ఇలా క్లీన్ చేస్తే.. ఇంట్లో దుమ్ము కొంచెం కూడా ఉండదు
దీపావళికి ప్రతి ఒక్కరూ ఇళ్లంతా క్లీన్ చేస్తారు. కానీ ఎంత క్లీన్ చేసినా.. ఎక్కడో ఒకచోట దుమ్ము, దూళి ఖచ్చితంగా ఉంటుంది. కానీ మీరు ఒక పద్దతి ప్రకారం.. క్లీన్ చేస్తే గనుక మీ ఇంట్లో కొంచెం కూడా దుమ్ము, ధూళి ఉండదు. ఇల్లు అందంగా కనిపిస్తుంది. క్లీనింగ్ కూడా తొందరగా అయిపోతుంది.
దీపావళి ప్రతి ఒక్కరికీ ఎంతో ఇష్టమైన పండుగ. ఇది మన ఇంటికి సంతోషాన్ని, కాంతులను తెస్తుంది. అందుకే ఈ పండుగకు ప్రతి ఒక్కరూ తమ తమ ఇంటిని అందంగా అలంకరిస్తారు.
ఇంతకంటే ముందు ప్రతి ఒక్కరూ ఇంట్లో ఉన్న దుమ్ము, ధూళిని దులిపేసి నీట్ గా చేస్తారు. చాలా మంది పండుగలకు నెల ముందు నుంచే ఇంటిని క్లీన్ చేయడం స్టార్ట్ చేస్తుంటారు. కానీ నెలలు, వారాల ముందే ఇంటిని క్లీన్ చేస్తే ఇంట్లో మళ్లీ దుమ్ము పేరుకుపోతుంది.
కానీ దీపావళి పనులు, బంధువుల మధ్య ఇంటిని క్లీన్ చేయడం చాలా కష్టం. అలాగే బాగా అలసటగా కూడా ఉంటుంది. అయితే మీరు ఒకసారి శుభ్రం చేసిన తర్వాత ఇంట్లో దుమ్ము పేరుకుపోతే ఎలాంటి టెన్షన్ పడకండి. ఎందుకంటే కొన్ని చిట్కాలతో ఈ దుమ్మును సులువుగా పోగొట్టొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
దీపావళికి ముందు ఇంట్లో దుమ్మును ఎలా తొలగించాలి
దీపావళి అయినా సరే మరే ఇతర పండుగలైనా సరే.. పండుగ ఇంకా కొన్ని వారాలు ఉండగా ఇంటిని డీప్ క్లీనింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. అయితే సూపర్ సర్ఫేస్ ను శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. దీంతో మీ ఇల్లు శుభ్రంగా, అందంగా, కాంతివంతంగా కనిపిస్తుంది.
ఇంటిని త్వరగా శుభ్రం చేయడానికి కాటన్ క్లాత్, టవల్స్ అవసరమవుతాయి. గ్లాస్ క్లీనర్ ఉంటే అది క్లీన్ చేయడానికి సహాయపడుతుంది. ఇది దుమ్మును క్లీన్ చేయడానికి బాగా సహాయపడుతుంది.
కిటికీలను శుభ్రం చేయండి
ఇంటి కిటికీలకు దుమ్ము, ధూళి బాగా పట్టుకుంటాయి. అందుకే డీప్ క్లీనింగ్ తర్వాత పండుగ రాకముందే కిటికీలను, ఇంటి తలుపులను శుభ్రం చేయాలి.
తలుపులను క్లీన్ చేయడానికి విండో క్లీనర్ ను ఉపయోగించండి. మీ ఇంట్లో విండో క్లీనర్ లేకపోతే నిమ్మకాయ, వెనిగర్ తో కూడా ఇంటిని క్లీన్ చేయొచ్చు.
ఇందుకోసం కొన్ని నీళ్లలో కొన్ని చుక్కల వెనిగర్ లేదా నిమ్మకాయ రసాన్ని మిక్స్ చేయండి. దీన్ని స్ప్రే బాటిల్ లో పోసి ఉపయోగించండి.
ఈ ద్రావణాన్ని పిచికారీ చేసిన తర్వాత కాటన్ క్లాత్ తో కిటికీలను బాగా క్లీన్ చేయండి. అయితే దీనికంటే ముందు కిటికీ గ్లాసును వార్తాపత్రికతో శుభ్రం చేయండి. దీంతో గాజుపై గీతలు, మరకలు పడవు.
ధూళిని ఎలా పోగొట్టాలి
ఇందుకోసం మైక్రోఫైబర్ లేదా కాటన్ క్లాత్ ను తీసుకోండి. తర్వాత ఇంటి మూలలు, ఎత్తైన ప్రదేశాల నుంచి ధూళిని దులపండి. అయితే కాటన్ క్లాత్ తో దుమ్ము, ధూళి ఉన్న వస్తువులను తుడిస్తే అవి బాగా శుభ్రపడతాయి.
అలాగే ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు దెబ్బతినకుండా ఉంటాయి. మీ ఇంట్లో వాక్యూమ్ క్లీనర్ ఉంటే ఇంటిని క్లీన్ చేయడం మరింత సులువు అవుతుంది. వాక్యూమ్ క్లీనర్ తో సోఫాను చాలా సులువుగా క్లీన్ చేయొచ్చు. ఇది నిమిషాల్లో ధూళి కణాలను సేకరిస్తుంది.
తడి మోప్
ఇంటిని కడిగిన తర్వాత తడి మోప్ తో మళ్లీ తుడవండి. ఇది మీ ఇంటి ఫ్లోర్ ను మెరిసేలా చేస్తుంది. ఇందుకోసం మోప్ వాటర్ లో కొంచెం వెనిగర్ లేదా డిటర్జెంట్ ను కలపండి. దీనితో ఇంటిని తుడిచిన తర్వాత ఫ్యాన్ ఆన్ చేయండి. ఇది ఫ్లోర్ తొందరగా ఆరేలా చేస్తుంది. అలాగే మీ పనికూడా సులువు అవుతుంది.
ఫ్లోర్ తో పాటుగా టేబుల్, ఇతర వస్తువులను కూడా తేలికపాటి తడి గుడ్డతో శుభ్రం చేయండి. టేబుళ్లు, అల్మారాలు, కుర్చీలు మొదలైన వాటిని మెత్తగా ఉండే తడిగుడ్డతో మాత్రమే శుభ్రం చేయాలి.
మీ ఇంట్లో గ్లాస్ టేబుల్ ఉంటే స్ప్రే బాటిల్ తో క్లీన్ చేయండి. దీన్ని స్ప్రే చేసి తర్వాత వార్తాపత్రికతో బాగా తుడవండి. వార్తాపత్రికతో శుభ్రం చేసిన తర్వాత మెత్తని కాటన్ క్లాత్ తో టేబుల్ ను క్లీన్ చేయండి.