కీర్తి సురేష్ ఇందుకే అందంగా ఉందా?
కీర్తి సురేష్ నటనతోనే కాదు అందంతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అసలు ఈ బ్యూటీ అందంగా ఉండటానికి అసలు కారణమేంటో తెలుసా?
హీరోయిన్లు అన్నాక మేకప్ వేసుకోవడం చాలా కామన్. కానీ మేకప్ వేసుకోకున్నా చాలా మంది హీరోయిన్లు ఎంతో అందంగా ఉంటారు. ఇలాంటి వారిలో మహానటి కీర్తి సురేష్ ఒకరు. ఈమె ఎంత అందంగా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అసలు ఈ బ్యూటీ అందంగా కనిపించేందుకు ఎలాంటి చిట్కాలను ఫాలో అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
నీళ్లు మన శరీరానికి చాలా చాలా అవసరం. ఇవి మన శరీరాన్ని ఆరోగ్యంగా, హైడ్రేట్ గా ఉంచుతాయి. అంతేకాదు నీళ్లు అందంగా ఉండేందుకు కూడా సహాయపడతాయి.అందుకే కీర్తి సురేష్ ప్రతిరోజూ నీళ్లను పుష్కలంగా తాగుతుంది. నీళ్లు చర్మాన్ని తేమగా, తాజాగా ఉంచడానికి సహాయపడతాయి. అలాగే చర్మానికి మంచి పోషణను కూడా అందిస్తుంది.
చర్మం క్లియర్ గా, అందంగా ఉండేందుకు హీరోయిన్ కీర్తి సురేష్ సీటీఎమ్ ను అనుసరిస్తుంది. ctm అంటే క్లెన్సింగ్,టోనింగ్, మాయిశ్చరైజింగ్ అని అర్థం. ఇవి ముఖంపై మొటిమలు ఏర్పడకుండా చేయడానికి సహాయపడుతుంది. అలాగే చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
యోగా చేస్తుంది
కీర్తి సురేష్ నిజమైన అందం మనసు లోపలి నుంచే వస్తుందని గట్టిగా నమ్ముతుంది. అందుకే ఈమె ప్రతిరోజూ యోగా చేస్తుంది. ప్రతిరోజూ యోగా చేయడం వల్ల శరీరం, మనస్సు రెండూ ఆరోగ్యంగా ఉంటాయి. ఈ రెండూ హెల్తీగా ఉంటే పక్కాగా అందంగా కనిపిస్తారు.
సహజసిద్ధమైన చర్మ సంరక్షణ
సినిమాల్లో నటించేవారంతా రకరకాల మేకప్స్ వేసుకుంటారు. ఇవి వారి అందాన్ని పెంచుతాయి. అందుకే సినిమాల్లో నటించేటప్పుడు కీర్తి సురేష్ కూడా మేకప్ వేసుకుంటుంది. అలాగే చర్మ సంరక్షణ ప్రొడక్ట్స్ ను కూడా వాడుతుంది. అయితే కీర్తి సురేష్ కెమికల్స్ ఉన్న చర్మ సంరక్షణ ఉత్పత్తుల కంటే సహజసిద్ధమైన వాటినే ఎక్కువగా వాడుతుందట. అందుకే ఆమె అంత అందంగా ఉంది.
BB క్రీమ్‌ను ఉపయోగిస్తుంది
కీర్తి సురేష్ నేచురల్ గా కనిపిస్తుంది. దీనికోసం ఈ హీరోయిన్ ఫౌండేషన్ కంటే BB క్రీమ్‌నే ఎక్కువగా ఉపయోగిస్తుందట. ఇదే ఆమెను మరింత అందంగా కనిపించేలా చేస్తుంది.