MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Life
  • Woman
  • Hair Growth: కొబ్బరి నూనె కాదు.. ఈ నూనె వాడితే బట్టతలపై కూడా జుట్టు రావడం తథ్యం..!

Hair Growth: కొబ్బరి నూనె కాదు.. ఈ నూనె వాడితే బట్టతలపై కూడా జుట్టు రావడం తథ్యం..!

సహజంగా జుట్టుకు అందరూ కొబ్బరి నూనె వాడుతూ ఉంటారు. అయితే, కొబ్బరి నూనెకు బదులుగా మీరు ఆలివ్ ఆయిల్ వాడితే.. మీ జుట్టు మరింత ఒత్తుగా, అందంగా మారుతుందని మీకు తెలుసా?

3 Min read
Author : ramya Sridhar
Published : Aug 27 2025, 02:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Hair Care
Image Credit : stockPhoto

Hair Care

ఈ రోజుల్లో స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నవారే. చిన్న వయసులోనే బట్టతల వస్తోందని బాధపడేవారు చాలా మంది ఉన్నారు. ఈ సమస్య నుంచి బయటపడేందుకు మార్కెట్లో దొరికే ఖరీదైన నూనెలు, షాంపూలు వాడుతుంటారు. అయినా సరే మీ సమస్య తగ్గడం లేదా అయితే.. కేవలం ఒకే ఒక్క నూనె వాడితే.. ఈ జుట్టు రాలే సమస్యకు చెక్ పెట్టొచ్చు. మరి, ఆ నూనె ఏంటి? దానిని ఎలా వాడాలి అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
జుట్టు పెరుగుదలకు ఆలివ్ నూనె...
Image Credit : Getty

జుట్టు పెరుగుదలకు ఆలివ్ నూనె...

సహజంగా జుట్టుకు అందరూ కొబ్బరి నూనె వాడుతూ ఉంటారు. అయితే, కొబ్బరి నూనెకు బదులుగా మీరు ఆలివ్ ఆయిల్ వాడితే.. మీ జుట్టు మరింత ఒత్తుగా, అందంగా మారుతుందని మీకు తెలుసా? అవును. మన జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి కావాల్సిన పోషకాలు ఈ ఆలివ్ నూనెలో ఉన్నాయి. ఈ నూనెలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు మూలాలను బలోపేతం చేయడానికి, తలకు మంచి రక్త ప్రసరణ పెంచడానికి సహాయపడతాయి ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఆలి నూనె కొంచెం మందంగా ఉంటుంది కాబట్టి... దీనిని కేవలం మసాజ్ చేయడానికి మాత్రమే అప్లై చేయాలి.

Related Articles

Related image1
Hair Care: ఈ ఒక్క ఆకు వాడినా జుట్టు ఒత్తుగా పెరగడం పక్కా..!
Related image2
Grey Hair: ఇది రాస్తే.. ఒక్క తెల్ల వెంట్రుక కూడా ఉండదు.. సెలబ్రిటీ సీక్రెట్
34
ఆలివ్ నూనెతో మసాజ్ ఎలా చేయాలి.?
Image Credit : stockPhoto

ఆలివ్ నూనెతో మసాజ్ ఎలా చేయాలి.?

ఆలివ్ నూనెను వేడి చేసి తలకు అప్లై చేసి బాగా మసాజ్ చేయడం వల్ల తలకు రక్త ప్రవాహం పెరుగుతుంది. ఇది జుట్టు పెరుగుదలను ప్రేరేపిస్తుంది. దీని కోసం, ఒక చిన్న గిన్నెలో 2 చెంచాల ఆలివ్ నూనెను పోసి వేడి చేయండి. గోరువెచ్చగా అయ్యే వరకు వేడి చేస్తే సరిపోతుంది. ఇప్పుడు, నూనెను మీ చేతివేళ్లతో తాకి, తలకు అప్లై చేసి బాగా మసాజ్ చేయండి. ఆలివ్ నూనెను అప్లై చేసి, షవర్ క్యాప్ ధరించి, ఉదయం తేలికపాటి హెర్బల్ షాంపూతో తలస్నానం చేయండి. వారానికి రెండుసార్లు ఇలా చేయడం వల్ల మీ జుట్టు వేగంగా పెరుగుతుంది. మంచిగా మెరుస్తూ కూడా కనపడుతుంది.

