MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathimynation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Life
  • Woman
  • సెలబ్రెటీల బ్యూటీ సీక్రెట్ ఇదేనేమో..? అందుకే మెరిసిపోతూ ఉంటారు..!

సెలబ్రెటీల బ్యూటీ సీక్రెట్ ఇదేనేమో..? అందుకే మెరిసిపోతూ ఉంటారు..!

మీరు చాలా మంది హీరోయిన్ల ఫేస్ లు చూసే ఉంటారు.. వారి ముఖంపై ముడతలు ఉండవు.. కళ్లు ఉబ్బినట్లుగానీ, ఎంత వయసు వచ్చినా ముడతలు, డార్క్ స్పాట్స్ లాంటివి కినిపంచవు. వాళ్లు మేకప్ వేసుకుంటారు కాబట్టి అవన్నీ కనపడవు అని చాలా మంది భావిస్తారు. 

3 Min read
ramya Sridhar
Published : Feb 08 2024, 11:44 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
18
Want glowing skin- Use ice cube..

Want glowing skin- Use ice cube..

అందంగా కనిపించాలనే ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. దాని కోసం అమ్మాయిలు అయితే ముఖ్యంగా వేల రూపాయలు ఖర్చు చేసి మరీ ఏవేవో ప్రోడక్ట్స్ కొంటూ ఉంటారు. వాటిని ముఖానికీ, జుట్టు రాసేస్తూ ఉంటారు. కానీ... ఎంత రాసినా సెలబ్రెటీలకు వచ్చినంత గ్లో ఎందుకు రాదా అని ఫీలౌ పోతూ ఉంటారు. వారు వాడే ప్రోడక్ట్స్ వాడటం మాత్రమే కాదు.. వారు  చేసే కొన్ని పనులు చేయడం వల్ల కూడా మనం సెలబ్రెటీ స్కిన్ ని పొందవచ్చు. మరి.. వారు చేసే ఆ పని ఏంటి..? దానితో మనం ఎలా అందంగా మెరిసిపోతామో ఇప్పుడు తెలుసుకుందాం..

28
Benefits of having ice bath

Benefits of having ice bath

మీరు చాలా మంది హీరోయిన్ల ఫేస్ లు చూసే ఉంటారు.. వారి ముఖంపై ముడతలు ఉండవు.. కళ్లు ఉబ్బినట్లుగానీ, ఎంత వయసు వచ్చినా ముడతలు, డార్క్ స్పాట్స్ లాంటివి కినిపంచవు. వాళ్లు మేకప్ వేసుకుంటారు కాబట్టి అవన్నీ కనపడవు అని చాలా మంది భావిస్తారు. కానీ..  ఎంత మేకప్ వేసినా చాలా వాటిని కవర్ చేయలేం. అలా కవర్ చేయాలి అంటే... సహజ ప్రయత్నాలు కూడా ఉండాలి. అందులో ఒకటి.. ఐస్ క్యూబ్ వాటర్.

38
Craving for ice

Craving for ice

ఏంటి అర్థం కాలేదా..? మీరు నమ్మకపోయినా ఇదే నిజం. ఉదయాన్నే నిద్రలేవగానే స్కిన్ కేర్ మీద దృష్టి పెట్టేవారు చాలా మందే ఉంటారు. మీరు కూడా అందులో ఒకరు అయితే.. మీరు ఈ ఐస్ వాటర్ హ్యాక్ ట్రై చేయండి. ఒక గిన్నెలో ఐస్ క్యూబ్స్ వేసి.. ఆ గిన్నెలో కొద్ది సెకన్ల పాటు మీ ముఖాన్ని ఉంచాలి. ఇలా పలు మార్లు చేయాలి. ఈ టెక్నిక్ ని కనుక మీరు రోజూ ప్రయత్నిస్తే.. సెలబ్రెటీ గ్లో మీ ఫేస్ లోనూ కనిపిస్తుంది. అచ్చంగా ఫేస్ ని ఐస్ క్యూబ్స్ లో పెట్టలేకపోతే.. అదే ఐస్ క్యూబ్ తో ఫేస్ ని మంచిగా మసాజ్ చేయాలి. ఇది కూడా మీకు మంచి బెనిఫిట్స్ ఇస్తుంది. మరి ఎలాంటి బెనిఫిట్స్ ఇస్తుందో కూడా తెలుసుకోండి..

