Facial Wrinkles: ఇవి ఫాలో అయితే.. ముఖంపై ముడతలు రావు..!
Facial Wrinkles: అన్ని రకాల క్రీములు... ఈ ముడతలను తగ్గించలేవు. పైగా అందులో ఉండే.. రసాయనాలు.. మీ ఫేస్ ని మరింత డ్యామేజ్ చేసే ప్రమాదం ఉంది. అసలు.. ఏ వయసులో ఎలాంటి క్రీములు వాడాలి అనే విషయం కూడా చాలా మందికి తెలీదు.

ముడతలకు చెక్ పెట్టేదెలా?
వయసు పెరుగుతుంటే అందం తగ్గడం చాలా సహజం. మరీ ముఖ్యంగా.. ముఖంపై ముడతలు వచ్చేస్తూ ఉంటాయి. ఆ ముడతలు రాకుండా ఉండేందుకు, ఎక్కువ కాలం యవ్వనంగా కనిపించేందుకు చాలా మంది మార్కెట్లో దొరికే ఏవేవో క్రీములు తెచ్చి ముఖానికి పూసేస్తూ ఉంటారు. కానీ.. ఆ క్రీములు చాలా ఖరీదుగా ఉంటాయి. అంతేకాదు... అన్ని రకాల క్రీములు... ఈ ముడతలను తగ్గించలేవు. పైగా అందులో ఉండే.. రసాయనాలు.. మీ ఫేస్ ని మరింత డ్యామేజ్ చేసే ప్రమాదం ఉంది. మరి, మీ వయసును బట్టి.. మీ ముఖం అందంగా మెరిసిపోవడం తో పాటు... ముడతలు రాకుండా చేయవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం....
చర్మ సంరక్షణ..
ముఖంపై ముడతలు రాకుండా ఉండాలంటే స్కిన్ కేర్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. చాలా మంది స్కిన్ కేర్ అంటే చాలా ఖర్చుతో కూడుకున్న విషయంగా పరిగణిస్తారు. కానీ.. కేవలం సన్ స్క్రీన్ వాడినా అందంగా మెరిసిపోవచ్చు. మీకు ఇప్పటి వరకు సన్ స్క్రీన్ రాసే అలవాటు లేకపోతే... ఇప్పటి నుంచి అయినా వాడటం మొదలుపెట్టాలి. సన్‌స్క్రీన్ ఉపయోగించడం వల్ల దీర్ఘకాలంలో ఫైన్ లైన్స్ , ముడతలు నివారించవచ్చు. సన్‌స్క్రీన్‌తో పాటు, కొల్లాజెన్ , ఎలాస్టిన్ నష్టాన్ని నివారించడానికి విటమిన్ సి ఉన్న ఉత్పత్తులు వాడాలి. ఇవి.. చర్మాన్ని అందంగా మార్చడంతో పాటు... ముఖంపై ముడతలు రాకుండా... చర్మం బిగుతుగా మారుతుంది. దీని వల్ల ఎక్కువ కాలం యవ్వనంగా కనిపిస్తారు. 20 ఏళ్ల వయసులోనే ఈ సన్ స్క్రిన్ వాడకం మొదలుపెడితే.. చర్మం ఎక్కువ కాలం అందంగా మారుతుంది.
యాంటీ ఏజెనింగ్ స్కిన్ కేర్..
మన వయసు పెరిగే కొద్దీ.. శరీరం కొల్లాజెన్, ఎలాస్టిన్ ఉత్పత్తిని ఆపేస్తుంది. కాబట్టి.. ముడతలు, ఫైన్ లైన్లను నివారించడానికి మీరు యాంటీ ఏజెనింగ్ స్కిన్ కేర్ వాడటం మొదలుపెట్టాలి. విటమిన్ సి మాత్రమే కాదు... రెటినోల్ ఎక్కువగా ఉండే ఉత్పత్తులను వాడటం మొదలుపెట్టాలి. ముఖ్యంగా మీ వయసు 30 దాటితే.. మీ స్కిన్ కేర్ లో... నియాసినమైడ్ , కోజిక్ యాసిడ్ వంటివి వాడాలి. ఇవి.. మన స్కిన్ ని డ్యామేజ్ చేయకుండా.. అందంగా కనిపించడానికి సహాయపడతాయి. కనీసం రోజుకి రెండు, మూడుసార్లు అయినా రాయాలి. వీటితో పాటు సన్ స్క్రీన్ వాడటం కూడా తప్పనిసరి.
40ఏళ్లు దాటితే...
40 ఏళ్ల తర్వాత, చర్మం పొడిబారడం ప్రారంభమవుతుంది. వృద్ధాప్య సంకేతాలు కనిపించడం ప్రారంభమవుతుంది. ఈ వయస్సులో భారీ క్రీములు, సీరమ్‌లను ఉపయోగించే బదులు, చర్మంలోకి సులభంగా చొచ్చుకుపోని తేలికపాటి ఉత్పత్తులను ఉపయోగించండి. వృద్ధాప్య సంకేతాలను సమర్థవంతంగా చికిత్స చేయడంలో సహాయపడే రెటినోల్ కాకుండా, మీ చర్మం ఎండిపోకుండా రక్షించే హైలురోనిక్ యాసిడ్ ఆధారిత మాయిశ్చరైజర్‌ను కూడా మీరు చేర్చాలి. దీనితో పాటు, మీరు 40 సంవత్సరాల తర్వాత చర్మాన్ని బిగుతుగా చేసే ఫేషియల్స్ చేయించుకోవచ్చు. వయసును బట్టి.. ఈ మార్పులు చేసుకుంటే... మీరు ఎక్కువ కాలం ముడతలు లేకుండా.. యవ్వనంగా కనిపిస్తారు.