ఒక రొమ్ము చిన్నగా, ఇంకోటి పెద్దగా ఉంటే మంచిది కాదా?
అందరి రొమ్ముల పరిమాణం ఒకేవిధంగా ఉండదు. కొందరివి పెద్దగా, ఇంకొందరివి చిన్నగా ఉంటాయి. అయితే చాలా మంది ఆడవారికి ఒక రొమ్ము పెద్దగా, ఇంకో రొమ్ము చిన్నగా ఉంటుంది. అసలు ఇది సమస్యేనా.. నిపుణులు ఏమంటున్నారంటే..?
వక్షోజాలు ఒకేలా కనిపించాలా?
ఒక మహిళ రొమ్ముల ఆకారం, ఆకృతి, రంగు, లక్షణాలు సహజంగా వేరొక మహిళ కంటే భిన్నంగా ఉంటాయి. అయితే మీ రెండు వక్షోజాలు కూడా ఒకదానికొకటి భిన్నంగా కూడా కనిపిస్తాయి. అంటే ఒక రొమ్ము చిన్నగా, మరొక రొమ్ము పెద్దగా ఉంటుంది. అసలు ఇది సాధారణమా? లేక హాస్పటల్ కు వెళ్లాలో ఇప్పుడు తెలుసుకుందాం?
Breast
సాధారణంగా సాధారణం
భిన్నమైన రొమ్ముల పరిమాణం ఉండటం చాలా సాధారణమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. నిజానికి మహిళలు సౌష్టవ రొమ్ములను కలిగి ఉండటం కంటే భిన్నమైన రొమ్ము ఆకారాలు, పరిమాణాలను కలిగి ఉండటం సర్వ సాధారణమంటున్నారు నిపుణులు.
దీనికి కారణమేంటి?
ఇది ఆందోళన చెందాల్సిన విషయం కాదు. అయినప్పటికీ.. మీ రెండు వక్షోజాలు కొద్దిగా భిన్నంగా ఎందుకు కనిపిస్తాయో మీరు తెలుసుకోవాలి. దీనిలో ఒకటి జెనెటిక్స్. దీనిలో మీ అమ్మకు లేదా నానమ్మకు ఇలాంటి విభిన్న రొమ్ములు ఉంటే మీకు కూడా అలాగే వచ్చే అవకాశం ఉంది.
దీనికి మరో కారణం మీ బరువు. రొమ్ములు బంధన కణజాలం, పాల నాళాలతో పాటుగా పాక్షికంగా కొవ్వుతో తయారవుతాయి. కాబట్టి మీరు బరువు పెరిగినప్పుడు లేదా కోల్పోయినప్పుడు, కొవ్వు పేరుకుపోవడం లేదా తగ్గడం మీ శరీరమంతా సమానంగా జరగదు. మీ రెండు రొమ్ములకు ఇది వర్తిస్తుంది. అయితే మీరు ప్రెగ్నెంట్ గా ఉంటే మీ వక్షోజాలు అసమానంగా మారే అవకాశం ఉంది. అంటే దీనిలో రొమ్ములు పెద్దవిగా, కొన్నిసార్లు అస్థిరంగా పెరుగుతాయి. ఎందుకంటే మీ శరీరం తల్లి పాలివ్వడానికి సిద్ధం అవుతుంది కాబట్టి.
వైద్య పరిస్థితులు
ఒకటి చిన్నగా, ఒకటి పెద్దగా కనిపించే రొమ్ములు కొన్ని సార్లు మీ ఆరోగ్య సమస్యల గురించి కూడా చెప్తాయి. లేదా అస్థిపంజర పరిస్థితులు పార్శ్వగూని, వెన్నెముక వక్రత లేదా మీ ఛాతీ గోడలో వైకల్యాలకు కూడా ఇది సంకేతం. అయినప్పటికీ ఈ కారకాలు జెనెటిక్స్, బరువు మార్పుల కంటే తక్కువ సాధారణం.
breast
ఎప్పుడు ఆందోళన చెందాలి?
రెండు రొమ్ములు సమానంగా లేకపోవడం సాధారణం అయినప్పటికీ.. రొమ్ము పరిమాణంలో ఆకస్మిక పెరుగుదల లేదా తగ్గుదల వంటి కొత్త అసమానతను చూసినప్పుడు జాగ్రత్తపడటం చాలా ముఖ్యం. మీ రొమ్ము పరిమాణంలో మార్పు, చర్మం రంగులో మార్పు, రొమ్ములు గట్టిపడటం, నల్లగా మారడం, లేదా మీ రొమ్ము రంగులో మార్పు వంటి ఇతర లక్షణాలతో వస్తే మీరు ఖచ్చితంగా హాస్పటల్ కు వెళ్లాలి. ఎందుకంటే ఇవి కొన్ని రకాల కణితులతో సంబంధం కలిగి ఉంటాయి.
రొమ్ము పరిమాణం, రొమ్ము క్యాన్సర్
2015 అధ్యయనం ప్రకారం.. రొమ్ములు పరిమాణంలో 20% భిన్నంగా ఉన్న మహిళలకు రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. రొమ్ము అసమానత, రొమ్ము క్యాన్సర్ గురించి చాలా మందికి తెలియదు. నిజానికి రొమ్ము పరిమాణంలో మార్పు క్యాన్సర్ కూడా కావొచ్చు. అయితే దీనిని స్పష్టంగా తెలుసుకోవడానికి మరింత పరిశోధన అవసరమంటున్నారు నిపుణులు.