కొబ్బరి నూనెను ముఖానికి ఇలా వాడితే ఎన్ని లాభాలో..
కొబ్బరి నూనెను ఒక్క జుట్టుకు మాత్రమే కాదు.. ముఖానికి, చర్మానికి కూడా పెట్టుకోవచ్చు. దీనిని నేచురల్ మాయిశ్చరైజర్ అంటారు. కాబట్టి ఇది మన చర్మానికి మంచి పోషణను అందించి చర్మ సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది.
వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల మన అనారోగ్య సమస్యలు రావడంతో పాటుగా చర్మ సమస్యలు కూడా వస్తుంటాయి. ముఖ్యంగా ఈ మార్పుల వల్ల చర్మం బాగా పొడిబారిపోతుంది. దీనివల్ల చర్మం డల్ గా, నిర్జీవంగా కనిపిస్తుంది.
ఈ డ్రై స్కిన్ వల్ల ఇతర చర్మ సమస్యలు కూడా రావడం మొదలవుతుంది. అయితే డ్రై స్కిన్ ఉన్నవారు కొబ్బరి నూనెను ఉపయోగిస్తే మంచిదని నిపుణులు చెబుతున్నారు.
అవును కొబ్బరి నూనె ఒక్క జుట్టుకే కాదు మన చర్మానికి కూడా మంచి మేలు చేస్తుంది. దీన్ని సరిగ్గా ఉపయోగిస్తే డ్రై స్కిన్ సమస్య పోయి ముఖం అందంగా మెరిసిపోతుంది.
కొబ్బరి నూనె చర్మానికి చేసే మేలు
కొబ్బరి నూనెను నేచురల్ మాయిశ్చరైజర్ అని కూడా అంటారు. దీనిలో ఎన్నో ఔషదలక్షణాలు ఉంటాయి. ఇది మన ఆరోగ్యానికి, చర్మానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. కొబ్బరి నూనెను సరిగ్గా ఉపయోగిస్తే డ్రై స్కిన్ తో పాటుగా ఎన్నో చర్మ సమస్యలు తగ్గిపోతాయి. కొబ్బరి నూనె మన చర్మాన్ని అందంగా మార్చడానికి కూడా సహాయపడుతుంది. ఇందుకోసం కొబ్బరి నూనెను ముఖానికి ఎలా వాడాలంటే?
coconut oil
రాత్రిపూట కొబ్బరి నూనె వాడండి
మీ ముఖ చర్మం డ్రై గా అయితే రాత్రిపూట మర్చిపోకుండా కొబ్బరి నూనెను పెట్టండి. అవును ఇది డ్రై స్కిన్ సమస్యను తగ్గించి ముఖాన్ని అందంగా మార్చేస్తుంది. ఇందుకోసం ముందుగా మీ ముఖాన్ని సబ్బుతో కడగండి. ఆ తర్వాత కొంచెం కొబ్బరి నూనెను తీసుకుని ముఖానికి అప్లై చేయండి. ఆ తర్వాత కొద్దిసేపు చేతుల్తో ముఖాన్ని మసాజ్ చేయండి.
ఫేస్ మాస్క్ లా..
మీరు కావాలనుకుంటే కొబ్బరి నూనె ఫేస్ మాస్క్ ను కూడా వేసుకోవచ్చు. ఈ మాస్క్ ను నిపుణుల సహాయంతో తయారుచేసి వాడొచ్చు. మన చర్మానికి కొబ్బరినూనె ఫేస్ మాస్క్ మంచి పోషణను అందిస్తుంది. దీంతో చర్మం అందంగా, కాంతివంతంగా మారుతుంది. అయితే కొబ్బరి నూనె ఫేస్ మాస్క్ ను వాడటానికి ముందు మీ ముఖాన్ని నీట్ గా కడగండి. ఆ తర్వాత మాస్క్ వేసుకోండి. అయితే దీన్ని ప్రయత్నించే ముందు నిపుణుల సలహా ఖచ్చితంగా తీసుకోవాలి.
Image: Getty Images
స్క్రబ్ లాగ ఉపయోగించండి
కొబ్బరి నూనెను మీరు స్క్రబ్ లాగా కూడా ఉపయోగించొచ్చు. ఈ స్క్రబ్ ముఖంపై చనిపోయిన చర్మ కణాలను తొలగించడానికి, ముఖాన్ని కాంతివంతంగా చేయడానికి సహాయపడుతుంది. అయితే ఈ ఫేస్ స్క్రబ్ ను నిపుణుల సహాయంతో తయారుచేసి వాడాలి. ఈ విధంగా మీరు ముఖానికి కొబ్బరి నూనెను వాడితే మీ ముఖం అందంగా కనిపిస్తుంది. యవ్వనంగా ఉంటారు. ముడతలు తగ్గిపోతాయి.