జుట్టు నల్లగా నిగనిగలాడాలా..? ఇవి వాడితే చాలు..!
మన కిచెన్ లో లభించే కొన్ని పదార్థాలు జుట్టు నల్లగా చేస్తాయట. అవి శాశ్వత పరిష్కారం చూపించకున్నా, ఇతర సమస్యలేవీ రాకుండా చేస్తాయి.
hair care
నల్లని నిగనిగలాడే జట్టును ఎవరు మాత్రం కోరుకోరు చెప్పండి..? కానీ మన లైఫ్ స్టైల్, కాలుష్యం, తినే ఆహారం ఇవన్నీ కూడా జుట్టు రంగు మారడానికి కారణమౌతాయి. అందుకే ఈరోజుల్లో చాలా మంది చిన్న వయసులోనే తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతున్నారు. మరి మళ్లీ జుట్టు నల్లగా మారాలంటే ఏం చేయాలి చాలా తిప్పలు పడిపోతూ ఉంటారు. ఏవేవో నూనెలు వాడుతూ ఉంటారు. లేదంటే రంగులు పూస్తూ ఉంటారు. అయితే, అవేమీ లేకుండా మన కిచెన్ లో లభించే కొన్ని వస్తువులతో శిరోజాలను నల్లగా మార్చుకోవచ్చట. అదెలాగో చూద్దాం..
జుట్టుకు రంగు వేసుకోవడానికి మార్కెట్లో చాలా రకాల పౌడర్లు, క్రీములు ఉన్నాయి. కానీ వాటి వల్ల చాలా రకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకే సహజ ఉత్పత్తులను వాడితే ఆ సమస్య రాకుండా ఉంటుంది. మన కిచెన్ లో లభించే కొన్ని పదార్థాలు జుట్టు నల్లగా చేస్తాయట. అవి శాశ్వత పరిష్కారం చూపించకున్నా, ఇతర సమస్యలేవీ రాకుండా చేస్తాయి.
బాగా మరిగించిన బ్లాక్ టీ ని జుట్టు పట్టించాలి. ఆ తర్వాత కొద్ది నిమిషాలు జుట్టును అలానే వదిలేయాలి. ఆ తర్వాత నీటితో కడగాలి. ఇలా చేయడం వల్ల తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. అయితే, ఇది ఎక్కువ రోజులు ఉండకపోవచ్చు. కానీ దీని వల్ల ఎలాంటి హాని ఉండదు. జుట్టు సహజమైన నలుపు రంగులో కనపడుతుంది.
hair care
కేవలం బ్లాక్ టీ మాత్రమే కాదు, బాగా మరిగించిన బ్లాక్ కాఫీ ను కూడా తాత్కాలికంగా జుట్టు నల్లగా కనిపించడానికి ఉపయోగించవచ్చట. ఈ రెండింటినీ ఉపయోగించే విధానం సేమ్.
hair care
రోస్ మేరీ ఆకులను మరిగించి.. తర్వాత వడగట్టి ఆ నూనెను తలకు రాసినా కూడా జుట్టు నల్లగా మారుతుంది. ఇక బ్లాక్ వాల్ నట్స్ ని దంచి, ఆ తర్వాత నీటిలో మరిగించాలి. ఆ తర్వాత ఆ నీటిని హెయిర్ కి డై చేసుకోవచ్చు. ఇది కూడా వెంటనే రంగు వేసినట్లు జట్టు నల్లగా మారుతుందట.
hair care
హెన్నా.. దీనిని గోరుంట ఆకులతో తయారు చేస్తారు. ఇది కూడా జుట్టుకి ఎలాంటి హాని కలిగించదు. దీనిలోనూ బ్లాక్ హెన్నా అందుబాటులో ఉంటుంది. కాబట్టి.. దానిని సంతోషంగా ఉపయోగించవచ్చు.
hair care
ఉసిరి పొడిని కూడా జుట్టు నల్లగా చేస్తుంది. ఇక తరచూ తలకు కొబ్బరి నూనెను ఉపయోగించడం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి ఉపయోగపడుతుంది. అయితే, జుట్టు నల్లగా మారడానికి సహాయపడుతుంది.