ఈ ఒక్క నూనె పెట్టినా.. మీ జుట్టు పొడుగ్గా పెరుగుతుంది
జుట్టు పొడుగ్గా, ఒత్తుగా ఉండాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. దీనికోసం రకరకాల షాంపూలను, నూనెలను ట్రై చేస్తుంటారు. అయితే మీరు ఒక్క నూనె గనుక పెట్టారంటే మీ జుట్టు ఫాస్ట్ గా, పొడుగ్గా పెరుగుతుంది.అదేం నూనె అంటే?
castor oil
ఆముదం నూనెను ఉపయోగించే వారు చాలా తక్కువ మందే ఉంటారు. కానీ ఎన్నో ఏండ్ల నుంచి ఆముదం నూనెను జుట్టుకు ఉపయోగిస్తూ వస్తున్నారు. ఈ ఆముదం నూనె మన జుట్టుకు ఎంతో ఉపయోగపడుతుంది. ఈ నూనెలో యాంటీ ఆక్సిడెంట్లు, కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇలాంటి నూనెను జుట్టుకు పెడితే జుట్టు ఫాస్ట్ గా పెరుగుతుంది. ఆముదం నూనెను జుట్టుకు పెట్టడం వల్ల ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది. అలాగే హెయిర్ ఫాల్ కూడా చాలా వరకు తగ్గుతుంది. ఆముదం నూనెలో ఉండే ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్ కూడా జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. హెయిర్ ఫాల్ సమస్య ఉన్నవారు ఈ నూను పెడితే సమస్య తగ్గిపోతుంది.
ఆముదం నూనె మన నెత్తిమీద రక్త ప్రవాహాన్ని పెంచుతుంది. ఇది మన జట్టును ఆరోగ్యంగా ఉంచడానికి బాగా సహాయపడుతుంది. ఆముదం నూనెను నెలకొకసారి అప్లై చేస్తే జుట్టు పొడుగ్గా, ఒత్తుగా పెరుగుతుంది. దీనిలో ఉండే యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు జుట్టు పెరగడానికి సహాయపడతాయి. ఈ నూనెను కనుబొమ్మలకు పెట్టినా.. ఒత్తుగా పెరుగుతాయి. కనుబొమ్మలకు ఆముదం నూనెను పెట్టడం వల్ల కొత్త వెంట్రుకలు మొలుస్తాయి. జుట్టు బాగా పెరగడానికి ఆముదం నూనెను వారానికి ఒకసారి అప్లై చేయండి.
ఆలివ్ ఆయిల్ లో ఒక టేబుల్ స్పూన్ ఆముదం నూనెను కొద్దిగా నిమ్మరసం వేసి తలకు పెట్టినా మంచి ఫలితం ఉంటుంది. దీన్ని 30 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇది మీ జుట్టు బాగా పెరగడానికి సహాయపడుతుంది. అలాగే ఆముదం నూనె, బాదం నూనెను సమానంగా తీసుకుని నెత్తికి పెడితే తెల్ల జుట్టు వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది. ఇది మీ జుట్టును నల్లగా చేయడమే కాకుండా బలంగా కూడా చేస్తుంది. అయితే మీరు బాదం నూనెకు బదులుగా కొబ్బరి నూనెను కూడా ఉపయోగించొచ్చు.
కనుబొమ్మల వెంట్రుకలు పెరగడానికి మీరు ఆముదం నూనెలో కాటన్ గుడ్డను ముంచి రెండు కనుబొమ్మలపై బాగా రుద్దండి. ఐదు నిమిషాల పాటు చేతులతో మసాజ్ చేయండి. 30 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయండి. ఇది మీ కనుబొమ్మలు బాగా పెరగడానికి సహాయపడుతుంది.