Hair Oil: కొబ్బరి నూనె కాదు, ఈ నూనె రాస్తే అసలు జుట్టు రాలదు..!
Hair Oil: ఉల్లిపాయలో సల్ఫర్ చాలా ఎక్కువగా ఉంటుంది. జుట్టుకు బలాన్ని ఇచ్చే ప్రధాన ప్రోటీన్ కెరాటిన్ ఉత్పత్తికి ఇది మూల పదార్థం. అందుకే, ఉల్లిపాయ నూనె వాడితే జుట్టు రాలడం తగ్గుతుంది.

Hair Growth
ఈ రోజుల్లో జుట్టును అందంగా మార్చుకోవడానికి మార్కెట్లో చాలా రకాల నూనెలు అందుబాటులో ఉన్నాయి. కానీ, మన పూర్వీకులు మాత్రం జుట్టు అందంగా మార్చడానికి సహజ మార్గాలను మాత్రమే ఎంచుకునేవారు. అందులో ఉల్లిపాయ కూడా ఒకటి. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు అంటారు. ఇది ఆరోగ్యం విషయంలో మాత్రమే కాదు.. అందంలోనూ ఇది కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే, ఉల్లి నూనెను వాడితే.. జుట్టు ఒత్తుగా మారుతుంది. మరి, ఈ నూనెను ఎలా వాడాలో ఇప్పుడు చూద్దాం....
ఉల్లిపాయ నూనెను తలకు రాసినప్పుడు, అది తల చర్మంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. దీని వల్ల జుట్టు కుదుళ్లకు ఎక్కువ పోషణ లభిస్తుంది. ఇలా చేయడం ద్వారా జుట్టు బలంగా, మెరిసేలా, ఆరోగ్యంగా మారుతుంది.
ఉల్లి నూనెను ఎలా తయారు చేయాలంటే....
ఈ నూనె తయారు చేయడానికి కొబ్బరి నూనె 500 మిల్లీ గ్రాములు, ఉల్లిపాయలు-2 చిన్న ముక్కలుగా తరిగినవి, కరివేపాకు 15 నుంచి 20, మెంతులు 10 నుంచి 15, వెల్లుల్లి రెబ్బలు 10 తీసుకోవాలి.
నూనె తయారు చేయడానికి... ఒక పాన్ లో కొబ్బరి నూనె పోసి అందులో తరిగిన ఉల్లిపాయ, కరివేపాకు, మెంతులు, వెల్లుల్లి రెబ్బలు వేసి మీడియం మంటపై వేడి చేయాలి. ఆ నూనెలో ఉల్లిపాయలు గోధుమ రంగులోకి మారినప్పుడు.. స్టవ్ ఆఫ్ చేయండి. ఈ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత.. దానిని వడకట్టాలి. ఈ మిశ్రమాన్ని ఏదైనా గాజు సీసాలో స్టోర్ చేసుకోవాలి. ఈ నూనెను ఒక్కసారి తయారు చేసుకుంటే.. నెల రోజులు వాడుకోవచ్చు.
ఒక పాన్‌లో కొబ్బరి నూనె పోసి అందులో తరిగిన ఉల్లిపాయ, కరివేపాకు, మెంతులు, వెల్లుల్లి వేసి మీడియం మంటపై వేడి చేయండి. ఉల్లిపాయలు గోధుమ రంగులోకి మారినప్పుడు స్టవ్ ఆఫ్ చేయండి. మిశ్రమం పూర్తిగా చల్లబడిన తర్వాత, దాన్ని సన్నని వస్త్రం లేదా స్ట్రైనర్‌తో వడకట్టి గాలి చొరబడని సీసాలో నిల్వ చేయండి.
నూనెను జుట్టుకు ఎలా వాడాలంటే....
వారానికి రెండు సార్లు ఈ నూనెను తలకు రాసి కనీసం మూడు గంటల పాటు అలాగే ఉంచండి. ఆపై గోరువెచ్చని నీటితో సల్ఫేట్-రహిత షాంపూతో కడగండి. క్రమం తప్పకుండా వాడితే మూడు నుండి నాలుగు నెలల్లో జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.
ఈ నూనెను రెగ్యులర్ గా వాడటం వల్ల కలిగే ప్రయోజనాలు....
ఈ నూనెను క్రమం తప్పకుండా రాయడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. జుట్టు కుదుళ్లు బలపడతాయి. అంతేకాదు.. జుట్టుకు సహజంగా మెరుపు కూడా వస్తుంది. తలకు రక్త ప్రసరణ పెరుగుతుంది. కొత్తగా జుట్టు పెరగడానికి కూడా సహాయపడుతుంది.