ముఖంపై మొటిమలు ఇబ్బంది పెడుతున్నాయా..? ఇలా కవర్ చేయండి..!
కొంచెం ఫోకస్ పెట్టి, దానికోసం కొంత సమయం కేటాయిస్తే, ఈ మొటిమల సమస్య నుంచి బయటపడొచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం..
ముఖంపై మొటిమలు చాలా మంది అమ్మాయిలను ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ముఖ్యంగా ఏదైనా ఫంక్షన్ కానీ, ఏదైనా పార్టీగానీ ఉన్నప్పుడు ముఖంపై ఎక్కడా లేని పింపుల్ వచ్చేస్తుంది. దీంతో వెంటనే అప్ సెట్ అయిపోతూ ఉంటాం. అయితే.. దీని కోసం మరీ అంతగా బాధపడాల్సిన అవసరం లేదట. కొంచెం ఫోకస్ పెట్టి, దానికోసం కొంత సమయం కేటాయిస్తే, ఈ మొటిమల సమస్య నుంచి బయటపడొచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం..
pimples
1.మీరు పార్టీకానీ, ఫంక్షన్ కానీ వెళ్తుంటే ముఖం పై మొటిమ వస్తే.. దానిని మేకప్ తో కవర్ చేయవచ్చు. కలర్ కరెక్టనర వాడితే, ముఖంపై ఉన్న పింపుల్ కనపడకుండా కవర్ చేసేయవచ్చు. ఆ తర్వాత దానిమీద మీరు రెగ్యులర్ గా వాడే ఫౌండేషన్, కన్సీలర్ వాడొచ్చు.
2.లేదు, మేకప్ లేకుండా మొటిమ కనపడకుండా ఉండాలి అంటే.. ఒక ఐస్ క్యూబ్ తీసుకొని మొటిమ వచ్చిన ప్రాంతంలో కొద్దిసేపు ఉంచాలి. ఇలా చేయడం వల్ల.. మొటిమ ద్వారా వచ్చిన రెడ్ నెస్ తగ్గుతుంది. స్వెల్లింగ్ కూడా తగ్గుతుంది.
pimples
3.ఇది కూడా కాదు అంటే టీ ట్రీ ఆయిల్ వాడొచ్చు. టీట్రీ ఆయిల్ లో యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీలు ఉంటాయి. ఇవి మొటిమల సైజు, రెడ్ నెస్ తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
4.యెల్లో అండర్ టోన్ కన్సీలర్ వాడినా కూడా.. ముఖంపై మొటిమలను కనిపించకుండా చేయవచ్చట. అంతేకాకుండా హైడ్రో కొల్లాయిడ్ ని వాడటం వల్ల పింపుల్స్ కనిపించవట. దీనిని పింపుల్ మీద రాసిన కొద్దిసేపటికే దాని చీము, ఎరుపు తగ్గిపోతుంది.
pimples
5. అప్పటికప్పుడు పింపుల్ కనిపించకుండా ఉండాలంటే, మ్యాట్ ఫౌండేషన్ వాడితే సరిపోతుంది. ఇది తక్షణ పరిష్కారం చూపిస్తుంది.మాయిశ్చరైజర్ వాడినా తక్షణ పరిష్కారం చూపిస్తుంది. కన్సీలర్ వాడినా కూడా వెంటనే పరిష్కారం లభిస్తుంది. మేకప్ మొత్తం వేసుకున్న తర్వాత సెట్టింగ్ స్పై వాడినా కూడా మొటిమలు కనపడకుండా జాగ్రత్తపడొచ్చు.