తలకు హెన్నా రాస్తే... జుట్టు ఊడిపోతుందా..?
ఈ హెన్నా అందరికీ సూట్ కాకపోవచ్చు. ప్యాచ్ టెస్టు చేసుకోకుండా... మంచిది కదా అని రాసుకుంటే మాత్రం సమస్యలు ఎదుర్కోక తప్పదని నిపుణులు చెబుతున్నారు.
తలకు హెన్నా పెట్టడం.. సాంప్రదాయ బద్ధంగా మనం వాడుతూ వస్తున్న పద్దతి. కొద్దిగా తెల్ల వెంట్రుకలు రావడం మొదలుపెడితే చాలు.. వెంటనే హెన్నా అప్లై చేస్తారు. మార్కెట్లో లభించే ఏవేవో కలర్స్ వాడితే.. అప్పటికప్పుడు జుట్టు నల్లగా మారొచ్చు. కానీ... తొందరగా ఊడిపోయే ప్రమాదం ఉంది అని భయపడతారు. అందుకే సహజ సిద్ధమైన గోరింటాకు, లేదంటే.. హెన్నా, మెహందీ అప్లై చేస్తూ ఉంటారు. దీని వల్ల.. జుట్టు పాడవ్వకపోగా.. మంచిగా తెల్ల వెంట్రుకలు ఎర్రగా మారడంతో పాటు.. కుదుళ్లు కూడా బలంగా మారతాయి. అని ఇప్పటి వరకు మనం నమ్ముతూ వస్తున్నాం. కానీ. హెన్నా రాయడం వల్ల,. జుట్టు ఊడిపోతుందని మీకు తెలుసా? నమ్మసక్యంగా లేకపోయినా ఇదే నిజం.. హెన్నా రాయడం వల్ల.. జుట్టు రాలిపోవడం ఖాయం అట.
అయితే... నిజంగా హెన్నా రాయడం వల్ల జుట్టు ఊడిపోదు. కానీ.. మీరు దానిని సరిగా రాయకపోతే మాత్రం.. ఊడిపోతుంది. ఈ హెన్నా అందరికీ సూట్ కాకపోవచ్చు. ప్యాచ్ టెస్టు చేసుకోకుండా... మంచిది కదా అని రాసుకుంటే మాత్రం సమస్యలు ఎదుర్కోక తప్పదని నిపుణులు చెబుతున్నారు.
హెన్నా మీరు తలకు రాసుకున్నపుడు ఎలాంటి రియాక్షన్ రాకపోతే.. పర్వాలేదు.. కానీ అలా కాకుండా మీకు తలలో విపరీతమైన దురద , అలర్జీ లక్షణాలు కనిపిస్తే మాత్రం దూరంగా ఉండాల్సిందే. అందరికీ రాకపోవచ్చు. కానీ కొందరికి వస్తాయి. అందుకే.. హెన్నా రాసేముందు ప్యాచ్ టెస్టు చేసుకొని.. ఎలాంటి రియాక్షన్ రాకపోతేనే తర్వాత.. తలకు బాగా పట్టించాలి. లేకపోతే దూరంగా ఉండటమే మంచిది.
కొందరు.. జుట్టు తెల్లగా ఉండకుండా ఉండాలంటే... హెన్నా పెడుతుంటారు. గ్యాప్ ఇస్తే.. ఎక్కడ మళ్లీ తెల్లగా కనిపిస్తాయా అని.. గ్యాప్ ఇవ్వకుండా.. హెన్నా అప్లై చేస్తూనే ఉంటారు. కానీ.. తరచూ హెన్నా అప్లై చేస్తూ ఉండటం వల్ల.. జట్టు పొడిబారిపోతుంది. మన జుట్టులో ఉండే సహజ నూనెలు అన్నీ పోయి.. జుట్టు నిర్జీవంగా మారిపోతుంది. కాబట్టి.. ఎక్కువగా రాయడం కూడా మంచిది కాదు. మనం హెన్నా అప్లై చేస్తున్నాం అంటే.. మన జుట్టు మంచి కండిషనింగ్ గా ఉండేలా చూసుకోవాలి. దానికి తగినట్లు కొన్ని పదార్థాలు దానిలో కలిపి మాత్రమే రాయాలి.
అంతేకాదు.. హెన్నా రాయడం వల్ల... జుట్టు రంగు మారుతుంది. అది ప్రతిసారీ మనకు ఒకేలాంటి రంగు ఇవ్వదు. మనం తలకు ఉంచిన సమయాన్ని బట్టి, హెన్నా పేస్ట్ కలిపిన విధానాన్ని బట్టి కూడా రంగు మారుతుంది. ఇక.. ఒకసారి ఆ హెన్నాతో జుట్టు రంగు మారింది అంటే.. వెంటనే మళ్లీ మనకు నచ్చిన రంగులో మార్చుకోవడానికి కుదరదు
ఆ రంగు మొత్తం పోయేవరకు వేచి ఉండాల్సిందే. అంతెందుకు ఎక్కువగా ఈ హెన్నా అప్లై చేయడం వల్ల హెయిర్ టెక్చర్ కూడా మారిపోతుంది. ఫలితంగా.. జుట్టు బలహీనంగా మారి.. ఊడిపోయి, రాలిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.