చలికాలంలో ఈ నూనెలు.. జుట్టు ఒత్తుగా చేస్తాయి..!
ఈ కింది నూనెలను ఉపయోగించాలని నిపుణులు సూచిస్తున్నారు. మరి ఆ నూనెలేంటో ఓసారి చూసేద్దాం..
మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ... చలికాలంలో జుట్టు రాలే సమస్య కాస్త ఎక్కువగానే ఉంటుంది. మరి ఆ సమస్యకు చెక్ పెట్టి.. జుట్టు ఒత్తుగా పెరగాలి అంటే... ఈ కింది నూనెలను ఉపయోగించాలని నిపుణులు సూచిస్తున్నారు. మరి ఆ నూనెలేంటో ఓసారి చూసేద్దాం..
olive oil
1.ఆలివ్ ఆయిల్..
చలికాలంలో జుట్టు రాలే సమస్యకు చెక్ పెట్టడానికి ఆలివ్ ఆయిల్ గొప్పగా పనిచేస్తుంది. ఎక్కువగా చలికాలంలో జుట్టు ఎక్కువగా.. పొడిబారడం లాంటివి జరుగుతూ ఉంటాయి. వాటన్నింటికీ ఆలివ్ ఆయిల్ చెక్ పెడుతుంది.
onion
2.కొబ్బరి నూనె...
చలికాలంలో జుట్టు సమస్యలకు చెక్ పెట్టాలంటే కొబ్బరి నూనె చక్కని పరిష్కారం. జుట్టు విరిగిపోవడం లాంటివి జరిగి ఇబ్బందిపడుతున్నవారు.. కొబ్బరి నూనెను తరచూ ఉపయోగించడం వల్ల ఆ సమస్య నుంచి బయటపడొచ్చు.
3.ఉల్లిపాయ నూనె..
చాలా ఔషదాలలో ఉల్లిపాను ఉపయోగిస్తూ ఉంటారు. ఈ ఉల్లిపాయ జుట్టురాలే సమస్యకు కూడా పరిష్కారం చూపిస్తుంది. ఉల్లినూనెలో పొటాషియం, సల్ఫర్ ఎక్కువగా ఉంటాయి. ఇవి స్ప్లిట్ హెయిర్ కి కూడా చక్కని పరిష్కారం చూపిస్తాయి.
4.వేప నూనె...
వేప నూనె చాలా రకాల జుట్టు సమస్యలకు పరిష్కారం చూపిస్తుంది. తరచూ ఈ నూనెతో జుట్టుకు మసాజ్ చేయడం వల్ల.. జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి ఉపయోగపడుతుంది.
5.ఆవనూనె..
చాలా మంది ఇంటిలో కామన్ ఉపయోగించే నూనె ఇది. ఈ నూనె జుట్టు ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. దీనిలో ఉన్న విటమిన్స్ జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి ఉపయోగడతుంది.
amla
6.ఉసిరి నూనె..
ఉసిరి లో చాలా రకాల ఔషధాలు ఉంటాయి. ఈ ఔషధాలు జుట్టు ఎదుగుదలకు ఎంతగానో సమాయం చేస్తాయి. దీనిలోని విటమిన్ సీ, విటమిన్ ఈ , యాంటీ ఆక్సిడెంట్స్ జుట్టుకు ఎంతగానో ఉపయోగపడతాయి.6.ఉసిరి నూనె..
ఉసిరి లో చాలా రకాల ఔషధాలు ఉంటాయి. ఈ ఔషధాలు జుట్టు ఎదుగుదలకు ఎంతగానో సమాయం చేస్తాయి. దీనిలోని విటమిన్ సీ, విటమిన్ ఈ , యాంటీ ఆక్సిడెంట్స్ జుట్టుకు ఎంతగానో ఉపయోగపడతాయి.
castor oil
7.ఆముదం నూనె...
ఆముదం కూడా జుట్టు పెరుగుదలకు ఎంతగానో సహాయం చేస్తుంది. ఆముదం ఉపయోగించడం వల్ల జుట్టు పొడిబారడం లాంటి సమస్య ఏర్పడదు. ఈ నూనెలో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. జుట్టు మాయిశ్చరైజ్ చేయడానికి ఉపయోగపడతాయి.
8.బృంగరాజ్ ఆయిల్...
బృంగరాజ్ ఆయిల్ లో కాల్షియం, విటమిన్ ఈ, మెగ్నీషియం, ఐరన్, విటమిన్ డీ, విటమిన్ ఈ పుష్కలంగా ఉంటాయి. ఇది జుట్టు బాగా పెరగడానికి ఉపయోగడపటంతో పాటు... దురద లాంటి సమస్య రాకుండా చూస్తాయి.
9.బాదం నూనె...
చాలా మంది బాదంను ఇష్టంగా తింటారు. ఈ బాదం నూనె.. జుట్టు బలంగా మారడానికి ఉపయోగపడుతుంది. జుట్టు మెరుస్తూ.. కుదుళ్లు బలంగా తయారవ్వడానికి ఉపయోగపడుతుంది.
10.నువ్వుల నూనె..
నువ్వుల నూనెను మనలో చాలా మంది కేవలం వంటలకు మాత్రమే ఉపయోగిస్తాం. అయితే... ఈ నూనె జుట్టుకు కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. జుట్టు అందంగా మెరవడానికి, జుట్టు ఒత్తుగా పెరగడానికి ఉపయోగపడుతుంది.