రాత్రి పడుకునే ముందు ఈ 5 ఫాలో అయితే.. ఉదయానికి ముఖం మెరిసిపోవడం ఖాయం!
ముఖం అందంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. కానీ రోజంతా మనం చేసే పనుల వల్ల దుమ్ము, ధూళి వంటివి పేరుకుపోయి ముఖం కాంతిహీనంగా మారుతుంది. అయితే రాత్రి పడుకునే ముందు కొన్ని సింపుల్ చిట్కాలు పాటించడం ద్వారా ముఖం మెరిసిపోయాలా చేయవచ్చు. అవేంటో ఇక్కడ చూద్దాం.

ముఖ సౌందర్యం కోసం పాటించాల్సిన చిట్కాలు
రోజంతా పనులు, కాలుష్యం, సూర్యరశ్మితో మన చర్మం ఎంతో ఒత్తిడిని ఎదుర్కొంటుంది. సాయంత్రం అద్దంలో చూసినప్పుడు చర్మం అలసిపోయినట్టు, మసకబారినట్టు కనిపిస్తే మనసుకు బాధ కలుగుతుంది. అయితే ఇక్కడ సంతోషించాల్సిన విషయం ఏమిటంటే... చర్మం రాత్రి సమయంలోనే.. అంటే నిద్రలో ఉన్నప్పుడే తిరిగి రిపేర్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి రాత్రి పడుకునే ముందు సరైన చర్మ సంరక్షణ పద్ధతులు పాటిస్తే.. ఉదయానికి ముఖం కాంతివంతంగా, మృదువుగా మారుతుంది.
ముఖాన్ని శుభ్రం చేయడం
రోజంతా బయట తిరిగిన తర్వాత చర్మంపై దుమ్ము, ధూళి, నూనె, మేకప్ వంటివి పేరుకుపోతాయి. ఇవి రాత్రంతా ఉంటే చర్మంపై రంధ్రాలు మూసుకుపోయి మొటిమలు, పిగ్మెంటేషన్ సమస్యలు వస్తాయి. కాబట్టి పడుకునే ముందు ఒక మైల్డ్ క్లెన్సర్‌తో ముఖం బాగా కడగాలి. మీ స్కిన్ టైప్‌కి సరిపోయే క్లెన్సర్‌ని ఎంచుకోవడం ముఖ్యం. ఒకసారి కడిగిన తర్వాత టవల్‌తో మృదువుగా తుడుచుకోవాలి.
టోనర్ వాడకం
క్లెన్సింగ్ తర్వాత చర్మం కొంచెం డ్రైగా అవుతుంది. అప్పుడు టోనర్ ఉపయోగిస్తే చర్మం pH లెవల్ సమతుల్యం అవుతుంది. టోనర్ రంధ్రాలను కుదించి, చర్మానికి సాఫ్ట్ టెక్స్చర్ ఇస్తుంది. రోజ్‌వాటర్ లేదా ఆల్కహాల్-ఫ్రీ టోనర్‌ని ఉపయోగించడం మంచిది. కాటన్ ప్యాడ్‌తో సున్నితంగా ముఖంపై రాయాలి. ఇది చర్మాన్ని తాజాగా ఉంచుతుంది.
సీరమ్ లేదా నైట్ క్రీమ్
రాత్రి సమయంలోనే ఎక్కువగా చర్మ కణాలు రిపేర్ అవుతాయి. కాబట్టి ఈ సమయంలో సరైన న్యూట్రిషన్ ఇవ్వడం చాలా ముఖ్యం. విటమిన్ C, హైలురోనిక్ యాసిడ్, రెటినాల్ వంటి పదార్థాలు ఉన్న సీరమ్ లేదా నైట్ క్రీమ్ ఉపయోగిస్తే చర్మం కాంతివంతంగా మారుతుంది. మీ వయసు, స్కిన్ టైప్‌కి సరిపోయే ప్రోడక్ట్ ఎంచుకోవాలి. దాన్ని సున్నితంగా ముఖంపై మసాజ్ చేస్తే రక్త ప్రసరణ మెరుగవుతుంది. తద్వారా సహజంగా గ్లో వస్తుంది.
కళ్ల చుట్టూ ప్రత్యేక శ్రద్ధ
కళ్ల చుట్టూ చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. అలసట, నిద్రలేమి, మొబైల్ స్క్రీన్‌ల వల్ల డార్క్ సర్కిల్స్ వస్తాయి. రాత్రిపూట పడుకునే ముందు ఐ క్రీమ్ లేదా బాదం నూనెను కళ్ల చుట్టూ సున్నితంగా మసాజ్ చేయాలి. ఇది ఆ ప్రాంతంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. దానివల్ల కళ్లు రిలాక్స్ అవుతాయి. ఉదయానికి కళ్ల చుట్టూ చర్మం మృదువుగా, ఫ్రెష్‌గా కనిపిస్తుంది.
మంచి నిద్ర
ఎన్ని ప్రోడక్ట్స్ వాడినా సరే.. సరైన నిద్ర లేకపోతే ఫలితం కనిపించదు. నిద్రలేమి వల్ల స్ట్రెస్ హార్మోన్లు పెరిగి చర్మం కాంతిహీనంగా కనిపిస్తుంది. రోజుకు కనీసం 7–8 గంటల నిద్ర తప్పనిసరి. పడుకునే ముందు ఫోన్ లేదా ల్యాప్‌టాప్ వాడకూడదు. చిన్న మెడిటేషన్ లేదా మంచి మ్యూజిక్ వింటే నిద్ర త్వరగా వస్తుంది. మంచి నిద్ర చర్మానికి సహజమైన ట్రీట్మెంట్ లాంటిది.