48
ice

ice

ఉదయం లేవగానే చాలా మంది ముఖం ఉబ్బినట్లుగా కనిపిస్తూ ఉంటుంది. ముఖం మొత్తం కాకపోయినా.. కంటి కింద పఫ్ఫినెస్ ఎక్కువగా కనపడుతుంది. ఇలా కూల్ ఐస్ వాటర్ లో ముఖం పెట్డం లేదా, మసాజ్ చేయడం వల్ల ఆ పప్ఫీనెస్ తగ్గుతుంది. రక్త ప్రసరణ చాలా బాగా జరుగుతుంది. మీ కంటి అలసటను కూడా తగ్గిస్తుంది.

58
ice

ice

ఇక వయసు పెరుగుతున్న కొద్దీ మన చర్మం సాగినట్లు అవుతుంది. మరీ ముఖ్యంగా ముఖం, మెడ దగ్గర స్పష్టంగా తెలుస్తుంది. చర్మం వదులుగా తయారవ్వడం మొదలౌతుంది. అయితే.. ఈ ఐస్ హ్యాక్ వల్ల.. దానిని కంట్రోల్ చేయవచ్చు. స్కిన్ టైటెనింగ్ గా మారుతుంది. దీని వల్ల వయసు ఎక్కువగా పెరిగినట్లు కనిపించదు. ఎక్కువ కాలం యవ్వనంగా కనపడతారు.

68
ice

ice

అంతేకాదు.. ముఖంలో రక్త ప్రసరణ మెరుగ్గా జరిగేలా సహాయపడతాయి. రక్త ప్రసరణ చురుకుగా జరిగితే.. మన ముఖం మరింత గ్లో గా కనిపిస్తుంది. అంతేకాదు.. ఇలా ఐస్ మసాజ్ చేసుకున్న తర్వాత ఫేస్ కి మేకప్ వేసుకున్నా.. అది మరింత మంచిగా మెర్జ్ అయ్యేలా సహాయపడుతుంది.  మేకప్ మంచిగా అతుకుతుంది.

78
Asianet Image

ఒక్క పూట సరిగా నిద్రపోకపోయినా మనకు కంటి కింద డార్క్ సర్కిల్స్ వచ్చేస్తూ ఉంటాయి. చాలా మందికి కంటి కింద కాటుక పూసినంత నల్లగా, కళ్లు ఎప్పుడూ అలసిపోయినట్లుగా కనిపిస్తూనే ఉంటాయి. అలాంటి వారు ఈ ఐస్ హ్యాక్ ట్రై చేయడం వల్ల.. డార్క్ సర్కిల్స్ ని తరిమి కొట్టచ్చు. ఉదయాన్నే ఇలా ఐస్ మసాజ్ చేయడం వల్ల చాలా రిలీఫ్ గా.. కూడా ఉంటుంది.

88
ice

ice

అయితే.. ఇన్ని ఉపయోగాలు ఉన్న ఈ ఐస్ మసాజ్ అందరికీ సూట్ కాకపోవచ్చు. దాదాపు ఎలాంటి స్కిన్ టైప్ వారికైనా ఇది ఉపయోగపడుతుంది. కానీ.. కొందరి స్కిన్ మరీ సెన్సిటివ్ గా ఉండటం లాంటి సమస్యలు ఉండొచ్చు. కాబట్టి.. స్పెషలిస్ట్ సహాయం తీసుకొని.. వీటిని ప్రయత్నించడం ఉత్తమం.

ramya Sridhar
About the Author
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు. Read More...
సౌందర్యం
 
Recommended Stories
Top Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Andriod_icon
  • IOS_icon
  • About Us
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved