పెళ్లి నగలు కొత్తగా ఉండాలంటే ఏం చేయాలి?
ఆడవాళ్లకు నగలంటే పిచ్చి. నచ్చిన వస్తువులను కొనేస్తూనే ఉంటారు. బంగారం, వెండితో చేసిన ఎన్నో ఆభరణాలను బీరువాల్లో దాచేస్తుంటారు. అయితే ఇవి కొన్నేళ్ల తర్వాత పాతవాటిలా కనిపిస్తుంటాయి. కొంతమంది వీటిని సబ్బు, సర్ఫ్ లతో క్లీన్ చేస్తుంటారు. కానీ కొన్ని టిప్స్ తో పాత నగలు కూడా కొత్త వాటిలా మెరిసిపోతాయి.
పెళ్లి నగలు చాలా ప్రత్యేకమైనవి. ఈ నగలను ప్రతి అమ్మాయి తన జీవితాంతం అలాగే ఉంచుకుంటుంది. ఎన్ని కొత్త నగలను కొన్నా వాటిని మాత్రం అమ్మరు. అయితే బంగారు, వెండి లేదా ఇతర లోహాలతో చేసిన నగలు కొన్నేళ్ల తర్వాత అంత ప్రకాశవంతంగా కనిపించవు. నల్లగా కూడా మారిపోతుంటాయి. అయితే మీరు కొన్ని సింపుల్ టిప్స్ ను పాటిస్తే మాత్రం ఎప్పుడో కొన్న నగలు కూడా కొత్త వాటిలా తలతల మెరిసి పోతాయి. ఇందుకోసం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. దీని కోసం, కొన్ని చిట్కాలు లేదా విషయాలను గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. నగలను కొత్తగా ఎలా ఉంచుకోవాలో తెలుసుకుందాం.
నీటికి దూరంగా ఉండాలి
బంగారం, వెండి వంటి ఎలాంటి నగలైనా సరే వాటిని నీటికి దూరంగా ఉంచాలి. ఎందుకంటే ఇవి నీటిలో తడిస్తే వాటి షైనింగ్ పోతుంది. దీంతో అవి పాతవాటిలా కనిపిస్తాయి. అందుకే మీరు నీటిలో పని చేసేటప్పుడు వాటిని తీసేయడమే మంచిది.
క్లోరిన్ వాటర్
ఆక్సిడైజ్డ్ ఆభరణాలు నార్మల్ వాటర్ కంటే క్టోరిన్ వాటర్ కే ఎక్కువ పాడవుతాయి. దీనివల్ల ఈ ఆభరణాలు వెంటనే నల్లగా మారుతాయి. అందుకే క్లోరిన్ నీటిని ఉపయోగించేటప్పుడు ఆభరణాలను వేసుకోకండి.
ఆభరణాలను ఎలా శుభ్రం చేయాలి
ప్రతి ఆభరణాలను శుభ్రం చేసే విధానం డిఫరెంట్ గా ఉంటుంది. దుమ్ము, ధూళి, కాలుష్యం, చెమట వంటివి ఆభరణాల షైనింగ్ ను దెబ్బతీస్తాయి. పాత వాటిలా కనిపించేలా చేస్తాయి. వీటిని భద్రంగా ఉంచుకోవాలి.
ఇలా శుభ్రం చేయండి
మీ నగలను గోరువెచ్చని వాటర్, సబ్బుతో చాలా తేలికపాటిగా చేతులతో శుభ్రం చేయొచ్చు. ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం వల్ల ఎక్కువ కాలం చెక్కుచెదరకుండా ఉంటాయి.
మేకప్ కు దూరంగా
సాధారణంగా ఆడవాళ్లు మేకప్ వేసుకునే ముందు నగలను పెట్టుకుంటారు. కానీ దీని వల్ల ఆభరణాలపై మేకప్ రేణువులు పడతాయి. దీంతో మీ నగలు మురికిగా, పాత వాటిలా కనిపిస్తాయి. అందుకే ఈ తప్పు చేయకండి.
ఎలా భద్రపరచాలి?
నగలు నల్లగా మారడం అనేది మీరు వాటిని ఎలా భద్రపరుస్తున్నారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. చాలా మంది అన్ని రకాల నగలను ఒకేదగ్గర పెడుతుంటారు. కానీ ఇలా చేయడం మంచిది కాదు.
ఆభరణాలను ఎలా పెట్టాలి?
ఆభరణాలను సరిగ్గా పెట్టడం కూడా ముఖ్యమే. అప్పుడే మీ నగలు చెక్కు చెదరకుండా కొత్త వాటిలా ఉంటాయి. దీని కోసం మీరు నగలను కాటన్ లో చుట్టి పెట్టెలో పెట్టొచ్చు.