ఈ స్మూతీ తాగితే.. మీ జుట్టు ఒత్తుగా పెరుగుతుంది..!
ఒత్తైన జుట్టు కావాలనే అందరూ కోరుకుంటారు. పొడవు పెద్దగా లేకపోయినా, ఉన్నంతలో జుట్టు ఆరోగ్యంగా కనపడాలని అనుకుంటారు. అయితే... పైపై మెరుగులు ఎంత చేసినా అవి శాశ్వతంగా ఉండవు.
woman hair
ఈ రోజుల్లో చాలా మంది జుట్టురాలే సమస్యతో బాధపడుతున్నారు. జుట్టు బాగా ఊడిపోతోందని... ఏవేవో షాంపూలు, సీరమ్స్ వాడుతూ ఉంటారు. అయితే... అవి ఎన్ని వాడినా పైపైన మాత్రమే.. అదే.. మనం ఆహారం రూపంలో తీసుకుంటే.. జుట్టు ఊడిపోయే సమస్య తగ్గిపోవడంతో పాటు.. ఒత్తుగా పెరుగుతుంది. ఇప్పుడు మేం చెప్పే స్మూతీ కనుక మీరు తింటే... కచ్చితంగా మీ జుట్టు ఊడే సమస్యకు పులిస్టాప్ పడటమే కాదు... జుట్టు ఒత్తుగా.. షైనీగా మారుతుంది. మరి ఆ స్మూతీ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం...
ఒత్తైన జుట్టు కావాలనే అందరూ కోరుకుంటారు. పొడవు పెద్దగా లేకపోయినా, ఉన్నంతలో జుట్టు ఆరోగ్యంగా కనపడాలని అనుకుంటారు. అయితే... పైపై మెరుగులు ఎంత చేసినా అవి శాశ్వతంగా ఉండవు. ఆహారం రూపంలో జుట్టుకు కావాల్సిన పోషకాలు అందిస్తే.. అప్పుడు.. మనం వద్దూ అన్నా.. జుట్టు బాగా పెరుగుతుంది.
smoothie
జుట్టు బాగా పెరగడానికి స్మూతీ ఎలా తయారు చేయాలి..?
స్మూతీకి కావాల్సిన పదార్థాలు..
గుమ్మడికాయ గింజలు ఒక టీస్పూన్
వేరుశెనగ - 1 tsp
బాదం 4 నుండి 5
పొద్దుతిరుగుడు విత్తనాలు - 1 టీస్పూన్
జీడిపప్పు 4 నుండి 5
నువ్వులు - 1 టీస్పూన్
డేట్స్ 2
వాల్‌నట్ 2
అరటిపండు-1
పాలు - 2 కప్పులు
పాలు, అరటి పండు తప్ప.. మిగిలిన పదార్థాలన్నింటినీ రాత్రంతా నాననివ్వాలి. ఇప్పుడు రాత్రంతా నానిన వాటిని ఓ బ్లెండర్ లో వేసి.. దాంట్లో అరటి పండు, పాలు కూడా వేసి బాగా బ్లెండ చేయాలి. అంతే... మన హెల్దీ స్మూతీ రెడీ. మీరు దీన్ని చల్లగా తాగాలనుకుంటే, స్మూతీ చేసేటప్పుడు రెండు ఐస్ క్యూబ్స్ జోడించండి.
ఈ స్మూతీ జుట్టుకు ఎలా ఉపయోగపడుతుంది
జుట్టు పెరుగుదలకు ఉత్తమమైన విటమిన్లు విటమిన్ డి, బి కాంప్లెక్స్, బయోటిన్, విటమిన్ సి, ఫోలేట్ , ఐరన్ ఉన్నాయి. ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ B12, A B6 ఈ స్మూతీలో ఉండే బాదంలో ఉంటాయి, ఇది జుట్టుకు పోషణనిస్తుంది. ఖర్జూరాలు ఐరన్ బూస్ట్ ఇస్తాయి.
smoothie
వాల్‌నట్స్‌లో బయోటిన్ ఉంటుంది, ఇది కాకుండా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్‌లు , జుట్టు కుదుళ్లను బలోపేతం చేసే అనేక ఇతర విటమిన్‌లు కూడా ఉంటాయి. ఇవి స్కాల్ప్‌కు పోషణ అందించడం ద్వారా జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి. వేరుశెనగలో ప్రోటీన్, బయోటిన్ ,విటమిన్ ఇ వంటి ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి, ఇవి ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు దోహదం చేస్తాయి. క్రమం తప్పకుండా ఈ స్మూతీ తాగితే.. మీ జుట్టు పెరుగుదలలో మార్పు మీరే స్వయంగా చూస్తారు.