పీరియడ్స్ విషయంలో ఇవన్నీ అబద్దాలే, అసలు నిజాలు ఇవే..!
పీరియడ్స్ లో అవి చేయకూడదు, ఇవి చేయకూడదు అంటూ చాలానే వినే ఉంటారు. వాటిల్లో ఏది నిజం. శాస్త్రవేత్తలు, నిపుణులు ఏం చెప్పారో తెలుసుకుందాం....

periods
పీరియడ్స్ మహిళలకు సర్వ సాధారణం. ప్రతినెలా పీరియడ్స్ వస్తూనే ఉంటాయి. అయితే.. ఈ పీరియడ్స్ విషయంలో చాలా కామన్ గా ఎన్నో అపోహలు ప్రచారంలో ఉన్నాయి. పీరియడ్స్ లో అవి చేయకూడదు, ఇవి చేయకూడదు అంటూ చాలానే వినే ఉంటారు. వాటిల్లో ఏది నిజం. శాస్త్రవేత్తలు, నిపుణులు ఏం చెప్పారో తెలుసుకుందాం....
Periods
1.పీరియడ్స్ లో మహిళలు అపవిత్రులు అవుతారా?
ఇప్పటికీ పీరియడ్స్ సమయంలో చాలా మంది మహిళలను ఇంట్లోకి రానివ్వరు. దూరంగా ఉంచుతారు. కొన్ని ప్రదేశాలకు వెళ్లకూడదని, గుడికి వెళ్లకూడదు, వంట చేయకూడదు అని చెబుతుంటారు. కానీ, శాస్త్రీయంగా చూస్తే పీరియడ్స్ అనేది సహజ ప్రక్రియ. ఇది మహిళ శారీరకంగా ఆరోగ్యంగా ఉంది అనేదానికి సంకేతం. అపవిత్రం అనడం అనేది పూర్తిగా అపోహ మాత్రమే.
periods
2.పీరియడ్స్ లో చల్లని పదార్థాలు తినకూడదా..?
చాలా మంది పీరియడ్స్ సమయంలో చల్లనివి అంటే.. పెరుగు, ఐస్ క్రీమ్, కొబ్బరి నీళ్లు తీసకోకూడదని, నొప్పి ఎక్కువ అవుతుందని అంటారు. ఇది కూడా పూర్తిగా అపోహ మాత్రమే. . శరీరానికి చల్లని లేదా వేడిగా ఉండే ఆహారంతో సంబంధం లేదు. కొన్ని మహిళలకు చల్లని ఆహారం తీసుకున్నప్పుడు అసౌకర్యంగా అనిపించవచ్చు, కానీ అది అందరికీ వర్తించదు. రుతుస్రావ సమయంలో పోషకాహారం తీసుకోవడం ముఖ్యం.
periods
3. ఈ రోజుల్లో శరీరశ్రమ చేయకూడదు?
"పీరియడ్స్ సమయంలో నడవకూడదు, ఎక్కువ పనులు చేయకూడదు" అని చాలా మంది పెద్దవారు అంటారు. పీరియడ్స్ లో కొంత మంది మహిళలకు అలసట ఎక్కువగా ఉండవచ్చు. అయితే, సాధారణంగా తగిన శరీరశ్రమ మంచి ఫలితాల్ని ఇస్తుంది. హార్మోన్ల స్థాయిని మెరుగుపరిచేలా హేల్తీ యాక్టివిటీస్ ఉంటే మరింత మంచిది. కొన్ని వ్యాయామాలు చేయడం వల్ల నొప్పి కూడా తగ్గుతుంది.
Periods
4.పీరియడ్స్ లో స్విమ్మింగ్...
పీరియడ్స్ సమయంలో స్విమ్మింగ్ చేస్తే , నీటిలోకి వెళితే ఇన్ఫెక్షన్లు వస్తాయి అని చాలా మంది అంటుంటారుఇది అపోహ మాత్రమే. మెన్‌స్ట్రువల్ హైజీన్ పాటిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ట్యాంపూన్, మెన్‌స్ట్రువల్ కప్ వాడితే స్విమ్మింగ్ కూడా సురక్షితమే. అయితే నీటి శుభ్రత అనేది చాలా ముఖ్యమైన అంశం.
5. పీరియడ్స్ లో శరీరంలోని మలినాలు బయటకి వస్తాయా?
"పీరియడ్స్ అనేది శరీరంలోని టాక్సిన్స్ (విష పదార్థాలు) బయటకు పంపే ప్రక్రియ" అనే అపోహ ఉంది. ఇందులోనూ ఎలాంటి నిజం లేదు. రుతుస్రావం అనేది యుటరస్ లోని లైనింగ్ బయటకు వస్తూ ఉండే సహజ ప్రక్రియ. ఇది గర్భం ఏర్పడకపోయినప్పుడు జరిగే సాధారణ శరీర ప్రక్రియ మాత్రమే. టాక్సిన్స్ లేదా మలినాలను బయటకు పంపే ప్రక్రియ కాదు.