cockroach: ఈ ఒక్కటుంటే మీ ఇంట్లో బొద్దింకలు లేకుండా పోతాయి
బొద్దింకలు చూడటానికి చిన్నగా ఉన్నా.. వీటివల్ల ఇళ్లంతా మురికిగా మారడమే కాకుండా మనకు లేనిపోని రోగాలు కూడా వస్తాయి. అందుకే వీటిని ఇంట్లో లేకుండా చేయాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

బొద్దింకలు
చాలా మంది ఇళ్లల్లో బొద్దింకలు ఉంటుంటాయి. వీటిని తరిమికొట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ అవి మాత్రం పోవు. ఈ బొద్దింకలు ఎక్కువగా తినే ఆహార పదార్థాలు, పానీయాల దగ్గరే ఎక్కువగా తిరుగుతుంటాయి. ఇంటి మూలల్లో దాకున్ని దుమ్ము, ధూళిని వ్యాపింపజేస్తుంటాయి. ఈ బొద్దింకల వల్ల ఇల్లు మురికిగా మారడమే కాకుండా.. మనల్ని ఎన్నో వ్యాధుల బారిన కూడా పడేస్తుంటాయి.
బొద్దింకలు
ఈ బొద్దింకలు ఇంట్లో నుంచి పారిపోవాలని మార్కెట్ నుంచి ఖరీదైన స్ప్రేలను కొనివాడుతుంటారు. అయినా ఇవి మాత్రం ఇల్లు దాటవు. అయితే మీరు కొన్ని సింపుల్ చిట్కాలతో ఇంట్లో ఒక్క బొద్దింక లేకుండా చేయొచ్చు తెలుసా? అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
బొద్దింకలు పోవాలంటే ఏం చేయాలి?
2 లేదా 3 టీ స్పూన్ల ఎండుమిర్చి లేదా నల్ల మిరియాల పొడిని కూడా వాడొచ్చు. అలాగే 1-2 టీస్పూన్ల ఆవాలు పొడి, 2-3 టేబుల్ స్పూన్ల నిమ్మరసం ( ఒక నిమ్మకాయ రసం మొత్తం), రెండు కప్పుల నీళ్లు (సుమారు 500 మి.లీ), ఖాళీ స్ప్రే బాటిల్ అవసరమవుతాయి. ప్రతి ఇంట్లో ఉన్న ఈ వస్తువులతో ఒక మిశ్రమాన్ని తయారుచేసి వాడితే మాత్రం మంచి ఫలితం వస్తుంది. వీటి ఘాటైన వాసన బొద్దింకలను తరిమికొడుతుంది.
బొద్దింకలను తరిమికొట్టడానికి స్ప్రేను ఎలా తయారుచేయాలి?
ముందుగా ఒక గిన్నెలో రెండు కప్పుల నీళ్లను తీసుకుని అందులో మిరపపొడి, నిమ్మరసం వేసి కలపండి. వీటన్నింటిని బాగా కలగలపండి. ఇలా చేస్తే దాంట్లో మిరపపొడి ముద్దలు ఉండవు. అలాగే పొడి మొత్తం నీళ్లలో బాగా కలిసిపోతుంది. ఆ తర్వాత దీన్ని స్ప్రే బాటిల్ లో నింపండి.
బొద్దింకలను తిప్పికొట్టడానికి స్ప్రేని ఎలా ఉపయోగించాలి?
ముందుగా బొద్దింకలు ఇంట్లో ఎక్కడెక్కడ తిరుగుతున్నాయో తెలుసుకోండి. సాధారణంగా బొద్దింకలు ఎక్కువగా కిచెన్ కౌంటర్, సింక్ కింద, క్యాబినెట్ల మూలల్లో, బాత్ రూం, చెత్త డబ్బాల చుట్టూ, ఫర్నీచర్ పగుళ్లలో, గోడల పగుళ్లలో ఎక్కువగా ఉంటాయి. ఈ ప్రదేశాల్లో మీరు తయారుచేసి పెట్టుకున్న దాన్ని స్ప్రే చేయండి. బొద్దింకలు దాక్కునే అన్ని ప్రదేశాల్లో దీన్ని స్ప్రే చేయండి. మొదట్లో దీన్ని మీరు రోజూ ఉపయోగించండి. అయితే బొద్దింకలు తగ్గితే మాత్రం వారానికి రెండు మూడు సార్లు ఉపయోగిస్తే సరిపోతుంది. ఇది ఇంట్లో ఒక్క బొద్దింక లేకుండా చేసే చాలా ఈజీ చిట్కా. కానీ ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. బొద్దింకలు రాత్రిపూట ఎక్కువగా తిరుగుతుంటాయి. కాబట్టి మీరు దీన్ని రాత్రిళ్లు స్ప్రే చేస్తే సరిపోతుంది.