పట్టు చీరలు ఎప్పుడూ కొత్తగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా?
ఎన్ని సంవత్సరాల క్రితం కొన్నా కూడా.. పట్టుచీర కొత్తగా కనపడాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం...
Mysore silk
చీరలను ఇష్టపడని మహిళలు ఎవరైనా ఉంటారా..? వార్డ్ రోబ్ లో ఎన్ని చీరలు ఉన్నా.. మళ్లీ కొత్త చీర కొనాలనే అనుకుంటారు. ఇక.. పట్టుచీరలకు అయితే... ఆడవారి మనసుల్లో ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. కట్టేది సంవత్సరానికి ఒక్కసారి, రెండుసార్లు అయినా వేలకు వేలు పోసి అయినా కొనేస్తారు. అయితే... అంత రేటుు పెట్టి కొన్నా.. పట్టుచీరలు కాస్త డెలికేట్ అనే చెప్పాలి. మామూలు చీరల్లాగా ఎలా పడితే అలా ఉతకలేం. సరిగా ఉతకకపోతే... పాడైపోతాయి. ఎన్ని సంవత్సరాల క్రితం కొన్నా కూడా.. పట్టుచీర కొత్తగా కనపడాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం...
పట్టుచీరలను ఎలా జాగ్రత్తగా చూసుకోవాలి..?
పట్టువస్త్రాలు ధరించి బయటికి వెళితే వచ్చిన తర్వాత ముందు విప్పి గాలికి ఆరనివ్వకండి. అప్పుడే అందులోని చెమట వాసన బయటకు వస్తుంది. అప్పుడు మీరు దానిని మడతపెట్టి, బయటికి తీసుకొని శుభ్రం చేసుకోండి. ఆ తర్వాత.. మాత్రమే బయట డ్రై క్లీనింగ్ కి ఇవ్వాలి. మనం ఉతకకూడదు. ఎందుకంటే...ఉతకడం తెలియక ఉతికితే పట్టు చీరలోని జరీ పాడైపోతుంది. ముఖ్యంగా, సిల్క్‌ని వాషింగ్ మెషీన్‌లో ఎప్పుడూ ఉతకకూడదు.
అదేవిధంగా, పట్టును ఎప్పుడూ ఇతర బట్టలతో మడవకూడదు. అలాగే సిల్క్ చీరను మడిచి మస్లిన్ క్లాత్ లేదా బ్యాగ్ లో ఉంచి బ్యూరోలో పెట్టుకోవాలి. ముఖ్యం గా పట్టును తరుచుగా తీసుకుని మడవండి. పట్టుచీర ఎక్కువసేపు ఒకే మడతలో ఉంటే అందులో మడతలు ఇరుక్కుపోతాయి.అలా కాకుండా.. మడతలు మారుస్తూ ఉండాలి.
మరి, కాటన్ చీరలు ఎలా .జాగ్రత్త చేసుకోవాలి..?
మీరు కాటన్ చీరను ధరించిన తర్వాత, ఇతర దుస్తులతో ఉతకకండి. ఎల్లప్పుడూ విడిగా ఉతకాలి. అదేవిధంగా కాటన్ చీరలను వాషింగ్ పౌడర్ లో ఎక్కువ సేపు నానబెట్టకూడదు. అలా నానబెడితే చీరలో రంగు మాసిపోతుంది. మీరు కట్టుకున్న కాటన్ చీర మురికిగా లేకుంటే నీటిలో నానబెట్టి ఆరబెట్టండి. ముఖ్యంగా కాటన్ చీరలను ఎండలో ఆరనివ్వకూడదు, ఎప్పుడూ నీడలో ఆరబెట్టాలి. అలాగే, కాటన్ చీరలను వాషింగ్ మెషీన్‌లో ఎప్పుడూ ఉతకకూడదు. మీరు కాటన్ చీరను ఉతికిన తర్వాత దానిని ఐరన్ చేసి, ఆపై దానిని హ్యాంగర్‌పై వేలాడదీయండి.