జుట్టుకు నూనె ఎప్పుడు, ఎలా పెట్టాలో తెలుసా?
చాలా మంది జుట్టుకు ఎప్పుడో ఒకసారి మాత్రమే నూనెను పెడుతుంటారు. కానీ మీ జుట్టు ఊడిపోకుండా, ఒత్తుగా ఉండాలంటే మాత్రం జుట్టుకు సక్రమంగా నూనె పెట్టాలి.
మన జుట్టుకు నూనె చాలా చాలా అవసరం. ఇది మన జుట్టుకు సరైన పోషణను అందించడమే కాకుండా.. వెంట్రుకలు ఊడిపోకుండా కాపాడుతుంది. అందుకే పెద్దలు చెప్తుంటారు.. జుట్టుకు బాగా నూనె పెట్టాలని. నిజానికి నూనె రాయడం వల్ల జుట్టు జుట్టు స్ట్రాంగ్ గా, దట్టంగా మారుతుంది. అలాగే హెయిర్ ఫాల్ సమస్య కూడా చాలా వరకు తగ్గుతుంది. కానీ మనలో చాలా మంది జుట్టుకు సరిగ్గానూనెను పెట్టరు. దీనివల్లే లేనిపోని జుట్టు సమస్యలు వస్తాయి. అందుకే జుట్టుకు నూనెను సరిగ్గా ఎలా పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
జుట్టుకు వారానికి ఎన్ని సార్లు నూనె పెట్టాలి?
మన జుట్టు ఆరోగ్యంగా, స్ట్రాంగ్ గా ఉండాలంటే ఖచ్చితంగా నూనె పెట్టాలి. నూనె మన జుట్టుకు అవసరమైన పోషకాలను అందిస్తుంది. ఇందుకోసం వారానికి 2 లేదా 3 సార్లు నూనెతో హెయిర్ మసాజ్ చేయాలి. ఇది మీ జుట్టును హెల్తీగా ఉంచుతుంది.
జుట్టుక ఎప్పుడు నూనె పెట్టాలి?
మీరు ఎప్పుడైనా సరే.. మీరు తలస్నానం చేయడానికి ముందే జుట్టుకు నూనె పెట్టాలి. ఇందుకోసం తలస్నానం చేయడానికి 2 లేదా 3 గంటల ముందు జుట్టుకు బాగా నూనె రాసుకోవాలి. అంతేకాదు రాత్రిపూట నూనె పెట్టుకుని మీరు ఉదయాన్నే షాంపూతో తలస్నానం చేయొచ్చు.
తలస్నానం చేసిన తర్వాత నూనె పెట్టొచ్చా?
తలస్నానం చేసిన తర్వాత ఎట్టిపరిస్థితిలో జుట్టుకు నూనె పెట్టకూడదు. ఎందుకంటే ఇలా చేయడం వల్ల జుట్టుకు దుమ్ము, ధూళి అంటుకుంటాయి. దీని వల్ల మీ జుట్టు ఆరోగ్యం దెబ్బతింటుంది. అలాగే వెంట్రుకలు కూడా బాగా రాలుతాయి. అందుకే తలస్నానం చేయడానికి ముందే నూనె పెట్టాలి.
hair care
నూనె గోరువెచ్చగా..
గోరువెచ్చని నూనె జుట్టుకు మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. కాబట్టి జుట్టుకు నూనె రాసుకునే ముందు దాన్ని గోరువెచ్చగా చేయండి. ఇది చల్లారిన తర్వాత వేళ్లతో తలకు బాగా పట్టించి కాసేపు మసాజ్ చేయండి.
జుట్టుకు నూనె పెట్టిన తర్వాత ఏం చేయాలి?
జుట్టుకు నూనె పెట్టి కాసేపు మసాజ్ చేసిన తర్వాత టవల్ ను గోరువచ్చని నీటిలో నానబెట్టి 10 నిమిషాల పాటు జుట్టుకు కట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల జుట్టుకు నూనె బాగా చేరుతుంది. జుట్టుకు ఇలా నూనె పెట్టడం వల్ల వెంట్రుకలు స్ట్రాంగ్ గా, దట్టంగా అవుతాయి. అలాగే జుట్టు రాలే సమస్యను కూడా తగ్గుతుంది.