మొటిమలు తగ్గాలంటే ఏం చేయాలి?
మొటిమలు తగ్గేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసినా.. అస్సలు తగ్గని వారు చాలా మందే ఉన్నారు. అయితే కొన్నిసింపుల్ టిప్స్ తో మొటిమలను చాలా తొందరగా తగ్గించుకోవచ్చు. అదెలాగంటే?
టీనేజ్ వాళ్లకే మొటిమలు ఎక్కువగా అవుతుంటాయి. ఏం చేసినా ఇవి మాత్రం తగ్గవు. చాలా మంది మొటిమలు తగ్గడానికని ఎన్నో రకాల క్రీంలను కూడా వాడుతుంటారు. వీటివల్ల చర్మం దెబ్బతినడమే కాకుండా.. మొటిమలు ఏ మాత్రం తగ్గనే తగ్గవు. ముఖ చర్మంలో నూను ఎక్కువగా ఉత్పత్తి కావడం వల్లే మొటిమలు అవుతాయి. దీనితో పాటుగా మొటిమలు రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అయితే కొన్ని సింపుల్ టిప్స్ తో మొటిమలను తగ్గించుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..
కలబంద జెల్
కలబంద గుజ్జులో ఎన్నో ఔషదగుణాలుంటాయి. దీన్ని ఉపయోగించి మొటిమలను తగ్గించుకోవచ్చు. కలబంద గుజ్జులో నేచురల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ వంటి ఎన్నో లక్షణాలు ఉంటాయి. ఇవి చర్మానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. కలబంద జెల్ ను ఉపయోగించి మొటిమలను తగ్గించుకోవచ్చు.
aloe vera gel
కలబంద జెల్ ను ఇలా వాడండి
మొటిమలను తగ్గించుకోవడానికి అలోవెరా జెల్ లో తేనెను కలిపి పేస్ట్ లా చేయండి. దీన్ని ముఖానికి అప్లై చేయండి. ఈ పేస్ట్ ను రోజూ ఉపయోగించడం వల్ల మొటిమలు పెరగవు. క్రమంగా తగ్గిపోతాయి.
Green Tea
గ్రీన్ టీ
గ్రీన్ టీ ఆరోగ్యానికే కాదు అందానికి కూడా ప్రయోజకరంగా ఉంటుంది. అవును గ్రీన్ టీతో మొటిమలను తగ్గించుకోవచ్చు. గ్రీన్ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు మొటిమలను తగ్గించడానికి ఉపయోగపడతాయి.
దీన్ని ఇలా ఉపయోగించండి
గ్రీన్ టీ బ్యాగ్ ను వేడినీటిలో వేయండి. ఇది చల్లారిన తర్వాత ఈ గ్రీన్ టీ నీటిని మొటిమలపై అప్లై చేస్తే మొటిమలు తగ్గిపోతాయి.
Image: FreePik
గంధం
గంధాన్ని కూడా మొటిమలను తగ్గించుకోవడానికి ఉపయోగించొచ్చు. గంధలో యాంటీపైరెటిక్, యాంటీసెప్టిక్, యాంటీ సెప్టిక్ వంటి అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మొటిమలను తగ్గించడానికి బాగా ఉపయోగడపతాయి.
Image: FreePik
దీన్ని ఇలా ఉపయోగించండి
గంధం పొడిని తీసుకుని అందులో కొన్ని చుక్కల నిమ్మరసం, తేనె వేసి పేస్ట్ లా చేయండి. దీన్ని మొటిమల మీద మాత్రమే అప్లై చేసి కొన్ని గంటల తర్వాత నార్మల్ వాటర్ తో కడిగేయండి. ఈ విధంగా గంధం ఉపయోగించడం వల్ల మొటిమలు తొందరగా తగ్గిపోతాయి.