MalayalamNewsableKannadaTeluguTamilBanglaHindiMarathimynation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Life
  • Woman
  • ఒక్క చేతిలో ఎన్ని గాజులు వేసుకోవాలి?

ఒక్క చేతిలో ఎన్ని గాజులు వేసుకోవాలి?

పెళ్లి తర్వాత ఆడవారు ఖచ్చితంగా చేతులకు గాజులను వేసుకుంటారు. గ్రామాల్లో ఉండేవారు చేతినిండా గాజులను వేసుకుంటే.. పట్టణాల్లో మాత్రం ఒక్కో చేతికి రెండు మూడు గాజులను వేసుకుంటారు. అయితే జ్యోతిష్యం ప్రకారం.. ఒక్కో చేతికి ఎన్ని గాజులు వేసుకోవాలో తెలుసా? 

Shivaleela Rajamoni | Published : Feb 29 2024, 10:47 AM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
15
Asianet Image


పెళ్లితో ఆడవారి జీవితంలో ఎన్నో మార్పులొస్తాయి. ముఖ్యంగా కట్టు, బొట్టులో. పెళ్లి తర్వాత నుదిటిన ఖచ్చితంగా బొట్టుపెట్టుకోవాలని, మెడలో తాళి బొట్టు, చేతులకు గాజలు వేసుకోవాలని, కాలి వేళ్లకు మెట్టెలు పెట్టుపెట్టుకోవాలనే నియమాలు ఉన్నాయి. ఇవన్నీ ఆమె ముత్తైదువని చూపిస్తాయి. అయితే ప్రస్తుత కాలంలో చాలా మంది మహిళలు గాజలును వీలైనంత తక్కువగా వేసుకుంటున్నారు. ఒక్కో చేతికి ఒకటి, రెండు లేదా మూడు వేసుకుంటున్నారు. కొంతమంది ఆడవారైతే ఒక చేతికి వాచ్ పెట్టుకుని.. ఇంకో చేతికి ఒకటిరెండు గాజులను వేసుకుంటున్నారు. కానీ హిందూ మతంలో పెళ్లైన ఆడవారు ఒక్కోచేతికి కొన్ని గాజులను ఖచ్చితంగా వేసుకోవాలి. హిందూ మతంలో ప్రకారం.. ఒక్క చేతికి ఎన్ని గాజులు వేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

25
Bangles

Bangles

చంద్రుని చిహ్నం

వాస్తు శాస్త్రంలో.. గాజులను బుధుడు, చంద్రుడి చిహ్నాలుగా భావిస్తారు. వీటిని వేసుకోవడం పెళ్లైన ఆడవారికి ఎంతో శుభదాయకమని చెబుతున్నారు.

మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం

చేతులకు గాజులను కేవలం అందం కోసమే వేసుకుంటారని చాలా మంది అనుకుంటారు. నిజమేంటంటే? చేతులకు గాజులను వేసుకోవడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఇది ఆడవాళ్ల మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.

35
Asianet Image

ఒక చేతిలో ఎన్ని గాజులు వేసుకోవాలి? 

ఎవరికి నచ్చినన్ని వారు గాజులను వేసుకుంటుంటారు. కానీ జ్యోతిష్యం ప్రకారం.. పెళ్లైన ప్రతి మహిళ ఒక్క చేతిలో కనీసం 21 గాజులను వేసుకోవాలి. అలాగే రెండు చేతులకు సమానంగా గాజులు ఉండాలి. 

బ్రాస్ లెట్

గాజులతో పాటుగా మీరు మీ చేతులకు  బ్రాస్లెట్లను కూడా ధరించొచ్చు. ఇందుకోసం బంగారం లేదా వెండితో చేసిన 2 బ్రేస్ లెట్లను కలిపి వేసుకోవచ్చు. 
 

45
Asianet Image

నవ వధువు ఎన్ని గాజులు వేసుకోవాలి?

కొత్తగా పెళ్లైన ఆడవారు ఖచ్చితంగా గాజులను నిండుగా వేసుకోవాలని పెద్దలు చెప్తుంటారు. నవ వధువులు ఒక సంవత్సరం పాటు చేతులకు గాజు గాజులను వేసుకోవాలనే సాంప్రదాయం ఉంది. ఏడాది కాకుండా కనీసం 40 రోజుల పాటైనా గాజులను కచ్చితంగా వేసుకోవాలని జ్యోతిష్యులు చెబుతున్నారు. 

55
Asianet Image

కొత్త గాజులను ఏ సమయంలో వేసుకోవాలి

మీరు మీ పాత గాజులను తీసేసి కొత్తవాటిని వేసుకోవాలనుకుంటే.. కొత్త గాజులను ఉదయం లేదా సాయంత్రం పూట మాత్రమే మార్చుకోండి. మధ్యాహ్నం పూట పాత గాజులను తీసేసి కొత్త గాజులను వేసుకోకూడదు. 

ఏ కలర్ గాజులు వేసుకోవాలి? 

పెళ్లైన ఆడవారు ఎప్పుడూ కూడా ఎరుపు, ఆకుపచ్చ లేదా పసుపు రంగు గాజులనే వేసుకోవాలని జ్యోతిష్యులు చెబుతున్నారు. వీళ్లు పొరపాటున కూడా నలుపు, ముదురు రంగుల గాజులను వేసుకోకూడదు. 

Shivaleela Rajamoni
About the Author
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు. Read More...
 
Recommended Stories
Top Stories