కూతురు పుట్టిన తర్వాత అలియా భట్ ఎలా బరువును తగ్గించుకుంది?
బాలీవుడ్ హీరోయిన అలియా భట్ ..కూతురు రాహా పుట్టిన తర్వాత కేవలం నాలుగు నెలల్లోనే తన పాత బాడీ షేప్ కు వచ్చేసింది. కానీ చాలా మంది బిడ్డ పుట్టిన తర్వాత ఇంకా బరువు పెరిగిపోతూ ఉంటారు. అసలు బిడ్డ పుట్టిన తర్వాత అలియా భట్ బరువు ఎలా తగ్గిందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
అలియా భట్ ఎన్నో సినిమాల్లో నటిస్తూ అభిమానులను మెప్పిస్తూనే ఉంది. ప్రొఫేషనల్ లైఫ్, పెళ్లి, మాతృత్వంలో అలియా అభిమానులకు ఫేవరెట్ గా మారింది. వర్క్ ఫ్రంట్ అయినా, ఫ్యామిలీ అయినా అన్నింటినీ ఈ హీరోయిన్ బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతూనే ఉంది. ప్రెగ్నెన్సీ టైంలో అందరి లాగే అలియా కూడా బరువు పెరిగారు. కానీకూతురు రాహా పుట్టిన తర్వాత ఆమె శరీరాకృతి మార్పు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. కూతురు పుట్టిన 4 నెలల్లోనే ఆమె తిరిగి తన పాత రూపానికి వచ్చేసింది. అసలు బిడ్డ పుట్టిన తర్వాత ఆలియా భట్ బరువును ఎలా తగ్గించుకుంటుందో ఒక వ్లాగ్ లో పంచుకుంది. అది ఇప్పుడు మనం కూడా తెలుసుకుందాం..
కూతురు పుట్టిన నాలుగు నెలలకే
అలియా భట్ ఈ విషయంలో అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. కూతురు పుట్టిన కేవలం నాలుగు నెలలకే తిరిగి తన పాత రూపానికి వచ్చేసింది. కానీ ఇది అంత ఈజీగా జరగలేదు. ఇందుకోసం ఈ హీరోయిన్ ఎంతో కష్టపడ్డారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా ఆమె అభిమానులతో పంచుకున్నారు.
ఏరియల్ యోగా
అలియా భట్ ప్రెగ్నెన్సీ తర్వాత బరువు తగ్గడానికి ఏరియల్ యోగా చేసేది. ఇందుకు సంబంధించిన ఫోటోను కూడా అలియా తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. దీనిలో ఆమె ఏరియల్ యోగా చేస్తూ కనిపించారు. తల్లి అయిన తర్వాత మొదటి సారి ట్రై చేస్తున్నానని క్యాప్షన్ కూడా రాసింది.
కోర్ ఎక్సర్ సైజ్
ఎవ్వరికైనా సరే ప్రెగ్నెన్సీ తర్వాత ఆడవాళ్ల పొత్తికడుపు కండరాలు బలహీనపడతాయి. ఇలాంటి పరిస్థితుల్లో అలియా భట్ ముందుగా తన బలాన్ని పెంచుకుంది. ఇందుకోసం ఆమె కోర్ ఎక్సర్ సైజులు చేయింది. కోర్ ఎక్సర్ సైజ్ లు ఆమె బలాన్ని పెంచాయి. అలియా భట్ మొదటి, రెండో వారాల్లో శ్వాస వ్యాయామాలు, నడకపై దృష్టి పెట్టారు. దీంతో ఆమె శరీరం సమతుల్యంగా మారింది.
సూర్య నమస్కారం
ఆరోగ్యంగా ఉండటానికి సూర్య నమస్కారం చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. సూర్య నమస్కారాలు శరీరాన్ని ఫ్లెక్సిబుల్ గా చేస్తాయి. అలియా భట్ ట్రైనర్ అనుష్క పర్వానీ తనను 108 సూర్య నమస్కారాలు చేయిస్తుందని సోషల మీడియా ద్వారా తెలియజేశారు. సూర్య నమస్కారం శరీరం భంగిమ మరియు వశ్యతను మెరుగుపరుస్తుంది.