Hair Growth: మందార పూలను ఇలా వాడితే...జుట్టు ఒత్తుగా పెరుగుతుంది..!
Hair Growth: జుట్టు అందంగా కనిపించాలన్నా, హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉండకూడదు అనుకున్నా.. ఖరీదైన హెయిర్ ప్రొడక్ట్స్ వాడాలి అని అనుకుంటారు. కానీ,అవేమీ లేకపోయినా జుట్టు అందంగా మార్చుకోవచ్చు.

Hair Growth
మహిళలు తమ అందాన్ని పెంచుకోవడానికి చాలా కష్టపడుతూ ఉంటారు. అందులో జుట్టు సంరక్షణ కూడా ఒకటి. దాని కోసం ఏవేవో షాంపూలు, కండిషనర్లు వాడుతూ ఉంటారు. కానీ ఈ రోజుల్లో అందమైన జుట్టు పొందడం అంత ఈజీ కాదు. అందులోనూ కెమికల్స్ తో నిండిపోయిన షాంపూలను వాడుతూ జుట్టును పెంచడం అంటే పెద్ద సవాలు అనే చెప్పొచ్చు. అంతేకాదు.. సరైన పోషకాలు ఉన్న ఆహారాలు తీసుకోకపోవడం, చండ్రు వంటి కారణాల వల్ల హెయిర్ ఫాల చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే... ఈ సమస్యలన్నింటినీ కేవలం మందార పూలతో చెక్ పెట్టొచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం....
జుట్టు పెరుగుదలకు మందార హెయిర్ ప్యాక్....
మహిళల జుట్టును బలోపేతం చేసే హెయిర్ ప్యాక్ తయారు చేయడానికి మందార పూలు, ఆకులు చాలా బాగా సహాయపడతాయి. ఇవి జుట్టు కుదుళ్లను బలంగా మారుస్తాయి. జుట్టు రాలడాన్ని కూడా తగ్గిస్తాయి.
హెయిర్ ప్యాక్ ఎలా చేయాలి?
ముందుగా మందార ఆకులు, పువ్వులు తీసుకొని వాటిని బాగా శుభ్రం చేసుకోవాలి. తర్వాత జుట్టును తేమగా ఉంచడానికి కలబంద జెల్, తెల్ల జుట్టు సమస్యకు చెక్ పెట్టడానికి కరివేపాకు, జుట్టు పెరుగుదల పెంచడానికి ఉల్లిపాయ, జుట్టు రాలడాన్ని తగ్గించడానికి మెంతులు తీసుకోవాలి. వీటన్నింటినీ... మిక్సర్ లో వేసి...మెత్తని పేస్టులాగా చేసుకోవాలి. దీనిలోనే మందార ఆకులు, పూలు కూడా వేసి రుబ్బుకోవాలి. అంతే.. మీ హెయిర్ ప్యాక్ తయారైనట్లే.
గోరు వెచ్చని నీటితో హెయిర్ వాష్..
ఈ మిశ్రమాన్ని మీ జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు అప్లై చేయాలి. అరగంటపాటు అలానే వదిలేయాలి. ఆ తర్వాత గోరు వెచ్చని నీటితో మీ జుట్టును శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల జుట్టు మంచి పోషకాలు అందుతాయి. జుట్టును అందంగా మారుస్తాయి. రెగ్యులర్ గా ఇలా చేయడం వల్ల మీ జుట్టు సహజంగా మెరుస్తూ కనపడుతుంది. హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ లో ఉంటుంది.