సబ్బులు ఎక్కువ రోజులు రావాలంటే ఏం చేయాలి?
ప్రతి ఇంట్లో సబ్బులను ఖచ్చితంగా ఉపయోగిస్తారు. కానీ కొన్ని సబ్బులు చాలా త్వరగా కరిగిపోతుంటాయి. అయితే మీరు కొన్ని చిట్కాలను పాటిస్తే సబ్బులు చాలా రోజులు వస్తాయి. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
ప్రతి ఒక్కరూ ఇంట్లో ఎన్నో చిన్న చిన్న వస్తువులను ఉపయోగిస్తుంటారు. ఇలాంటి వాటిలో సబ్బు ఒకటి. స్నానం చేయడానికి, దుస్తులు ఉతకడానికి, పాత్రలను తోమడానికి రకరకాల సబ్బులను ఉపయోగిస్తుంటాం. అయితే చాలా సార్లు ఈ సబ్బులు చాలా తర్వగా అయిపోతుంటాయి. దీంతో మరో సబ్బును వాడుతుంటాం.
అయితే చాలా మంది ఒకేసారి ఐదారు సబ్బులను ఒకేసారి కొంటుంటారు. ఒకటి అయిపోగానే మరొకటి వాడొచ్చని. కానీ చాలా మంది ఆడవారు ఇంట్లో ఎన్ని సబ్బులు ఉన్నాయో గమనించుకోరు. దీనివల్ల సడెన్ గా సబ్బులు అయినపోయినప్పుడు మార్కెట్ కు వెళ్లాల్సి వస్తుంది. ఇలాంటి టైంలో మార్కెట్ కు అస్సలు వెళ్లాలనిపించదు. సబ్బులు తక్కువ ధరకే ఉన్నా.. చాలా మంది వీటిని నీటిలో పెట్టి డబ్బును వృధా చేస్తుంటారు. మీరు డబ్బును ఆదా చేయాలంటే మాత్రం సబ్బులను కూడా సరిగ్గా ఉపయోగించడం నేర్చుకోవాలి. సబ్బులను వాడేటప్పుడు కొన్ని చిన్న చిన్న విషయాలను జాగ్రత్తగా చూసుకుంటే అవి ఎక్కువ కాలం వచ్చేలా చేయొచ్చు. ఇందుకోసం ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం పదండి.
సబ్బును చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి
సబ్బు ఎక్కువ రోజులు రావాలంటే మాత్రం మీరు దానిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. మీరు వాడాలనుకుంటే ఈ ముక్కల్లో ఒకదాన్ని మాత్రమే బయటకు తీసి వాడండి. దీంతో మిగిలిన సబ్బు పొడిగానే ఉంటుంది. తడిసి పాడవదు. ఇలా సబ్బును వాడితే మీరు ఒకేసబ్బును చాలా రోజుల వరకు వాడొచ్చు. అయితే సబ్బు మొత్తాన్ని తడిపితే అది త్వరగా కరిగిపోతుంది.
సబ్బును పొడిగా ఉంచండి
సాధారణంగా సబ్బు త్వరగా అయిపోవడానికి అసలు కారణం తడిగా ఉండటమే. అవును తడి వల్ల సబ్బు మొత్తం కరుగుతుంది. తొందరగా అయిపోతుంది. అందుకే మీరు సబ్బును ఉపయోగించినప్పుడల్లా అది పొడిగా ఉండేట్టు చూడండి. సబ్బు పొడిగా ఉంటే సబ్బు ఎక్కువ రోజులు వస్తుంది. సబ్బుకున్న అదనపు నీటిని తొలగించే ర్యాక్ లేదా సబ్బు డిష్ లోనే సబ్బును ఉంచండి. రోజుల్లో రంధ్రాలతో కూడిన సబ్బు పెట్టెలు మార్కెట్ లో చాలా తక్కువ ధరకే దొరుకుతున్నాయి. వీటిని ఉపయోగిస్తే సబ్బు ఎక్కువ రోజులు వస్తుంది.
Soap
మీరు ఉపయోగించే సబ్బు పెట్టెకు గాలి తగిలేట్టు ఉండాలి. గాలి వెళ్లని కంటైనర్ ను ఉపయోగిస్తే సబ్బు తడిగానే ఉంటుంది. గాలి తగిలే సబ్బు పెట్టెను ఉపయోగిస్తే సబ్బు పొడిగా ఉంటుంది. ఎక్కువ రోజులు వస్తుంది.
స్పాంజ్ లేదా బాత్ పౌఫ్
సబ్బును ఎక్కువ కాలం ఉపయోగించడానికి ఇది సులభమైన మార్గం. సబ్బును నేరుగా ఉపయోగించొద్దు. దీనికి బదులుగా స్పాంజ్ ను తడిపి దానిపై సబ్బు రుద్దండి. మీరు సబ్బును తిరిగి ఆరబెట్టి, ఈ స్పాంజ్ ఉపయోగించండి. సబ్బును ఈ విధంగా ఉపయోగిస్తే చాలా తక్కువ మొత్తంలో సబ్బును తీసుకుంటారు. సబ్బు కూడా ఎక్కువ రోజులు వస్తుంది.