ఫ్రిజ్ లో కూరగాయల్ని ఇలా పెడితే చాలా రోజుల వరకు పాడుకావు
కూరగాయలు ఫ్రిజ్‌లో పెట్టినా కూడా త్వరగా వాడిపోతుంటాయి. కూరగాయలు ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉండాలంటే చల్లటి నీటిలో, వెనిగర్ ద్రావణంలో నానబెట్టి, పేపర్ టవల్స్‌తో చుట్టి, ఫ్రీజర్ సమీపంలో నిల్వ చేయాలి.
ఒకప్పుడు అయితే ఏ రోజుకారోజు కూరగాయల్ని ఫ్రెష్ గా తెచ్చుకుని వండుకునేవారు. కానీ ఇప్పుడు వారానికి సరిపడా కూరగాయల్ని కొనేసి వండుకుని తింటున్నారు. అయితే ఇవి బయటపెడితే ఖచ్చితంగా పాడైపోతాయి. అందుకే చాలా మంది కూరగాయల్ని ఫ్రిజ్ లో పెట్టేస్తుంటారు.
అయితే ఫ్రిజ్ లో పెట్టినా కూడా చాలా సార్లు కూరగాయలు వాడిపోవడం, మురిగిపోవడం, కుల్లిపోవడం జరుగుతుంటుంది. దీనివల్ల కూరగాయల్నీ వేస్ట్ అవుతాయి. అందుకే ఫ్రిజ్ లో ఎలా పెడితే కూరగాయలు చాలా రోజుల వరకు ఫ్రెష్ గా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
చల్ల నీటిలో నిల్వ
చల్లి నీటిలో నిల్వ చేస్తే కూడా కూరగాయలు చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయి. అన్ని రకాల కూరగాయల్ని ఇలా నిల్వ చేయలేం. కేవలం ఆలుగడడ్, క్యారెట్, పాలకూర వంటి కూరగాయలను కూల్ వాటర్ లో నిల్వ చేయొచ్చు. దీనివల్ల అవి చాలా రోజుల వరకు చెడిపోకుండా ఉంటాయి.
కాకపోతే మీరు ప్రతి 2 రోజులకోసారి ఈ వాటర్ ను మార్చాల్సి ఉంటుంది. కానీ దీనివల్ల కూరగాయలు ఫ్రెష్ గా ఉటాయి. ఈ పద్దతిలో మీరు బెర్రీలు, ఆపిల్, కీరదోసకాయలు వంటి పండ్లను, కూరగాయల్ని నిల్వ చేయొచ్చు.
వెనిగర్ సహాయంతో నిల్వ
ఫ్రిజ్ లో పెట్టిన కూరగాయలు పాడైపోతుంటే.. వెనిగర్ ను ఉపయోగించండి. అవును ఫ్రిజ్ లో కూరగాయల్ని పెట్టేముందు వెనిగర్ ను ఉపయోగించాలి. ఇందుకోసం మీరు వెనిగర్, నీళ్లు కలిపి ఒక ద్రావణాన్ని తయారుచేయండి.
దీనిలో పండ్లను, కూరగాయలను ఒక 5 నిమిషాల పాటు నానబెట్టండి. ఆ తర్వాత వాటిని ఆరబెట్టి పండ్లను, కూరగాయలన్నింటినీ ఫ్రిజ్ లో పెట్టేయండి. ఇలా చేస్తే పండ్లు, కూరగాయలు చాలా రోజుల వరకు ఫ్రెష్ గా ఉంటాయి.
fridge
పేపర్ టవల్స్
చలికాలంలో రకరకాల ఆకు కూరలు మనకు పుష్కలంగా దొరుకుతాయి. కానీ ఈ ఆకు కూరలు ఎక్కువ సేపు తాజాగా ఉండవు. అయితే ఈ ఆకుకూరల్ని పేపర్ టవల్స్ సహాయంతో కొన్ని రోజుల వరకు ఫ్రెష్ గా ఉంచొచ్చు. ఎందుకంటే ఈ పేపర్ టవల్స్ కూరగాయల తేమను తగ్గిస్తుంది. అలాగే చాలా రోజులు ఫ్రెష్ గా ఉంచుతాయి. అయితే మీరు ఈ పేపర్ టవల్స్ కు బదులుగా వార్తాపత్రికలను కూడా ఉపయోగించొచ్చు.
ఫ్రీజర్ దగ్గర నిల్వ
ఫ్రీజర్ లో కూడా మీరు కొన్ని రకాల పండ్లను, కూరగాయల్ని నిల్వ చేయొచ్చు. మీకు తెలుసా? డీప్ ఫ్రీజింగ్ కూరగాయల్ని ఎక్కువసేపు తాజాగా ఉంచుతుంది. అలాగే దీనివల్ల అవి త్వరగా కుల్లిపోవు. దీని కోసం కూరగాయల్ని ఫ్రీజర్ సమీపంలో నిల్వ చేయండి.