అనంత్ అంబానీ కాబోయే అత్తగారిని చూశారా..? సంతూర్ మమ్మీ అనాల్సిందే..!
మన చుట్టూ కూడా ఎవరైనా పిల్లలు ఉన్నా కూడా యంగ్ గా కనపడితే.. సంతూర్ మమ్మీ అని పిలుస్తూ ఉంటారు. అయితే.. అనంత్ అంబానీ కాబోయే అత్తగారు శైలాని చూస్తే ఎవరైనా సంతూర్ మమ్మీ అనాల్సిందేద. ఆమె అంత యంగ్ గా, స్టైలిష్ గా కనిపిస్తుండటం విశేషం.
Meet Anant Ambani's Stylish Mother-In-Law, Shaila Merchant, Leading Businesswoman And A Fashionista
మీకు సంతూర్ సోప్ యాడ్ తెలిసే ఉంటుంది. ఆ యాడ్ లో నటించే మహిళలకు పెళ్లై పిల్లలు ఉన్నా కూడా అందరూ చిన్న పిల్లే అనుకుంటూ ఉంటారు. అంటే సంతూర్ సబ్బు వాడితే యంగ్ గా కనిపిస్తూ ఉంటారు అనేది వాళ్ల కాన్సెప్ట్. మన చుట్టూ కూడా ఎవరైనా పిల్లలు ఉన్నా కూడా యంగ్ గా కనపడితే.. సంతూర్ మమ్మీ అని పిలుస్తూ ఉంటారు. అయితే.. అనంత్ అంబానీ కాబోయే అత్తగారు శైలాని చూస్తే ఎవరైనా సంతూర్ మమ్మీ అనాల్సిందేద. ఆమె అంత యంగ్ గా, స్టైలిష్ గా కనిపిస్తుండటం విశేషం.
అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుక ప్రారంభమైంది. కుటుంబ సభ్యులుఈ వేడుకలో సందడి చేస్తున్నారు. ఈ వేడుకలకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా రాధిక మర్చంట్ తల్లి శైలా మర్చంట్ పై నెటిజన్ల కన్ను పడింది.
ఆ ఫోటోల్లో రాధిక మర్చంట్ పక్కన ఆమె తల్లి శైలా ని చూసి అందరూ షాకౌతారు. ఆమె రాధికకు తల్లిలా కాకుండా అక్కలా ఉందని ఎక్కువ మంది కామెంట్స్ చేస్తుండటం విశేషం. ఆమె అంత యంగ్ గా ఉన్నారు.
శైలాను చూసిన వాళ్లంతా ఆమెను సంతూర్ మమ్మీ అని పిలవడమే కాకుండా అంబానీ కోడలు అందం ఆమె నుంచి వచ్చిందని అంటున్నారు. రాధిక తండ్రి వీరేన్ వ్యాపారవేత్త అని అందరికీ తెలిసిందే, అయితే ఆమె తల్లి శైల కూడా ఆమెకు రూ. 2000 కోట్ల వ్యాపారాన్ని నడపడం చాలా మందికి కొత్తే కావచ్చు.
గుజరాత్‌లోని కచ్ జిల్లాలో శైలా భాటియాగా జన్మించిన ఆమె ముంబైలో పాఠశాల విద్యను పూర్తి చేసింది. ఆమె ప్రముఖ ఫార్మాస్యూటికల్ కంపెనీ అయిన ఎన్‌కోర్ హెల్త్‌కేర్ వ్యవస్థాపకుడు , CEO అయిన వ్యాపారవేత్త విరెన్ మర్చంట్‌ను వివాహం చేసుకుంది.
ఈ దంపతులకు అంజలి మర్చంట్ , రాధిక మర్చంట్ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరేన్‌తో వివాహం తర్వాత, శైలా ఎంకోర్ హెల్త్‌కేర్ మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. కంపెనీ ఎండీగా శైలా, డైరెక్టర్ల బోర్డులో అంజలి, రాధిక ఉన్నారు. వ్యాపార రంగంలో శైలకు విశేషమైన పేరు ఉంది. ఆమె వద్ద తన భర్త రూ. 2000 కోట్ల విలువైన కంపెనీ మరియు వార్షిక టర్నోవర్ రూ. 200 కోట్లు ఉంది.
శైలా మర్చంట్ ఇతర వ్యాపార వెంచర్లు ,నికర విలువ కలిగిన ఎన్‌కోర్ హెల్త్‌కేర్‌కు మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేయడమే కాకుండా, శైలా అథర్వ ఇంపెక్స్ ప్రైవేట్ లిమిటెడ్, హవేలీ ట్రేడర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ,స్వస్తిక్ ఎగ్జిమ్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి అనేక పెద్ద కంపెనీలలో డైరెక్టర్‌షిప్‌లను కలిగి ఉన్నారు.
అంతే కాకుండా శైల మర్చంట్ కూడా ఫ్యాషన్ వ్యాపార ప్రపంచంలో ప్రముఖ పేరు, శైలా తరచుగా తన ఫ్యాషన్ సెన్స్ కోసం దృష్టిని ఆకర్షిస్తుంది. ఆమె చిక్ ఫ్యాషన్ సెన్స్ ని చూసి ఎవరైనా ప్రశంసల వర్షం కురిపించాల్సిందే.