ఈ ఒక్కటి పెట్టినా నెత్తిమీద చుండ్రు ఉండదు.. వెంట్రుకలు రాలవు
నెత్తిమీద చుండ్రు చిరాకు కలిగించడమే కాకుండా.. బాగా వెంట్రుకలు ఊడిపోయేలా కూడా చేస్తుంది. అందుకే దీన్ని ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా జుట్టు విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంటారు. ప్రతి ఒక్కరికీ వెంట్రుకలు ఒత్తుగా, షైనీగా, పొడుగ్గా ఉండాలని ఉంటుంది. కానీ మారుతున్న ఈ కాలంలో జుట్టు ఇలా ఉండటం ఇంపాజిబుల్. కానీ కొన్ని చిట్కాలతో మాత్రం మీరు కోరుకున్న జుట్టును పొందొచ్చు.
dandruff
ప్రస్తుత కాలంలో చాలా మంది ఎన్నో రకాల జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు. మారుతున్న వాతావరణం వల్ల వచ్చే జుట్టు సమస్యల్లో చుండ్రు ఒకటి. చుండ్రు చిన్న సమస్యగా అనిపించినా.. దీనివల్లే జుట్టంతా ఊడిపోయి బట్టతల వస్తుంది. జుట్టు పల్చగా అవుతుంది. వెంట్రుకలు బలం కోల్పోతాయి.
షైనీగా ఉండవు. అంతేకాదు నెత్తిమీద విపరీతంగా దురద కూడా పెడుతుంది. చుండ్రును అలాగే వదిలేస్తే మీ నెత్తిమీద ఒక తెల్లని పొర ఏర్పడుతుంది. అలాగే నెత్తికి సంబంధించిన ఎన్నో సమస్యలు కూడా వస్తాయి. అందుకే ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
తేనె, ఉల్లిపాయ రసం, టీ ట్రీ ఆయిల్ తో చుండ్రు మాయం..
చుండ్రును నేచురల్ గా కూడా మనం పోగొట్టొచ్చు. ఇందుకోసం తేనె, ఉల్లిపాయ రసం, టీ-ట్రీ ఆయిల్ చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. ఈ మూడింటితో తలపై ఏర్పడిన చుండ్రు పొరను సులువుగా పోగొట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు.
తేనె, ఉల్లిరసం, టీ ట్రీ ఆయిల్ లో యాంటీఆక్సిడెంట్, మాయిశ్చరైజింగ్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన జుట్టుకు ఎన్నో విధాలుగా మేలు చేస్తాయి. జుట్టు సమస్యలను తగ్గించడానికి సహాయపడతాయి. ఈ తేనె, ఉల్లిపాయ రసంతో పాటుగా టీ ట్రీ ఆయిల్ ను ఉపయోగించడం వల్ల నెత్తి, వెంట్రుకలు ఆరోగ్యంగా ఉంటాయి.
చుండ్రును పోగొట్టడానికి కావాల్సిన పదార్థాలు
తేనె- 4 టీస్పూన్లు
ఉల్లిపాయ రసం - 2 టీస్పూన్లు
టీ ట్రీ ఆయిల్ - 1 టీస్పూన్
చుండ్రును పోగొట్టడానికి దీన్ని ఇలా ఉపయోగించాలి
ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో తేనెను వేయండి. దీనిలోనే ఉల్లిపాయ రసం వేసి కలపండి. ఆ తర్వాత దీనిలోనే టీ ట్రీ ఆయిల్ ను వేసి మూడింటిని బాగా కలగలపండి. ఇంతే ఈ మిశ్రమాన్ని తలకు బాగా అప్లై చేయండి. ఒక 2 నుంచి 3 గంటల తర్వాత తలస్నానం చేస్తే సరిపోతుంది.
అయితే జుట్టును వాష్ చేసిన తర్వాత గోరు వెచ్చని నీళ్లతో జుట్టును కడగాలి. ఇలా మీరు వారానికి రెండు నుంచి 3 రోజులు ఇలా చేస్తే మీ నెత్తిమీద చుండ్రు లేకుండా పోతుంది. కానీ ఏదైనా ప్రిస్క్రిప్షన్ ప్రయత్నించే ముందు ఖచ్చితంగా ప్యాచ్ టెస్ట్ చేయాలి.