MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Woman
  • నయనతార బరువు పెరగకుండా ఉండేందుకు ఏం చేస్తుందో తెలుసా?

నయనతార బరువు పెరగకుండా ఉండేందుకు ఏం చేస్తుందో తెలుసా?

నయనతార ఎంత ముద్దుగా, స్లిమ్ గా ఉంటుందో అందరికీ తెలిసింది. ఈ హీరోయిన్ లా మేమెందుకు లేము అనుకునేవారు చాలా మందే ఉన్నారు. కానీ ఈ బ్యూటీ బరువు పెరగకుండా ఉండేందుకు కొన్ని పనులను ఖచ్చితంగా చేస్తుంది. మీరు వాటిని ఫాలో అయితే ఈజీగా బరువు తగ్గుతారు. అవేంటో ఓ లుక్కేద్దాం పదండి. 

Shivaleela Rajamoni | Published : Feb 25 2024, 10:46 AM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
17
Asianet Image

ప్రస్తుత కాలంలో చాలా మంది ఓవర్ వెయిట్ తో బాధపడుతున్నారు. ఈ ఓవర్ వెయిట్ వ్యాధేం కాదు. కానీ ఇది ఎన్నో రోగాలకు దారితీస్తుంది. పెరిగిన బరువును తగ్గించుకోకపోతే మాత్రం డయాబెటీస్, గుండె జబ్బులు, గుండెపోటు, స్ట్రోక్ వంటి సమస్యలతో పాటుగా ఎన్నో రోగాల బారిన పడతారు. ఏది ఏమైనా సెలబ్రిటీలు మాత్రం బరువు అస్సలు పెరగరు. ఎందుకంటే వీళ్లు బరువు పెరగకుండా ఉండేందుకు ఎన్నో చిట్కాలను పాటిస్తూ ఉంటారు. వీరిలో నయనతార ఒకరు. నయనతార ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అలాగే అందంగా, నాజుగ్గా ఉంది. అసలు ఈ బ్యూటీ ఇలా వెయిట్ ను ఎలా మెయిన్ టైన్ చేస్తుంది? ఈ హీరోయిన్ బరువు తగ్గే సీక్రేట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

27
Asianet Image

యోగా

హీరోయిన్ నయనతార ఎంత ఫిట్ గా ఉంటుందో అందరికీ తెలిసిందే. మీకు తెలుసా? ఈ హీరోయిన్ ప్రతి రోజూ యోగా చేస్తుంటుందట. యోగా అంటే ఈ బ్యూటీకి చాలా చాలా ఇష్టం. ఈ హీరోయిన్ జిమ్ లో గడిపే సమయం కంటే యోగాకే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు.
 

37
Asianet Image

మంచి నిద్ర

హీరోయిన్ నయనతార నిద్ర విషయంలో అస్సలు కాంప్రమైజ్ కాదు. నిద్రతోనే హెల్తీగా ఉంటామన్న సంగతి ఈ బ్యూటీకి బాగా తెలుసు. అందుకే నయనతార తనను తాను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి కంటినిండా నిద్రపోతారు. 

47
Asianet Image

జిమ్ లో శిక్షణ..

నయనతార ప్రతిరోజూ యోగా చేయడంతో పాటుగా జిమ్ కు కూడా వెళతారు. ఎంత బిజీగా ఉన్నా.. జిమ్ కు మాత్రం వెళ్లకుండా ఉండదట. ఆరోగ్యంగా ఉండటానికి వెయిట్ లిఫ్టింగ్ కూడా నయనతార ప్రాక్టీస్ చేస్తారట. 
 

57
Nayanthara

Nayanthara

ఫాస్ట్ ఫుడ్ 

నయనతార ఫాస్ట్ ఫుడ్ ను అస్సలు తినరు. ఈ బ్యూటీకి ఈ ఫుడ్ అస్సలు ఇష్టముండదట. ఈమె ఎప్పుడూ పౌష్టికాహారమే తింటుందట. అలాగే ఈ బ్యూటీ ఆహారపు అలవాట్లు చాలా సమతుల్యంగా ఉంటాయి. అలాగే ఈ బ్యూటీ అన్ని హెల్తీ ఫుడ్స్ ను రెగ్యులర్ గా తింటుంది. 
 

67
Asianet Image

కొబ్బరి నీరు

కొబ్బరి నీరు మన ఆరోగ్యానికి ఎన్నో విధాలా మేలు చేస్తారు. నయనతార ప్రతిరోజూ కొబ్బరినీళ్లను తాగుతదట. ఇది మన శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి సహాయపడుతుంది. నయనతార ప్రతిరోజూ కొబ్బరినీళ్లను తప్పకుండా తాగుతారట. 
 

77
Asianet Image

ఆరోగ్యకరమైన ఆహారం

నయనతార ప్రత్యేకంగా ఎలాంటి డైట్ ప్లాన్ ను ఫాలో అవ్వదు. కానీ రకరకాల కూరగాయలు, మాంసం, పండ్లు, గుడ్లు ఆమె రెగ్యలర్ ఫుడ్ లో ఉంటాయట. అందుకే నయనతార అంత హెల్తీగా ఉంటుందట. మీరు కూడా బరువు తగ్గాలనుకుంటే నయనతారలా ఈ టిప్స్ ను ఫాలో అవ్వండి. 

Shivaleela Rajamoni
About the Author
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు. Read More...
 
Recommended Stories
Top Stories