ఈ పువ్వు పెడితే.. డార్క్ సర్కిల్స్ తొందరగా తగ్గిపోతాయ్
చాలా మందికి కళ్ల చుట్టూ డార్క్ సర్కిల్స్ ఉంటాయి. కానీ వీటివల్ల ముఖం ఏదో జబ్బు చేసిన వారిలా కనిపిస్తుంది. అలాగే ఎంత మేకప్ వేసుకున్నా.. అందంగా రెడీ అయినా అస్సలు కనిపించరు. కానీ ఒక మ్యాజిక్ పువ్వుతో ఈ డార్క్ సర్కిల్స్ లేకుండా చేసుకోవచ్చు.

అమ్మాయిలకే కాదు అబ్బాయిలకు కూడా కళ్ల చుట్టూ డార్క్ సర్కిల్స్ ఉంటాయి. ఇవి మీ ముఖం నీరసంగా, అలసటగా, నిర్జీవంగా కనిపించేలా చేస్తాయి. ఈ డార్క్ సర్కిల్స్ ఉన్నవారు ఎంత మేకప్ వేసుకున్నా వేస్టే. అందుకే ఇవి తగ్గడానికి చాలా మంది రకరకాల క్రీములను, చిట్కాలను ఫాలో అవుతుంటారు.
అయితే ఈ డార్క్ సర్కిల్స్ ను మీరు నేచురల్ గా తగ్గించుకోవాలంటే కుంకుమ పువ్వు బెస్ట్ అంటారు నిపుణులు. అవును కుంకుమపువ్వును మీ స్కిన్ కేర్ రొటీన్ లో భాగం చేసుకుంటే మీరెన్నో ప్రయోజనాలను పొందుతారు.
కుంకుమ పువ్వు కేవలం మన ఆరోగ్యానికి మాత్రమే కాదు.. మన చర్మానికి కూడా మంచి మేలు చేస్తుంది. కుంకుమపువ్వులో యాంటీ ఆక్సిడెంట్, విటమిన్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి డార్క్ సర్కిల్స్ ను తగ్గించడానికి బాగా సహాయపడతాయి.
కుంకుమపువ్వును మీరు ఎన్నో విధాలుగా ఉపయోగించొచ్చు. అయితే మంచి ఫలితాలు రావాలంటే మాత్రం దీనిని కొన్ని చర్మ సంరక్షణ పదార్థాలకు కలపొచ్చు. ఇది నేచురల్ . కాబట్టి దీనిని ఉపయోగించడంలో మీరు ఎలాంటి భయం పెట్టుకోవాల్సిన అవసరం లేదు.
ఇది మీ చర్మానికి మేలు తప్ప హాని చేయదు. కుంకుమ పువ్వు డార్క్ సర్కిల్స్ ను తగ్గించడమే కాకుండా.. మీ చర్మాన్ని నేచురల్ గా మెరిసేలా చేస్తుంది. అందుకే డార్క్ సర్కిల్స్ తగ్గడానికి కుంకుమ పువ్వును ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
డార్క్ సర్కిల్స్ తగ్గడానికి కుంకుమ పువ్వును ఎలా ఉపయోగించాలి?
కుంకుమపువ్వు, బాదం నూనె
కుంకుమపువ్వు, బాదం నూనెను కలిపి రాసుకుంటే కళ్ల చుట్టూ ఉన్న డార్క్ సర్కిల్స్ పోతాయి. బాదం నూనెలో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. ఇది కళ్ల చుట్టూ ఉన్న నల్లని ప్రాంతాన్ని మరమ్మత్తు చేస్తుంది.
డార్క్ సర్కిల్స్ తగ్గడానికి కుంకుమ పువ్వును ఎలా ఉపయోగించాలి?
కొన్ని కుంకుమపువ్వు దారాలను తీసుకుని ఒక చెంచా బాదం నూనెలో రాత్రంతా నానబెట్టండి. ఈ నూనెను ఉదయాన్నే కళ్ల చుట్టూ రాసి సున్నితంగా మసాజ్ చేయండి. ఈ చిట్కాను ప్రతిరోజూ పాటిస్తే కొన్ని రోజుల్లోనే మంచి ఫలితాలను చూస్తారు.
కుంకుమపువ్వు, కలబంద జెల్
కలబంద జెల్ మీ చర్మానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. ముఖ్యంగా ఇది చర్మాన్ని తేమగా ఉంచుతుంది. ఇకపోతే కుంకుమపువ్వు పిగ్మెంటేషన్ ను నివారిస్తుంది. అందుకే కుంకుమపువ్వును కలబంద జెల్ ను మిక్స్ చేసి అప్లై చేస్తే డార్క్ సర్కిల్స్ తగ్గిపోతాయి.
ఇందుకోసం ముందుగా ఒక స్పూన్ అలోవెరా జెల్ లో కొన్ని కుంకుమపువ్వు దారాలను వేసి బాగా కలపండి. దీన్ని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టి తర్వాత కళ్ల చుట్టూ అప్లై చేయండి. వేళ్లతో సున్నితంగా మసాజ్ చేయండి. మంచి ఫలితాల కోసం దీన్ని 20 నిమిషాలు లేదా రాత్రంతా అలాగే వదిలేయండి. ఈ చిట్కాను ప్రతిరోజూ ఫాలో అయితే కొన్ని రోజుల్లోనే తేడాను గమనిస్తారు.
కుంకుమపువ్వు, ఐస్ క్యూబ్
కోల్డ్ కంప్రెస్ లు ఉబ్బును తగ్గిస్తాయి. అలాగే చర్మాన్ని టైట్ చేస్తాయి. ఇకపోతే రోజ్ వాటర్ చర్మాన్ని రిఫ్రెష్ గా చేస్తుంది. కుంకుమపువ్వు రక్త ప్రవాహాన్ని పెంచుతుంది. దీంతో డార్క్ సర్కిల్స్ తొందరగా తగ్గిపోతాయి.
ఇందుకోసం 1/2 కప్పు రోజ్ వాటర్ లో 8-10 కుంకుమపువ్వు దారాలను వేసి రాత్రంతా నానబెట్టండి. దీన్ని ఐస్ క్యూబ్ ట్రేలో పోసి ఫ్రీజ్ చేయండి. కుంకుమపువ్వు ఉన్న ఐస్ క్యూబ్ ను మీ కళ్ల కింద కొన్ని సెకన్ల పాటు సున్నితంగా రుద్దండి. ప్రతిరోజూ ఉదయం ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.