మోచేతులు నల్లగా ఉన్నవారు ఏం చేయాలంటే?
చాలా మంది చేతులు, కాళ్లు ఒక రంగులో.. మోచేతులు, మోకాళ్లు ఒక రంగులో ఉంటాయి. కానీ దీనివల్ల చాలా మంది ఆడవారు మోచేతుల కిందికే డ్రెస్ వేసుకుంటుంటారు. అయితే కొన్ని సింపుల్ టిప్స్ ను ఫాలో అయ్యారంటే మీ మోచేతులు కూడా నార్మల్ రంగులో కనిపిస్తాయి. ఇందుకోసం ఏం చేయాలంటే?
dark elbow
క్లియర్ స్కిన్ ఉండాలని అందరూ అనుకుంటారు. కానీ ఇలా ఉండాలంటే మాత్రం మీరు ప్రతి రోజూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. దీనికోసం మార్కెట్లో ఎన్నో రకాల ప్రొడక్ట్స్ దొరుకుతున్నాయి. కానీ వీటిలో మన చర్మానికి హాని కలిగించే ఎన్నో రసాయనాలు ఉంటాయి. నిజానికి టానింగ్ వల్ల చర్మం నల్లగా మారుతుంది. మనలో చాలా మందికి చర్మ రంగు మొత్తం ఒక రంగులో మోచేతులు మాత్రం ఒక రంగులో ఉంటాయి. దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అందులో ప్రధానమైంది మోచేతులను శుభ్రం చేయకపోవడం. కొంతమంది మోచేతులను శుభ్రం చేసినా కూడా నల్లగానే ఉంటాయి. అయితే కొన్ని చిట్కాలను పాటిస్తే మాత్రం మోచేతులు నార్మల్ అవుతాయి. ఇందుకోసం ఏం చేయాలంటే?
నల్లబడ్డ మోచేతులను ఎలా శుభ్రం చేయాలి?
శెనగ పిండి, నిమ్మకాయతో మోచేతుల నలుపును పోగొట్టొచ్చు. ఎలా అంటే?
1. శెనగపిండిలో ఉండే ఔషద గుణాలు చర్మంపైఉన్న చనిపోయిన కణాలను తొలగించడానికి సహాయపడుతుంది.
2. శెనగ పిండి చర్మ ఇన్ఫెక్షన్స్ రాకుండే ఉండేందుకు బాగా ఉపయోగపడుతుంది.
3. శెనగపిండి ముఖంలోని రంధ్రాలను లోతుగా శుభ్రపరచడానికి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.
elbow
చర్మానికి నిమ్మకాయ ప్రయోజనాలు
1. నిమ్మకాయలో బ్లీచింగ్ లక్షణాలు ఉంటాయి. ఇది చర్మం నలుపును తొలగించడానికి బాగా సహాయపడుతుంది.
2. నిమ్మకాయలో ఉండే సిట్రిక్ యాసిడ్ చర్మంలోని టానింగ్ ను తొలగించి స్కిన్ ఇన్ఫెక్షన్స్ నుంచి చర్మాన్ని రక్షిస్తుంది.
నల్లబడిన మోచేతులను ఎలా శుభ్రం చేయాలి.
ముందుగా శెనగపిండిని ఒక గిన్నెలోకి తీసుకోండి. ఆ తర్వాత సగం నిమ్మకాయను తీసుకుని రసాన్ని శెనగపిండిలో కలపండి. ఈ రెండింటినీ బాగా కలిపిన తర్వాత తరిగిన నిమ్మకాయ సహాయంతో ఈ పేస్ట్ ను మోచేతులకు అప్లై చేయండి. దీన్ని 20 నిమిషాల పాటు అలాగే ఉంచండి. దూది, వాటర్ తో మోచేతులను శుభ్రం చేయండి. మొదటి సారే మీరు మోచేతుల్లో తేడాను గమనిస్తారు.