Skin Care: ఆలుగడ్డలతో ముఖం మీద మచ్చలు, మొటిమలు పోతాయి.. దీన్ని ఎలా పెట్టాలంటే?
చర్మ సమస్యలకు చెక్ పెట్టాలనుకుంటున్నారా? ఇంట్లోనే ఆలుగడ్డతో ఫేస్ ప్యాక్ తయారు చేసుకుని మెరిసే చర్మాన్ని సొందం చేసుకోండి. ఈ సింపుల్ టిప్స్ తో ట్యానింగ్, నల్లటి వలయాలకు చెక్ పెట్టండి.

Potato face pack
చర్మం హెల్తీగా, అందంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ వివిధ కారణాల వల్ల చాలా మంది ఎన్నో చర్మ సమస్యలను ఎదుర్కొంటున్నారు. వీటన్నింటినీ తగ్గించుకోవడానికి మార్కెట్లో వేలకు వేలు పోసి స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ను కొంటుంటారు. కానీ రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే వాటితో ఎన్నో చర్మ సమస్యలను తగ్గించుకోవచ్చు తెలుసా? ముఖ్యంగా ఆలుగడ్డతో కూడా చర్మాన్ని హెల్తీగా మార్చేయొచ్చు.
Potato face pack
ఆలుగడ్డలతో ఫేస్ ప్యాక్
మీరు ఇంట్లోనే మీ ముఖాన్ని అందంగా మార్చేయాలనుకున్నా, మొటిమలు, మచ్చలు వంటి చర్మ సమస్యలను తగ్గించుకోవాలన్నా ఆలుగడ్డలను వాడండి. బంగాళాదుంపలు కూడా మీ చర్మ సమస్యలను తగ్గిస్తాయి. ముఖ్యంగా బంగాళాదుంపలు, తేనెను ఉపయోగించి స్పెషల్ ప్యాక్ ను తయారుచేసి వాడొచ్చు. ఈ ప్యాక్ ను ఎలా తయారుచేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
బంగాళాదుంపలతో ఫేస్ ప్యాక్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు
ఆలుగడ్డలు, తేనె, బియ్యం పిండి
ఆలుగడ్డలతోఫేస్ ప్యాక్ ఎలా తయారు చేయాలి?
బంగాళాదుంపలతో ఫేస్ ప్యాక్ ను తయారుచేయాలనుకుంటే ముందుగా ఆలుగడ్డలను గ్రైండ్ చేసి రసాన్ని తీయండి. ఈ రసంలో ఒక టీ స్పూన్ తేనె, కొంచెం లావెండర్ ఆయిల్ ను వేసి బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు దీంట్లో కొంచెం బియ్యం పిండి వేసి పేస్ట్ లా తయారుచేయండి. అంతే ఆలుగడ్డ, తేనె ఫేస్ ప్యాక్ రెడీ అయిపోయింది.
Potato face pack
ఆలుగడ్డలతో చేసి ఈ ఫేస్ ప్యాక్ ను ముఖానికి అప్లై చేసి 30 నుంచి 40 నిమిషాలు అలాగే వదిలేయండి. ఆ తర్వాత చేతులతో నెమ్మదిగా మసాజ్ చేసి శుభ్రమైన నీళ్లతో ముఖాన్ని కడగండి. ఈ ఫేస్ ప్యాక్ ను మీరు మెడకు కూడా అప్లై చేసుకోవచ్చు.
ఈ ఫేస్ ప్యాక్ ముఖం, మెడ ట్యానింగ్ ను తొలగించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. అంతేకాదు ఈ ప్యాక్ కళ్ల కింద నల్లటి వలయాలను కూడా తగ్గించడానికి సహాయపడుతుంది.