44
హెయిర్ మాస్క్
Image Credit : stockPhoto

హెయిర్ మాస్క్

ఆలివ్ నూనె, కోడి గుడ్డుతో హెయిర్ మాస్క్ వేయడం వల్ల మీ జుట్టు వేగంగా పెరుగుతుంది. ఆలివ్ నూనెలోని కొవ్వు ఆమ్లాలు మీ జుట్టును మృదువుగా, మెరిసేలా చేస్తాయి. అదేవిధంగా, గుడ్లలోని ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్లు జుట్టు మూలాలను బలోపేతం చేస్తాయి. ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. మీకు గుడ్డు వాసన నచ్చకపోతే, మీరు హెయిర్ ప్యాక్ చేయడానికి గుడ్డులోని తెల్లసొనను మాత్రమే ఉపయోగించవచ్చు. ఈ హెయిర్ ప్యాక్‌ను మీ తలపై అప్లై చేసి అరగంట పాటు అలాగే ఉంచండి, తర్వాత హెర్బల్ షాంపూతో కడగాలి.

కొబ్బరి నూనె

ఆలివ్ నూనెను నేరుగా నెత్తికి అప్లై చేయడానికి బదులుగా, కొబ్బరి నూనెతో కలపడం వల్ల అదనపు ప్రయోజనాలు లభిస్తాయి. దీని కోసం.. ఆలివ్ నూనె , కొబ్బరి నూనెను సమాన మొత్తంలో తీసుకొని, వేడి చేసి, తల నుండి చివర్ల వరకు అప్లై చేసి బాగా మసాజ్ చేయండి. మీరు ఇలా క్రమం తప్పకుండా చేస్తే, మీరు మంచి మార్పును చూస్తారు.

కలబంద, ఆలివ్ ఆయిల్..

పొడి జుట్టు సమస్యలు ఉన్నవారికి ఇది ఉత్తమ ఎంపిక. దీని కోసం, ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ , 2 టేబుల్ స్పూన్ల కలబంద జెల్ కలిపి తల నుండి చివర్ల వరకు అప్లై చేయండి. వారానికి రెండు లేదా మూడు సార్లు ఇలా చేయడం వల్ల మీ జుట్టు వేగంగా పెరుగుతుంది.

తలస్నానానికి ముందు నూనె..

సాధారణంగా, చాలా మంది తలస్నానం చేసే ముందు జుట్టుకు నూనె రాసుకుంటారు. కానీ మీరు ఇతర నూనెలకు బదులుగా ఆలివ్ నూనెను ఉపయోగిస్తే, మీరు మంచి ఫలితాలను చూస్తారు. దీని కోసం, తలస్నానం చేయడానికి అరగంట ముందు మీ జుట్టుకు ఆలివ్ నూనెను అప్లై చేసి మసాజ్ చేయాలి. ఆ తర్వాత తలస్నానం చేయాలి. అది కూడా సల్ఫేట్ లేని షాంపూని ఎంచుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
మహిళలు
పురుషులు
సౌందర్యం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Mini Jhumka: కేవలం 2 గ్రాముల్లో డైలీవేర్ కి అదిరిపోయే జుంకా డిజైన్లు
Recommended image2
Patiala Suit: ఫెస్టివల్ ఫ్యాషన్‍ లో నయా ట్రెండ్.. బెస్ట్ ఎథ్నిక్ లుక్
Recommended image3
Toe Ring: శ్రావణమాసం పండుగ లుక్‍ను కంప్లీట్ చేసే అందమైన పచ్చల మెట్టెలు
Related Stories
Recommended image1
Hair Care: ఈ ఒక్క ఆకు వాడినా జుట్టు ఒత్తుగా పెరగడం పక్కా..!
Recommended image2
Grey Hair: ఇది రాస్తే.. ఒక్క తెల్ల వెంట్రుక కూడా ఉండదు.. సెలబ్రిటీ సీక్రెట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved