లైగర్ బ్యూటీ అనన్య పాండే మేకప్ సీక్రెట్ ఇదే..!
అందంగా కనిపించడానికి అనన్య ఎప్పడూ.. మేకప్ మీద మాత్రమే ఆధారపడదు. ఆమె తన స్కిన్ కేర్ కోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. మేకప్ వేసుకోవడానికి ముందు.. ఆమె మాయిశ్చరైజర్ ని తప్పనిసరిగా రాసుకుంటారు. ఐక్రీమ్ కూడా వాడతారు.
అనన్య పాండే.. ఈ పేరు పరిచయం చేయాల్సిన పనిలేదేమో. స్టార్ కిడ్ గా.. బాలీవుడ్ లో తెరంగేట్రం చేసిన ఈ హాట్ బ్యూటీ.. ఇప్పుడు టాలీవుడ్ లోనూ అడుగుపెట్టింది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో.. విజయదేవర కొండ పక్కన హీరోయిన్ గా.. ఈ హాట్ బ్యూటీ ఛాన్స్ కొట్టేసింది.
ఈ క్యూట్ అండ్ హాట్ బ్యూటీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎక్కువ కాలం కావడం లేదు.. కానీ.. స్టైలింగ్ లో మాత్రం బాగా పండిపోయింది. అనన్య పాండే గ్లామర్ ప్రపంచంలోకి అడుగుపెట్టినప్పటి నుండి, ఆమె ప్రతిసారీ ఎంతో అందంగా, స్టైలిష్ గా కనపడుతూనే ఉంది. తన ఉబెర్-కూల్ ఫ్యాషన్ సెన్స్‌కు అందరూ ఫిదా అయిపోతున్నారు. దానికి తోడు ఆమె క్లాసిక్ డ్యూయి మేకప్,ఉంగరాల జుట్టు మరింతగా అందరినీ ఆకర్షిస్తున్నాయనే చెప్పాలి.
అందంగా కనిపించడానికి అనన్య ఎప్పడూ.. మేకప్ మీద మాత్రమే ఆధారపడదు. ఆమె తన స్కిన్ కేర్ కోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. మేకప్ వేసుకోవడానికి ముందు.. ఆమె మాయిశ్చరైజర్ ని తప్పనిసరిగా రాసుకుంటారు. ఐక్రీమ్ కూడా వాడతారు.
కళ్లు అందంగా మెరవడం కోసం ఆమె తన కనురెప్పలకు క్రీమ్ రాస్తారు. తన కళ్ల కింద క్రీమ్ కన్సీలర్ ని వినియోగిస్తారు. జిడ్డుగా కనపడకుండా ఉండేందుకు ట్రాన్సపరెంట్ గా ఉండే పౌడర్ ని వినియోగిస్తారు.
ఆ తర్వాత.. బుగ్గలు అందంగా షైనింగ్ గా కనపడటానికి బ్లష్ రాస్తుంటారు. చాలా లైట్ గా హైలైటర్ ని వినియోగిస్తారు. దాని వల్ల ఆమె మరింత అందంగా కనిపిస్తారట.
అనన్య తన అందమైన పెదాలు మరింత అందంగా కనపడేందుకు లిప్ ఎక్స్ ఫోలియేటర్ ని ఉపయోగిస్తారు. తర్వాత ఆమె పెదాలను స్క్రబ్ చేస్తారు. దీంతో.. ఆమె ఫేస్ మేకప్ పూర్తౌతుంది.
ఇక తన హెయిర్ స్టైల్ విషయానికి వస్తే.. ఉంగరాలు తిరిగేలా స్టైలింగ్ చేసుకోవడం ఎక్కువ ఇష్టమట. అయితే.. అందుకోసం.. ఎక్కువగా ఘాటైన స్ప్రేలు ఉపయోగించరట. ఎక్కువ హీట్ కూడా ఉపయోగించరట. కర్లింగ్ చేసి.. సున్నితంగా బ్రష్ చేస్తుందట. తర్వాత లైట్ గా స్ప్రే చేస్తుందట. దాంతో.. తన హెయిర్ స్టైల్ ని కంప్లీట్ చేస్తుంది.