థ్రెడ్డింగ్ చేయకుండా,... అప్పర్ లిప్ పై వెంట్రుకలు తొలగించేదెలా..?
మీ ముఖంపై లేదంటే.. అప్పర్ లిప్ పై హెయిర్ ని తొలగించవవచ్చు. అయితే.. ఇది వెంట్రుకలు మొత్తం తొలగించదు. కానీ.. చూడటానికి తక్కువగా కనిపిస్తాయి. మనకు నేచురల్ లుక్ ఇవ్వడంలో సహాయం చేస్తుంది.
అబ్బాయిలకు మీసాలే అందం.. కానీ... అదే ప్లేస్ లో అమ్మాయిలకు కొద్దిగా వెంట్రుకలు కనిపించినా చూడటానికి కాస్త ఇబ్బందిగా ఉంటుంది. అందుకే.. ప్రతిసారీ అమ్మాయిలు పార్లర్ కి వెళ్లి... కష్టపడి.. థ్రెడ్డింగ్ చేయించుకుంటూ ఉంటారు. అయితే.. థ్రెడ్డింగ్ చేసే సమయంలో... నొప్పి భరించలేనిదిగా ఉంటుంది. అయితే.. థ్రెడ్డింగ్ తో పనిలేకుండా సింపుల్ గా అప్పర్ లిప్ పై హెయిర్ ని ఎలా తొలగించాలో ఇఫ్పుడు చూద్దాం..
1. అప్పర్ లిప్ పై వెంట్రుకలు తొలగించాలి అంటే.. థ్రెడ్డింగే చేయాల్సిన పని లేదు. షేవింగ్ కూడా చేయవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో... మహిళల స్కిన్ కి తగినట్లుగా.. చర్మంపై ఎలాంటి ర్యాషెస్ రాకుండా ఉండేలా షేవింగ్ కిట్స్ అందుబాటులోకి వస్తున్నాయి. వాటి ద్వారా మీరు.. అప్పర్ లిప్ పై హెయిర్ ని తొలగించవచ్చు. దీంతో నొప్పి కూడా ఉండదు.
facial hair
2.లేదంటే మీరు ట్రిమ్మర్ ని కూడా ఉపయోగించవచ్చు. స్పెషల్ గా మార్కెట్ లో ఫేషియల్ హెయిర్ తొలగించే ట్రిమ్మర్స్ అందుబాటులో ఉన్నాయి. మీరు వాటిని ఉపయోగించి.. మీ ముఖంపై లేదంటే.. అప్పర్ లిప్ పై హెయిర్ ని తొలగించవవచ్చు. అయితే.. ఇది వెంట్రుకలు మొత్తం తొలగించదు. కానీ.. చూడటానికి తక్కువగా కనిపిస్తాయి. మనకు నేచురల్ లుక్ ఇవ్వడంలో సహాయం చేస్తుంది.
3.వీటికంటే సులభంగా ఉండే మరో సదుపాయం కూడా ఉంది. అదే హెయిర్ రిమూవల్ క్రీమ్స్. ప్రస్తుతం మార్కెట్లో చాల రకాల క్రీమ్స్, పౌడర్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిని ఉపయోగించడం వల్ల.. మీకు పెద్దగా నొప్పి కూడా కలగదు. హెయిర్ తొలగించడం కూడా చాలా సులువు. అప్పర్ లిప్ మాత్రమే కాదు.. చేతులు, కాళ్ల దగ్గర హెయిర్ కూడా మీరు ఈ క్రీమ్, పౌడర్లతో తొలగించవచ్చు. వీటిని వాడే ముందు ప్యాచ్ టెస్టు చేసుకోవడం ఉత్తమం.
4. ఇక స్పెషల్ గా అప్పర్ లిప్, ఫేషియల్ హెయిర్ ని తొలగించడానికి మార్కెట్లో వ్యాక్సింగ్ స్ట్రిప్స్ అందుబాటులో ఉన్నాయి. వాటితో సులభంగా అన్ వాంటెడ్ హెయిర్ ని తొలగించవచ్చు. షేవింగ్ తో చేసినా మొత్తం రూట్స్ తొలగించలేం. కానీ.. ఈ వ్యాక్సింగ్ స్ట్రిప్స్ తో పూర్తిగా తొలగించగలం. మంచి క్లీన్ లుక్ వస్తుంది.
5.ఇవేవీ కాకుండా... సహజంగా కూడా ఈ హెయిర్ ని తొలగించవచ్చు. పసుపు, షుగర్ బేస్డ్ వ్యాక్స్ లాంటి వాటితో కూడా సులభంగా హెయిర్ ని తొలగించవచ్చు. ఈ సహజ పద్దతులను వాడటం వల్ల... హెయిర్ గ్రోత్ ని కాస్త తగ్గించవచ్చు.