శెనగపిండిని ఇలా పెడితే ముఖం మీద వెంట్రుకలు అస్సలు ఉండవ్
శెనగపిండిని వంటకు మాత్రమే కాదు మన చర్మానికి కూడా ఉపయోగించొచ్చు. ముఖ్యంగా దీన్ని ఉపయోగించి ముఖం మీదున్న వెంట్రుకలను పోగొట్టొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..

శెనగపిండి ఫేస్ ప్యాక్
చాలా మంది ఆడవారికి ముఖం మీద వెంట్రుకలు ఉంటాయి. ఇవి పెరుగుతున్నా కొద్దీ వాటిని తొలగించడానికి కొంతమంది వ్యాక్సింగ్ చేయించుకుంటారు. మరికొంతమంది అయితే రేజర్ ను ఉపయోగించి తీసేస్తుంటారు. కానీ వీటివల్ల వెంట్రుకలు తిరిగి వస్తూనే ఉంటాయి. వీటికోసం వేలకు వేలు ఖర్చు చేసేవారు ఎంతో మంది ఉన్నారు. ఈ చికిత్సల వల్ల ముఖంపై దురద కూడా పెడుతుంది.
అయితే రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే శెనగపిండితో ముఖంమీదున్న వెంట్రుకలను తొలగించొచ్చు. ఈ పిండి మన చర్మానికి ఎలాంటి హాని చేయదు.
శెనగపిండి ఫేస్ ప్యాక్
శెనగపిండి మన చర్మంపై ఉన్న మురికిని, డెస్ స్కిన్ సెల్స్ ను తొలగించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఈ పిండి చర్మంలోని మలినాలను పూర్తిగా తొలగించి చర్మాన్ని క్లియర్ గా ఉంచుతుంది. అలాగే రంగును మెరుగుపరుస్తుంది. అంతేకాదు ఇది ముఖంమీదున్న వెంట్రుకలను కూడా తొలగిస్తుంది. దీని వాడకంతో ముఖం మీద వెంట్రుకలు పెరగడం తగ్గుతుంది. అందుకే దీనితో ఎలాంటి ఫేస్ ప్యాక్ లు వేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
శెనగపిండి, పసుపు, తేనె
శెనగపిండి, పసుపు, తేనె ఫేస్ ప్యాక్ ముఖ వెంట్రుకలను తొలగించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఇందుకోసం రెండు స్పూన్ల శెనగపిండిలో పసుపు, కొంచెం తీనెను వేసి పేస్ట్ చేయండి. దీన్ని ముఖానికి పెట్టి ఆరనివ్వండి. తర్వాత చల్ల నీళ్లతో ముఖాన్ని కడుక్కుంటే సరిపోతుంది. దీన్ని వారానికి రెండు మూడు సార్లు వేసుకోవచ్చు.
శెనగపిండి, పెరుగు
ముఖ వెంట్రుకలను తొలగించడానికి మీరు శెనపిండి, పెరుగు ఫేస్ ప్యాక్ ను కూడా వేసుకోవచ్చు. ఇందుకోసం రెండు టీ స్పూన్ల శెనపిండిలో రెండు స్పూన్ల పెరుగును వేసి పేస్ల్ చేయండి. దీన్ని ముఖానికి అప్లై చేయండి. 20 నిమిషాల తర్వాత తడి క్లాత్ తో తుడిచి గోరువెచ్చని నీళ్లతో కడిగేయండి. ఇలా మీరు వారానికి రెండు మూడు సార్లు వేసుకోవచ్చు.
శెనగపిండి, బొప్పాయి, కలబంద
శోెనగపిండి, కలబంద, బొప్పాయిని కలిపి ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు. దీన్ని తయారుచేయడానికి రెండు స్పూన్ల శెనగపిండిలో స్పూన్ కలబంద గుజ్జు, స్పూన్ బొప్పాయి గుజ్జును వేసి బాగా కలపండి. దీన్ని ముఖానికి అప్లై చేసి 30 నిమిషాలు వదిలేయండి. తర్వాత తడి క్లాత్ తో తుడిచి చల్ల నీళ్లతో ముఖాన్ని కడిగేయండి. ఈ ప్యాక్ ను మీరు వారానికి రెండు మూడు సార్లు వేసుకోవచ్చు.
శెనగపిండి, రోజ్ వాటర్, నిమ్మరసం
శెనగపిండి, రోజ్ వాటర్, నిమ్మరసాన్ని కలిపి మీరు ఫేస్ ప్యాక్ తయారుచేసి వాడొచ్చు. ఇందుకోసం రెండు స్పూన్ల శెనగపిండిలో ఒక స్పూన్ నిమ్మరసం, రోజ్ వాటర్ ను మిక్స్ చేసి పేస్ట్ చేయండి. దీన్ని ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల తర్వాత కడిగేయండి. దీన్ని మీరు వారానికి రెండు మూడు సార్లు వేసుకోవచ్చు.