పెళ్లైన ఆడవాళ్లు నల్ల బొట్టు పెట్టుకోవచ్చా? లేదా?
పెళ్లి తర్వాత చాలా మంది ఎర్ర బొట్టునే ఎక్కువగా పెట్టుంటారు. నల్ల బొట్టును పెట్టుకోవద్దని పెద్దలు చెప్తుంటారు. అసలు పెళ్లైన తర్వాత నల్ల బొట్టును ఎందుకు పెట్టుకోరో తెలుసా?
Woman wearing Bindi
పెళ్లైన ప్రతి స్త్రీ ఖచ్చితంగా నుదిటిన బొట్టు పెట్టుకుంటుంది. భర్త చనిపోతేనే బొట్టుకు దూరంగా ఉంటారు. బొట్టు వారిని సుమంగళిగా చూపిస్తుంది. అయితే పెళ్లైన తర్వాత నల్ల బొట్టును పెట్టుకోకూడదని పెద్దలు చెప్తుంటారు. కానీ పెళ్లికాని వారు మాత్రం నల్ల బొట్టును పెట్టుకోవచ్చని చెప్తుంటారు. అసలు పెళ్లైన వారు నల్ల బొట్టును పెట్టుకోవచ్చా? లేదా? ఒకవేళ పెట్టుకుంటే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
బొట్టు
ఒకప్పుడు అయితే ఏ చీరమీదికైనా.. ఎరుపు లేదా మెరున్ కలర్ బొట్టునే పెట్టుకునేవాళ్లు. ఇప్పుడు వేసుకున్న చీరలు, డ్రెస్సులకు మ్యాచ్ అయ్యే వాటినే పెట్టుకుంటున్నారు. చాలా మంది రకరకాల కలర్ స్టిక్కర్ బొట్లను పెట్టుకుంటున్నారు. మరి పెళ్లైన ఆడవాళ్లు నల్ల స్టిక్కర్ బొట్టును పెట్టుకోవచ్చా?
బొట్టు మతపరమైన ప్రాముఖ్యత
జ్యోతిషశాస్త్రం ప్రకారం.. బొట్టుకు సాంస్కృతిక, మతపరమైన ప్రాముఖ్యత ఉంది. ఆడవాళ్లు నుదుటిపై బొట్టును అందం కోసమే పెట్టుకుంటారు. ఇంకొంతమంది ఖచ్చితంగా పెట్టుకోవాలని పెట్టుకుంటుంటారు. కానీ ఇది మూడో కంటికి సంబంధించిందని జ్యోతిష్యులు చెబుతున్నారు.
నల్ల బొట్టు పెట్టుకోవద్దు
పెళ్లైన ఆడవారు నల్ల బొట్టును పెట్టుకోవడం మంచిది కాదు. ఎందుకంటే ఇది శని, రాహువులకు సంబంధించినది. నల్ల బొట్టును పెట్టుకుంటే మీ వైవాహిక జీవితంలో సమస్యలు తలెత్తుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు.
ఈ కలర్ బొట్టును పెట్టుకోండి
పెళ్లైన ఆడవాళ్లు ఎరుపు, ఆకుపచ్చ, పసుపు, నీలం, నారింజ, గులాబీ లేదా వేరే రంగుల బొట్టును పెట్టుకోవచ్చు. జ్యోతిష్యం ప్రకారం.. ఇవి పెట్టుకోవడం శుభప్రదంగా భావిస్తారు. అయితే ఎట్టి పరిస్థితిలో నల్ల బొట్టును మాత్రం పెట్టుకోకూడదు.
పెళ్లి కాని వారు నల్ల బొట్టు పెట్టుకోవచ్చా?
పెళ్లైన వారు నల్ల బొట్టును పెట్టుకోవడం నిషిద్ధం. అయితే పెళ్లికాని వారు మాత్రం నల్ల బొట్టును ఎంచక్కా పెట్టుకోవచ్చు. పెళ్లైన వారు నల్ల బొట్టు పెట్టుకుంటే గొడవలు జరిగే అవకాశం ఉంది.
నల్ల బొట్టు ఎలా పెట్టుకోవాలి?
ఒకవేళ మీరు నల్ల బొట్టును పెట్టుకుంటే.. దాని పక్కనే వేరే రంగు బొట్టును పెట్టండి. ఇలా చేయడం వల్ల ప్రతికూల ప్రభావం ఉండదు.
ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది
సైన్స్ ప్రకారం.. నలుపు రంగు ఒక వ్యక్తి ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి సహాయపడుతుంది. నల్లటి బొట్టు పెట్టుకుంటే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.