వాషింగ్ మెషిన్ లో ముల్లంగిని పెడితే ఏమౌతుందో తెలుసా?
ఈ మధ్య వాషింగ్ మెషిన్ లో ముల్లంగిని వేయడం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. అసలు వాషింగ్ మెషిన్ లో ముల్లంగిని ఎందుకు వేస్తారు? దీనివల్ల ఏం లాభమో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాను వాడుతున్నారు. ముఖ్యంగా తెలియని వాటిని తెలుసుకుంటూ, తెలిసిన వాటిని మరింత సులువుగా చేయడం ఎలా అంటూ సోషల్ మీడియాలో తెగ వెతికేస్తున్నారు. వీటిలో ఏదైనా నచ్చితే.. అది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. చాలా సార్లు సిల్లీ సిల్లీ విషయాలు కూడా జనాలను బాగా ఆకట్టుకుంటుంటాయి. అలాగే వాటిని జనాలు కూడా గుడ్డిగా ఫాలో అవుతుంది.
Washing Machine
అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ మహిళ తమ వాషింగ్ మెషీన్ లో ముల్లంగిని ఉంచిన వీడియో తెగ వైరల్ అవుతోంది. అసలు బట్టలు ఉతికే వాషింగ్ మెషిన్ లో ముల్లంగిని ఎందుకు వేసిందనేది ఆశ్చర్యంగా అనిపించొచ్చు. ఇది సిల్లీగా అనిపించినా ఆడవారికి మాత్రం పనికొచ్చే చిట్కా అనే చెప్పాలి. ఈ విషయం గనుక మీకు తెలిస్తే మీరు కూడా మీ వాషింగ్ మెషిన్ లో ముల్లంగిని వేయకుండా ఉండలేరు. అసలు ముల్లంగిని వాషింగ్ మెషిన్ లో పెడితే ఏమౌతుందో తెలుసుకుందాం పదండి.
పర్ ఫెక్ట్ ముల్లంగి పరాఠాలు నిమిషాల్లో తయార్..
చలికాలంలో చాలా మంది టేస్టీ టేస్టీ, హెల్తీ ముల్లంగి పరాఠాలను ఖచ్చితంగా తింటారు. అయితే వీటిని తయారుచేయడం మాత్రం చాలా కష్టం. ఎందుకంటే ముల్లంగిలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ముల్లంగి పరోటాలను రోలింగ్ చేసేటప్పుడు పగిలిపోతుంటాయి. దీనివల్ల పరోటాలు పర్ఫెక్ట్ గా రావు. ఇలాంటప్పుడు మీకు వాషింగ్ మెషిన్ పనికి వస్తుంది తెలుసా?
వాషింగ్ మెషీన్ ఎలా పనిచేస్తుంది?
ఫర్పెక్ట్ ముల్లంగి పరోఠాలను తయారుచేయాలనుకుంటే వాషింగ్ మెషిన్ మీకు సహాయపడుతుంది. నిజానికి ముల్లంగి తొక్క తీసి తురుముకోవడం చాలా ఈజీ. కానీ దానిలోని వాటర్ ను మొత్తం తీయడం మాత్రం చాలా కష్టం. వడకట్టినా ముల్లంగిలో ఎంతో కొంత నీరు ఉంటుంది. దీనివల్ల పరోటాలు చిరిగిపోతుంటాయి. అయితే ఈ సమస్య రాకుండా ఉండటానికి ఇంటర్నెట్ ప్రస్తుతం వైరల్ అవుతున్న చిట్కా.. వాషింగ్ మెషిన్ లో ముల్లంగిని వేయడం. అవును ఈ హ్యాక్ ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
washing machine
వాషింగ్ మెషీన్ హ్యాక్ ఎలా పనిచేస్తుంది?
ముల్లంగిని తురుమిన తర్వాత దానిలోని వాటర్ ను తీసేయడానికి మీరు వాషింగ్ మెషిన్ ను ఉపయోగించొచ్చు. ఇందుకోసం ముల్లంగిని దుస్తుల మాదిరిగానే వాషింగ్ మెషిన్ లోని డ్రైయర్ లో ఆరబెట్టాలి. దీన్ని ట్రై చేయడానికి ముందు తురిమిన ముల్లంగిని కాటన్ గుడ్డలో గట్టిగా కట్టాలి. ఆ తర్వాత దీన్ని వాషింగ్ మెషీన్ డ్రయ్యర్ లో వేయాలి. దీనివల్ల ముల్లంగిలోని నీళ్లన్నీ కొద్ది సేపట్లో బట్టల్లా బయటకు వస్తాయి. ఆ తర్వాత మీరు పర్ఫెక్ట్ ముల్లంగి పరోఠాలు చేసుకోవచ్చు.