కొత్త పెళ్లి కూతురు అదితీరావ్ హైదరి..తన ఫిజిక్ ఎలా మెయింటైన్ చేస్తది..?
అదితీరావు హైదరి తన ఫిజిక్ ని చాలా బాగా మెయింటైన్ చేస్తూ వస్తున్నారనే చెప్పాలి. ఆమె కొంచెం కూడా బరువు పెరగలేదు. అసలు.. తన ఫిజిక్ ని మెయింటైన్ చేయడానికి ఆమె ఏం చేస్తుందో.. ఆమె అందం, ఫిట్నెస్ సీక్రెట్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
హీరోయిన్ అదితీరావ్ హైదరి గురించి స్పెషల్ గా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆమె దక్షిణాదిన అన్ని భాషల్లోనూ హీరోయిన్ గా నటించారు. బాలీవుడ్ లోనూ అదరగొట్టారు. తెలుగులో అయితే.. మూడు, నాలుగు సినిమాల్లో నటించారు. అందులో మహా సముద్రం ఒకటి. అందులోనే ఆమె తొలిసారి హీరో సద్ధార్థ్ తో కలిసి నటించారు. ఆ సినిమా సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు.
చాలా సంవత్సరాలు ఇద్దరూ డేటింగ్ కూడా చేశారు. తాజాగా తెలంగాణ రాష్ట్రం వనపర్తిలో పెళ్లి కూడా చేసుకున్నారు. పెళ్లి బంధంతో ఒక్కటైన ఈ దంపతులకు అందరూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
అయితే.. కెరీర్ మొదలుపెట్టినప్పటి నుంచి అదితీరావు హైదరి తన ఫిజిక్ ని చాలా బాగా మెయింటైన్ చేస్తూ వస్తున్నారనే చెప్పాలి. ఆమె కొంచెం కూడా బరువు పెరగలేదు. అసలు.. తన ఫిజిక్ ని మెయింటైన్ చేయడానికి ఆమె ఏం చేస్తుందో.. ఆమె అందం, ఫిట్నెస్ సీక్రెట్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
మీరు గమనించి ఉంటే... అదితీరావు హైదరీ బాడీ చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. అలా బాడీ ఉండటం కోసం ఆమె.. ప్రతిరోజూ యోగా చేస్తారట. యోగా చేయడం వల్ల.. బాడీ ఫిట్ గా ఉండటం.. మనసు సంతోషంగా ఉండటంతోపాటు... యవ్వనంగా కనిపించడానికి సహాయపడుతుంది. ఆమె బాడీ ఫిట్ గానూ మారుతుంది. చాలా ఫ్లెక్సిబుల్ గానూ ఉంటుంది. అదితి తన ఒత్తిడి తగ్గించుకోవడానికి యోగా మీదే ఎక్కువ ఫోకస్ పెడతారట.
యోగా మాత్రమే కాకుండా...ఆమె ఫిట్నెస్ కోసం వ్యాయామాలు కూడా చేస్తూ ఉంటారట. జిమ్ లో కసరత్తులు చేయడంతో పాటు... తరచుగా ఆమె డ్యాన్స్ కూడా చేస్తూ ఉంటారట. ఎక్కువగా ఛాలెంజింగ్ గా ఉండే ఫిట్నెస్ వ్యాయామాలు ఆమె చేస్తూ ఉంటారట.
ఇన్ని వ్యాయామాలు చేయడంతో పాటు.. ఆమె ఫుడ్ విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటారట. న్యూట్రిషన్స్ ఎక్కువగా ఉండే బ్యాలెన్సెడ్ డైట్ తీసుకుంటారట. తాజా పండ్లు, కూరగాయలు, ప్రోటీన్ తన ఆహారంలో ఉండేలా చచూసుకుంటారట. దాని వల్ల ఆమె ఫిట్ గానూ.. ఆరోగ్యంగా ఉంటారు.
శారీరక ఆరోగ్యం ఎంత ముఖ్యమో... మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. దానికోసం అదితీరావు హైదరి మెడిటేషన్ చేస్తూ ఉంటారట. రెగ్యులర్ గా మెడిటేషన్ చేయడం వల్ల మానసికంగా కూడా ఆరోగ్యంగానూ, ఆనందంగానూ ఉంటారు.
మనం ఎంత మంచి ఆహారం తీసుకున్నా... ఎన్ని వ్యాయామాలు చేసినా సరైన నిద్ర లేకపోతే ఎన్ని చేసినా వృథానే. అందుకే.. అదితీరావు తన నిద్ర విషయంలో కాంప్రమైజ్ అవ్వరట. ప్రతిరోజూ 7 నుంచి 8 గంటలు నిద్ర ఉండేలా చూసుకుంటారట.
ఇక.. తన బాడీని ఆమె ఎప్పుడూ హైడ్రేటెడ్ గా ఉంచుకుంటూ ఉంటారట. దాని కోసం మంచినీరు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారట. మంచినీటితో పాటు పచ్చకాయ, కీరదోస, సిట్రస్ పండ్లు .. వాటర్ కంటెంట్ ఉన్న ఆహారాలను కూడా తన డైట్ లో భాగం చేసుకుంటూ ఉంటారట.
అంతేకాకుండా.. అప్పుడప్పుడు సైక్లింగ్, హైకింగ్; స్విమ్మింగ్ లాంటివి కూడా చేస్తూ ఉంటారట. దీని వల్ల ఆమె తన బాడీని మంచి గా మెయింటైన్ చేయగలుగుతున్నారు.