ఏసీ వాడినా కరెంట్ బిల్లు ఎక్కువ రావద్దంటే ఏం చేయాలి..?
మళ్లీ ఆన్ చేసుకుంటాం కదా ఆ మాత్రానికి స్విచ్ఛ్ ఎందుకు ఆఫ్ ఛేయడం.. రిమోట్ చేస్తే చాలదా అనుకుంటారు. కానీ..అక్కడే మనం పప్పులో కాలు వేస్తున్నాం
Air conditioner
ఎండాకాలం వచ్చేసింది. ఏప్రిల్ లో మండిపోవాల్సిన ఎండలు.. మార్చిలో నే భగభగమంటున్నాయి. బయటకు వెళ్లే వారికే కాదు.. ఇంట్లో ఉంటేనే ఉక్కపోతగా ఉంటోంది. ఫ్యాన్ గాలి ఏ మాత్రం సరిపోవడం లేదు.. కచ్చితంగా ఏసీ లు ఆన్ అవ్వాల్సిందే అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. ఈ రోజుల్లో ఏసీలు లేనివాళ్లు చాలా తక్కువ అనే చెప్పొచ్చు. కానీ.. ఏసీ వాడితే కరెంట్ బిల్లు వాచిపోతుందని చాలా మంది భయపడతారు. కానీ సింపుల్ ట్రిక్స్ తో కరెంట్ బిల్లును కూడా కంట్రోల్ చేయవచ్చు.
మనం దాదాపుగా ఏసీని రిమోట్ తో కంట్రోల్ చేస్తాం. ఆఫ్ ఛేయడం కూడా రిమోట్ తోనే ఆఫ్ చేస్తారు. కానీ.. స్టేబులేజర్ స్విచ్ఛ్ మాత్రం తొందరగా ఆఫ్ చేయరు. ఆ.. మళ్లీ ఆన్ చేసుకుంటాం కదా ఆ మాత్రానికి స్విచ్ఛ్ ఎందుకు ఆఫ్ ఛేయడం.. రిమోట్ చేస్తే చాలదా అనుకుంటారు. కానీ..అక్కడే మనం పప్పులో కాలు వేస్తున్నాం
నిజానికి సమ్మర్ వచ్చింది అంటే చాలు ఏసీల వాడకం పెరిగిపోతుంది. దీంతో కరెంటు బిల్లు పెరుగుతుంది. కాబట్టి, రిమోట్ కంట్రోల్‌లో మాత్రమే కాకుండా, స్టెబిలైజర్‌ను కూడా స్విచ్ ఆఫ్ చేయండి. దీంతో సులభంగా విద్యుత్ బిల్లు ఆదా అవుతుంది. ఈ విషయం తెలియక మనలో చాలా మంది పవర్ బిల్లును వేలకు వేలు పెంచేసుకుంటున్నారు.
అంతేకాకుండా, చాలా మంది రిమోట్‌లో టైమర్‌ను సెట్ చేసి రాత్రిపూట హాయిగా నిద్రపోతారు. పేర్కొన్న సమయం తర్వాత రిమోట్ స్వయంచాలకంగా ఆన్ అవుతుంది. కానీ స్టెబిలైజర్ స్విచ్ ఆఫ్ చేయడం ద్వారా మాత్రమే కరెంట్ బిల్లు తగ్గుతుంది. లేదంటే కరెంట్ బిల్లు భారం కావడం ఖాయం.
అలాగే మీరు వాడే డెకరేటివ్ లైట్లు కూడా అనవసరం కాబట్టి వాటిని వాడకుండా ఉండడం మంచిది. కాబట్టి, ఏసీని రిమోట్‌గా ఆఫ్ చేస్తున్నప్పుడు స్టెబిలైజర్ స్విచ్‌ను ఆఫ్ చేయడం మర్చిపోవద్దు. ఇలా చేస్తే వేసవిలో నిరంతర విద్యుత్ పొందవచ్చు.