మంచం, సోఫా కింద ఉండే దుమ్మును, మురికిని ఎలా శుభ్రం చేయాలి?
ఇల్లును చాలా ఈజీగా క్లీన్ చేయొచ్చు. కానీ సోఫా, బెడ్ కింద మాత్రం క్లీన్ చేయడం పెద్ద తలనొప్పిగా మారుతుంది. ఎందుకంటే సోఫా, బెడ్ కింద పేరుకుపోయిన మురికి అంత సులువుగా క్లీన్ అవ్వదు. అయితే కొన్ని సింపుల్ టిప్స్ తో మంచం, సోఫా కింద పేరుకుపోయిన దుమ్ము, దుళిని సులువుగా క్లీన్ చేయొచ్చు. అదెలాగంటే?
ఎండాకాలం వచ్చిందంటే చాలు వాతావరణం పూర్తిగా మారిపోతుంది. మారుతున్న వాతావరణ పరిస్థితులు, గాలి వేగం వల్ల ఇంట్లోకి దుమ్ము బాగా వస్తుంది. దీంతో నేల, కిటికీ తలుపు, గోడలకు విపరీతంగా దుమ్ము విపరీతంగా పేరుకుపోతుంది. దుమ్మును, మురికిని మోపింగ్ క్లాత్ తో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. నిజానికి ప్రతి ఒక్కరూ వీటిని రోజూ శుభ్రం చేస్తుంటారు. కానీ మంచం, సోఫా కింద మాత్రం అస్సలు క్లీన్ చేయరు. ఇవి రోజూ క్లీన్ చేయని ప్రదేశాలు. అందుకే వీటికింద దుమ్ము, దూళి విపరీతంగా పేరుకుపోతుంది.
సోఫా, మంచం కింద శుభ్రం చేయాలంటే కొన్ని కాస్త ఓపిక ఉండాలి. చాలా మంది నెలల తరబడి వీటిని శుభ్రం చేయకుండా ఉంటారు. ఎందుకంటే వీటి కిందికి వెళ్లి శుభ్రం చేసేంత ప్లేస్ ఉండదు. వాటిని పక్కకు జరిపి క్లీన్ చేసేంత టైం కూడా ఉండదు. అందుకే వీటికింద దుమ్ము పేరుకుపోతుంది. కానీ కొన్ని సింపుల్ టిప్స్ తో చాలా ఈజీగా వీటిని క్లీన్ చేయొచ్చు. అలాగే దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా ఉండదు. మరి వీటిని ఎలా క్లీన్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
సాక్స్ తో శుభ్రం చేయండి
మీరు వాడిన పాత లేదా పనికిరాని సాక్స్ కు ఇంట్లో చాలానే ఉంటాయి. ఈ పనికిరాని సాక్స్ తో కూడా మీరు సోఫా, మంచం కింద మురికిని చాలా సులువుగా శుభ్రం చేయొచ్చు. ఇందుకోసం..
సాక్స్ ను డిటర్జెంట్ నీటిలో నానబెట్టండి. వీనిని వైపర్లకు చుట్టండి. ఇప్పుడు వైపర్ ను మంచం, సోఫా కింద బాగా రుద్దండి. దుమ్ము దగ్గర సాక్స్ రుద్దడం వల్ల దుమ్ము, ధూళి సాక్సులకు అంటుకుంటాయి. ఆ తర్వాత దుమ్ము లేని క్లాత్ తో తుడవండి. అంతే నేల తలతల మెరిసిపోతుంది.
మీరు సోఫా, మంచం కింద ప్లేస్ ను మీరు గోనె సంచితో కూడా క్లీన్ చేయొచ్చు. దీనిని వాడితే మురికి చిటికెలో తొలగిపోతుంది. ఈ సంచులు చాలా కఠినంగా ఉంటాయి. అలాగే నేలను శుభ్రపరచడానికి కూడా ఇవి బాగా ఉపయోగపడతాయి. మీరు ఈ సంచిని కర్ర లేదా వైపర్ తో కట్టి డిటర్జెంట్ నీటిలో నానబెట్టి నేలను రుద్దితే సరి. నేలపై పేరుకుపోయిన దుమ్ము, ధూళిని గోనె సంచులు సులభంగా శుభ్రపరుస్తాయి.
స్క్రబ్బర్
డిష్ వాషింగ్ హార్డ్ స్క్రబ్బర్ తో కూడా మీరు మంచం, సోఫా కింద మురికిని శుభ్రం చేసుకోవచ్చు. స్క్రబ్బర్ తో క్లీన్ చేయడానికి ముందు వైపర్ లేదా ఒక కట్టెకు ఒక గుడ్డను కట్టి నేలను శుభ్రం చేయండి. మోపింగ్ చేసిన తర్వాత స్క్రబ్బర్ తో రుద్దండి. దీంతో మీరు చేతికి అందనంత దూరాన్ని కూడా సులువుగా శుభ్రం చేసుకోవచ్చు. మురికి ఎక్కువగా ఉంటే మీరు తడి గుడ్డతోతుడిచి శుభ్రం చేసుకోవాలి.