ఈ ఒక్కటి పెట్టినా.. డార్క్ సర్కిల్స్ లేకుండా పోతాయి
చాలా మంది ఆడవాళ్లకు ఈ సమస్య ఉంటుంది. కానీ డార్క్ సర్కిల్స్ వల్ల ముఖం అందంగా కనిపించదు. మచ్చలా ఇవే ముఖంలో కనిపిస్తాయి. అయితే మీరు ఒక్క పదార్థాన్ని ఉపయోగించి ఈ డార్క్ సర్కిల్స్ ను పూర్తిగా పోగొట్టొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
చాలా మంది ఆడవారికి డార్క్ సర్కిల్స్ సమస్య ఉంటుంది. నిజానికి ఈ సమస్యకు ఎన్నో కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఒత్తిడికి గురికావడం, టీవీ, ఫోన్, ల్యాప్ టాప్ వంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను ఎక్కువగా ఉపయోగించడం వంటి ఎన్నో కారణాల వల్ల కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడతాయి. అయితే వీటిని తగ్గించడానికి చాలా మంది బ్యూటీ సెలూన్లకు వెళుతుంటారు. కానీ ఇంట్లోనే కాఫీతో ఈ సమస్యలకు చాలా సింపుల్ గా చెక్ పెట్టొచ్చు.
dark circles
ఉదయాన్నే కాఫీ తాగితే రీఫ్రెష్ గా అనిపిస్తుంది. కాఫీ మనల్ని నిద్రలేపడానికి మాత్రమే కాదు నిద్రలేమి వల్ల వచ్చిన సమస్యలను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది తెలుసా? కాస్ట్లీ బ్యూటీ ప్రొడక్ట్స్ లో, మనం రోజూ తాగే కాఫీలో యాంటీ ఎక్స్ఫోలియేటింగ్ లక్షణాలు ఉంటాయి.
ఇవి మన చర్మంపై ఉన్న మృత కణాలను తొలగించడానికి బాగా సహాయపడతాయి. అలాగే చర్మాన్ని మృదువుగా, ప్రకాశవంతంగా చేయడానికి ఎంతగానో సహాయపడతాయి. దీంట్లో ఉండే విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్స్, ఫ్రీరాడికల్స్, కెఫిన్ వంటివి ముఖంపై ఉన్న ముడతలను, డార్క్ సర్కిల్స్ ను పోగొట్టడానికి ఎంతో గ్రేట్ గా సహాయపడతాయి.
డార్క్ సర్కిల్స్ కోసం కాఫీని ఎలా ఉపయోగించాలి?
కళ్ల చుట్టూ ఉన్నా నల్లటి వలయాలను పోగొట్టడానికి కాఫీ పౌడర్ లేదా కాఫీ జెల్ ను ఉపయోగించొచ్చు. దీనికోసం కాఫీ జెల్ ను తీసుకుని వేలితో కళ్ల కింద అప్లై చేసి కాసేపు మసాజ్ చేయాలి. రోజూ ఇలా చేయడం వల్ల ఈ నల్లటి వలయాలు క్రమ క్రమంగా తగ్గుతాయి.
కాఫీ , విటమిన్ ఇ
కాఫీ జెల్ తో పాటుగా కాఫీ పౌడర్, విటమిన్ ఇ క్యాప్సూల్స్ ను ఉపయోగించి కూడా డార్క్ సర్కిల్స్ ను పూర్తిగా పోగొట్టొచ్చు. ఇందుకోసం ఒక గిన్నెలో కాఫీ పౌడర్ ను వేసి దాంట్లో తేనె వేసి పేస్ట్ చేయండి. దీనిలోనే చిటికెడు విటమిన్ ఇ క్యాప్సూల్స్ వేసి బాగా కలపండి. ఆ తర్వాత డార్క్ సర్కిల్స్ మీద అప్లై చేసి కాసేపు మసాజ్ చేయండి. 10 నిమిషాల తర్వాత కూల్ వాటర్ తో కళ్లను కడగండి. ఇలా తరచుగా చేస్తే డార్క్ సర్కిల్స్ క్రమంగా మాయమవుతాయి. కానీ వెంటనే ఫలితం ఉండదు. వారానికి కనీసం మూడుసార్లు ఇలా చేస్తే తగ్గుతుంటాయి.
కాఫీ, బాదం నూనె
కాఫీ పొడి, బాదం పప్పులతో కూడా డార్క్ సర్కిల్స్ ను దూరం చేసుకోవచ్చు. ఈ రెండింటిలో ఉండే పోషకాలు డార్క్ సర్కిల్స్ ను తగ్గించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. ఇందుకోసం ఒక చిన్న గిన్నెలో కాఫీ పొడిని వేసి అందులో బాదం ఆయిల్ పోసి బాగా కలపండి. ఈ పేస్ట్ ను డార్క్ సర్కిల్స్ కు పెట్టండి. తర్వాత వేళ్లతో మసాజ్ చేయండి. అరగంట తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేయండి. దీనివల్ల మీ ముఖం కాంతివంతంగా మెరిసిపోతుంది.