చుండ్రు సమస్యతో బాధపడుతున్నారా..? ఇలా చెక్ పెట్టండి..!
శాస్త్రీయంగా చెప్పాలంటే, చుండ్రు అనేది నాన్ ఇన్‌ఫ్లమేటరీ, క్రానిక్ కండిషన్. ఇది ఒక సాధారణ తల చర్మం వ్యాధి. దీని కారణంగా స్కాల్ప్ టిష్యూ బాగా ప్రభావితమవుతుంది.
dandruff
చలికాలంలో జుట్టు సమస్యలు సర్వసాధారణం. ఎక్కువగా చుండ్రు సమస్య వేధిస్తూ ఉంటుంది. . కొందరికి ఆ చుండ్రు కారణంగా ముఖంపై మొటిమలు వస్తాయి. శాస్త్రీయంగా చెప్పాలంటే, చుండ్రు అనేది నాన్ ఇన్‌ఫ్లమేటరీ, క్రానిక్ కండిషన్. ఇది ఒక సాధారణ తల చర్మం వ్యాధి. దీని కారణంగా స్కాల్ప్ టిష్యూ బాగా ప్రభావితమవుతుంది.
dandruff
చుండ్రుకు కారణం..
చుండ్రుకు అనేక కారణాలున్నాయి. మన తలపై ఉండే జిడ్డు, నిర్వహణ సరిగా లేకపోవడం ఫంగల్ ఇన్ఫెక్షన్లకు దారి తీస్తుంది. స్కాల్ప్‌పై నివసించే ఒక నిర్దిష్ట రకం ఫంగస్ అధికంగా పెరగడం వల్ల చుండ్రు వస్తుంది. అయితే చుండ్రును పూర్తిగా తగ్గించుకోవడానికి కొన్ని ఉపయోగకరమైన చిట్కాలు ఉన్నాయి.
వేప రసం పరిష్కారం
వేప రసం శిరోజాలను శుభ్రపరచడంలో బాగా సహాయపడుతుంది. ఇది జుట్టు పెరుగుదలను కూడా మెరుగుపరుస్తుంది. చుండ్రు తలపై మూసుకుపోయిన రంధ్రాలను తొలగిస్తుంది. వేప లక్షణాలు చుండ్రును తగ్గించడంలో ప్రభావవంతంగా ఉంటాయి. వేప ఆకుల రసాన్ని తలకు బాగా పట్టించి కొంత సమయం తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు లేదా మూడు సార్లు చేస్తే చుండ్రు పోతుంది.
పెరుగుతో ఉసిరి పొడి
ఇండియన్ గూస్బెర్రీ అని కూడా పిలువబడే ఉసిరికాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఉసిరి పొడి చుండ్రును వదిలించుకోవడానికి చాలా సహాయపడుతుంది. పెరుగులో ఈస్ట్‌ను అదుపులో ఉంచే 'ఫ్రెండ్లీ బ్యాక్టీరియా' ఉంటుంది. చుండ్రు నుండి విముక్తి పొందడానికి, 2 టీస్పూన్ల ఉసిరి పొడిని తీసుకుని, పెరుగులో కలిపి మీ తలకు పట్టించాలి. మంచి ఫలితాల కోసం వారానికి రెండు సార్లు ఇలా చేయండి. ఇలా తరచూ చేయడం వల్ల చుండ్రు సమస్య పరిష్కారమౌతుంది.
ఒత్తిడి మన రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. ఇది చుండ్రుకు కారణమయ్యే ఇన్ఫెక్షన్లతో పోరాడే మీ శరీర సామర్థ్యాన్ని కూడా తగ్గిస్తుంది. తరచుగా ఒత్తిడి కూడా చుండ్రుకు కారణం కావచ్చు. ఒత్తిడిని తగ్గించుకోవడానికి నడక లేదా యోగా, ధ్యానం చేయండి. పై రెండు చిట్కాలలో ఏదో ఒకటి చేసి ఒత్తిడిని తగ్గించుకుంటే చుండ్రు పోతుంది.
చుండ్రు సమస్యకు కెమికల్ రెమెడీస్ కంటే నేచురల్ రెమెడీస్ మేలు. ఇవి జుట్టుకు రక్షణ కల్పిస్తాయి. ఇది చుండ్రు వల్ల వచ్చే మంటను కూడా తగ్గిస్తుంది. ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్లను కూడా నివారిస్తుంది.