ఫుడ్ ను టేస్టీగా చేయడానికి, పిండికి పురుగులు పట్టకుండా చేసే అమేజింగ్ కిచెన్ టిప్స్ మీకోసం..
గోధుమ పిండికి పురుగులు పట్టడం, ఉప్మా టేస్ట్ లెస్ గా అవ్వడం నుంచి గిన్నెలు వంటలతో మాడిపోవడం వరకు.. ఎన్నో పనులు ఆడవాళ్లకు చిరాకు పుట్టిస్తాయి. ఇలాంటప్పుడే వంటిళ్లంటేనే భయం వేస్తుంది. కానీ కొన్ని చిట్కాలతో మీ వంటింటి పనులు చాలా సులువు అవుతాయి.
kitchen tips 01
మన వంటింట్లో ఎన్నో రకాల ఆహార పదార్థాలు ఉంటాయి. చాలా మంది ఆడవారు నెలకు సరిపడా పప్పులు, ఉప్పులు, బియ్యాన్ని కొనేసి పెడుతుంటారు. ఇలాంటి వాటిని చాలా జాగ్రత్తగా చూసుకోవడం అవసరం. లేదంటే ఇవి పాడయ్యే అవకాశం ఉంది. దాదాపుగా పప్పులు, కారం పొడి, బియ్యం వంటి సరుకులకు పురుగులు ఎక్కువగా పడుతుంటాయి. అందుకే వీటిని అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉండాలి. ఒకవేళ మీరు సరుకులను సరిగ్గా నిల్వ చేయకపోతే.. వాటిని తిరిగి ఎలా ఉపయోగించాలో కూడా తెలిసి ఉండాలి. అయితే కొన్ని వంటింటి చిట్కాలు మీకు ఎంతో సహాయపడతాయి. అవేంటో తెలుసుకుందాం పదండి.
kitchen tips
పిండిని ఎలా నిల్వ చేయాలి?
ఇంట్లో పిండి ఎక్కువగా ఉంటే దాన్ని సరిగ్గా నిల్వ చేసుకోవాలి. లేదంటే కొన్ని రోజులకే పిండి పాతదై పోయి ఒక లాంటి వాసన రావడం మొదలవుతుంది. అలాగే పురుగులు, కీటకాలు కూడా పడతాయి. పిండికి ఎప్పుడూ ఫ్రెష్ గా ఉండాలన్నా.. పురుగులు, కీటకాలు పట్టకుండా ఉండాలన్నా.. మీరు పిండిలో కొన్ని బిర్యానీ ఆకలును వేయండి. దీనివల్ల పిండికి పురుగులు పట్టనే పట్టవు.
తుప్పును పోగొట్టే స్మార్ట్ ట్రిక్స్
ఇనుప కత్తి, ఇనుప పాన్, గ్రిడ్ వంటి వస్తువులను ఎక్కువగా ఉపయోగించకపోయినా.. ఉపయోగించినా రెండు మూడు రోజులకే తుప్పు పడుతుంటాయి. అయితే ఈ తప్పు వదలడానికి ఉల్లిపాయను కట్ చేసి తుప్పు పట్టిన ప్రదేశంలో రుద్దండి. ఇది వాటికున్న తుప్పును వదిలిస్తుంది.
మిగిలిపోయిన సలాడ్ తో ఏం చేయాలి?
చాలా మంది సలాడ్ ను సన్నగా తరిగి పెడుతుంటారు. కానీ చాలా సార్లు ఈ సలాడ్ ఎక్కువగా మిగిలిపోతుంటుంది. ఈ మిగిలిపోయిన సలాడ్ ను బయటపారేసే బదులుగా వాటిని మిక్సీలో గ్రైండ్ చేసి పిండిలో కలపండి. దీనితో టేస్టీ టేస్టీ పరోటాలను తయారుచేసి తినండి. లేదా ఈ సలాడ్ ను పావ్ బాజీలో కలిపితే టేస్ట్ పెరుగుతుంది.
స్టీల్ పాత్రలకు ఒకదానిలో ఒకటి ఇరుక్కుపోతే ఏం చేయాలి?
చాలాసార్లు స్టీల్ పాత్రలు ఒకదానిలోకి చొచ్చుకుపోయి అంటుకుంటుంటాయి. ఈ పాత్రలను వేరు చేయడానికి అంచులపై మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఇందుకోసం ఈ గిన్నెల అంచుకులకు నూనె వేయండి. ఇలా చేయడం వల్ల తక్కువ టైంలోనే గిన్నెలు ఒకదానికొకటి విడిపోతాయి.
ఉప్మా టేస్టీగా ఎలా తయారు చేయాలి?
చాలా మంది మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ లో ఉప్మాను ఎక్కువగా తింటుంటారు. కానీ కొన్ని కొన్ని సార్లు దీన్ని ఎంత బాగా ప్రిపేర్ చేసినా టేస్ట్ కాదు. అయితే ఈ సారి మీరు ఉప్మాను ప్రిపేర్ చేస్తుంటే.. దానిలో కొద్దిగా సెమోలినాలో నీటితో కొద్దిగా పెరుగు కలపండి. ఇలా చేయడం వల్ల ఉప్మా టేస్టీగా కావడమే కాకుండా.. మృదువుగా ఉంటుంది.
శెనగపిండి లడ్డూలు తినడం వల్ల పొట్ట బరువుగా అనిపిస్తే ఏం చేయాలి?
శెనగపిండి లడ్డూలు చాలా చాలా టేస్టీగా ఉంటాయి. కానీ వీటిని తిన్న తర్వాత పొట్ట బరువుగా మారుతుంది. కాబట్టి లడ్డూల తయారీకి శెనగపిండిని వేయించే ముందు నెయ్యిలో ఒక టీస్పూన్ పసుపు వేసి వేయించాలి. తర్వాత శెనగపిండి వేసి వేయించాలి. ఇలా చేయడం వల్ల శనగపిండి లడ్డూలు తినడం వల్ల గ్యాస్ సమస్య రాదు.