్ వాటర్ సహాయపడుతుంది. ఈ వాటర్ చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. కాబట్టి జాస్మిన్ వాటర్ ను రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల మీ చర్మం యవ్వనంగా, కాంతివంతంగా ఉంటుంది. అలాగే చర్మం ఎరుపు, దురద, మంట వంటి చర్మ సమస్యలను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది.
చర్మం కాంతివంతంగా ఉంటుంది
జాస్మిన్ వాటర్ లో చర్మాన్ని సహజంగా కాంతివంతంగా ఉంచే లక్షణాలు మెండుగా ఉంటాయి. కాబట్టి దీన్ని రెగ్యులర్ గా వాడితే చర్మమపు రంగు మెరుగుపడుతుంది. అలాగే ముఖంమీదున్న నల్ల మచ్చలు, తెల్ల మచ్చలు తగ్గుతాయి. జాస్మిన్ వాటర్ ను ప్రతిరోజూ ఉపయోగించడం వల్ల మీ చర్మం టైట్ గా, యవ్వనంగా ఉంటుంది.
జాస్మిన్ వాటర్ ను చర్మానికి ఎలా ఉపయోగించాలి?
ఈ జాస్మిన్ వాటర్ ను ఒక స్ప్రే బాటిల్ లో పోయాలి. దీన్ని ఉదయం స్నానం చేసిన తర్వాత మేకప్ కు ముందు ముఖానికి పిచికారి చేయాలి. అలాగే రాత్రిపూట ముఖాన్ని నీట్ గా కడుక్కుని పడుకునే ముందు పిచికారీ చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
మల్లెపూలతో ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి?
అరోమాథెరపీ
జాస్మిన్ ఆయిల్ ను ఎన్నో ఏండ్లుగా ఉపయోగిస్తున్నారు. ఇది నిరాశను, ఆందోళనను తగ్గించడానికి ఎంతగానో సహాయపడుతుంది. అలాగే ఇది చిరాకు వంటి భావోద్వేగాలను తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది. మల్లెపూలు మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. దీంతో మీకు రాత్రిళ్లు ప్రశాంతంగా నిద్రపడుతుంది. జాస్మిన్ అరోమాథెరపీ విశ్రాంతి, నిద్రను ప్రేరేపించేందుకు సహాయపడుతుందని పలు అధ్యయనాలు కూడా చెబుతున్నాయి.
మల్లెపూలతో చర్మానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి?
జాస్మిన్ తో కలిగే ముఖ్యమైన ప్రయోజనాల్లో చర్మ సంరక్షణ ఒకటి. చాలా మంది జాస్మిన్ ఎసెన్షియల్ ఆయిల్ ను చర్మ సంరక్షణలో బాగా ఉపయోగిస్తారు. దీనిలో తేమ, ఓదార్పు లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఇది మన చ్మాన్ని హైడ్రేట్ గా, ప్రకాశవంతంగా ఉంచేందుకు సహాయపడుతుంది. అలాగే ఇది మన చర్మానికి యవ్వన రంగును కూడా స్తుంది. దీనిలో ఆస్ట్రెంజెంట్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన చర్మాన్ని టోన్ చేస్తాయి. అలాగే ముడతలు, గీతలను తగ్గిస్తుంది.
జాస్మిన్ ఆయిలో లో మొటిమలు, తామర వంటి చర్మ సమ్యలను తగ్గించే లక్షణాలుంటాయి. మల్లెపూల నూనెలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మొటిమలను తగ్గిస్తాయి. అలాగే దీనిలో శోథ నిరోధక లక్షణాలు చికాకు, ఎరుపును తగ్గించడానికి సహాయపడతాయి.
మెల్లెపూలను కీళ్ల నొప్పులు, వెన్ను నొప్పి, కండరాల నొప్పి నుంచి పీరియడ్స్ తిమ్మిరి వంటి ఎన్నో సమస్యలను తగ్గించుకోవడానికి ఉపయోగిస్తారు. అంతేకాదు ఇది సయాటికా లాంటి నరాల నొప్పిని తగ్గించడానికి కూడా ఉపయోగిస్తారు. మల్లెచెట్టు వేర్లు, పువ్వులు, ఆకుల్లో ఉండే అనాల్జేసిక్, శోథనిరోధక లక్షణాలు నొప్పిని తగ్గించడానికి సహాయపడతాయి.
జాస్మిన్ హెయిర్ ఆయిల్ ప్రయోజనాలు
జాస్మిన్ ఆయిల్ మన జుట్టుకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. దీనిలో ఉండే లక్షణాలు తలలో పేను కాకుండా నిరోధిస్తుంది. అలాగే జుట్టును మంచి షైనీగా ఉంచుతుంది. అలాగే దీనిని వాడటం వల్ల జుట్టు బలంగా అవుతుంది. ఈ నూనెలో కండీషనింగ్ లక్షణాలు కూడా ఉంటాయి. ఈ నూనెను పెట్టడం వల్ల జుట్టు పొడుగ్గా పెరుగుతుంది.