Face Glow: కలబందలో ఇవి కలిపి రాస్తే..మీ ముఖం యవ్వనంగా మారడం ఖాయం..!
కలబంద మనకు చాలా సహజంగా లభించే బ్యూటీ ప్రొడక్ట్. మన చర్మానికి ఎన్న ప్రయోజనాలు అందించడంలో ఇది ఎప్పుడూ ముందుంటుంది.

కలబందతో అందం...
వాతావరణంతో సంబంధం లేకుండా చాలా మంది ఆయిల్ స్కిన్ తో బాధపడుతూ ఉంటారు. బయట వర్షం పడుతున్నా కూడా వీరి ముఖం మాత్రం ఆయిల్ కారుతున్నట్లే ఉంటుంది. వీరికి ముఖానికి మాయిశ్చరైజర్ రాసుకోవాలన్నా కూడా భయమే.అలాంటి వారు మేకప్ వేసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారు ఖర్చు లేకుండా.. కేవలం కలబందతో.. ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. మీ ఆయిల్ స్కిన్ ని నార్మల్ గా మార్చుకోవడమే కాకుండా.. యవ్వనంగా కూడా మెరిసిపోవచ్చు. మరి, అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం...
కలబంద ఎలా వాడాలి?
కలబంద మనకు చాలా సహజంగా లభించే బ్యూటీ ప్రొడక్ట్. మన చర్మానికి ఎన్న ప్రయోజనాలు అందించడంలో ఇది ఎప్పుడూ ముందుంటుంది. ఈ కలబందలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి వాడటం వల్ల చర్మం హైడ్రేటింగ్ గా ఉంటుంది. చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చడానికి కూడా సహాయపడుతుంది. ఈ కలబందతో మరికొన్నింటిని కలిపి ముఖానికి ఫేస్ ప్యాక్ లు రాయడం వల్ల అందం పెరగడంతో పాటు.. ఆయిల్ స్కిన్ సమస్యను కూడా తగ్గించుకోవచ్చు.
కలబంద, తేనె ఫేస్ ప్యాక్...
కలబంద, తేనె ఈ రెండూ కలిపి ముఖానికి రాయాలి. దీని కోసం రెండూ చెరొక స్పూన్ తీసుకొని ఆ మిశ్రమాన్ని బాగా కలపాలి. తర్వాత.. నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకొని.. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖం, మెడకు అప్లై చేయాలి. 30 నిమిషాల పాటు అలానే ఉంచి.. ఆ తర్వాత నీటితో కడిగేస్తే సరిపోతుంది. ప్రతిరోజూ క్రమం తప్పకుండా రాయడం వల్ల ముఖం లో గ్లో రావడమే కాదు..ఆయిల్ స్కిన్ ప్రాబ్లం తగ్గుతుంది.
కలబంద, పసుపు ఫేస్ ప్యాక్..
రెండు టీ స్పూన్ల కలబంద గుజ్జులో ఒక టీ స్పూన్ పసుపు పొడి మిశ్రమాన్ని కలిపి పేస్టులా చేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.. కనీసం వారానికి రెండుసార్లు ఇలా చేసినా.. మీరు యవ్వనంగా మారడంతో పాటు.. జిడ్డు చర్మం సమస్య తగ్గుతుంది.
కలబంద, రోజ్ వాటర్...
2 టేబుల్ స్పూన్ల అలోవెరా జెల్, 2 టేబుల్ స్పూన్ల రోజ్ వాటర్ ఈ రెండింటి మిశ్రమాన్ని బాగా కలిపి... ముఖానికి అప్లై చేయాలి. కనీసం 20 నిమిషాల పాటు అలానే ఉంచాలి. ఆ తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. తర్వాత మాయిశ్చరైజర్ రాసుకోవాలి. దీనిని ప్రతిరోజూ ఉపయోగించడం మంచిది.
కలబంద & ముల్తానీ మిట్టి
కావలసినవి: 2 టేబుల్ స్పూన్లు కలబంద జెల్, 2 టేబుల్ స్పూన్లు ముల్తానీ మిట్టి
ఎలా ఉపయోగించాలి: పేస్ట్ లా కలిపి 30 నిమిషాలు లేదా ఆరిపోయే వరకు అప్లై చేయండి. శుభ్రం చేసుకోండి. వారానికి 1-2 సార్లు ఉపయోగించండి.
కలబంద & ఓట్స్
కావలసినవి: 2 టేబుల్ స్పూన్లు కలబంద జెల్, 2 టేబుల్ స్పూన్లు ముతక ఓట్స్, 1 టేబుల్ స్పూన్ చక్కెర
ఎలా ఉపయోగించాలి: 5 నిమిషాలు స్క్రబ్ చేయండి, 15 నిమిషాలు అలాగే ఉంచండి, తర్వాత శుభ్రం చేసుకోండి. వారానికి 1-2 సార్లు ఉపయోగించండి. సున్నితమైన ఫేస్ ప్యాక్ కోసం చక్కెరను తేనెతో భర్తీ చేయండి.
కలబంద & గంధపు పొడి
కావలసినవి: 2 టేబుల్ స్పూన్లు కలబంద జెల్, 2 టేబుల్ స్పూన్లు గంధపు పొడి
ఎలా వాడాలి: 15–20 నిమిషాలు అప్లై చేయండి. శుభ్రం చేసుకోండి, తర్వాత మాయిశ్చరైజర్ అప్లై చేయండి. వారానికొకసారి వాడండి.
వీటిని రెగ్యులర్ గా ఉపయోగిస్తే... కచ్చితంగా ఆయిల్ స్కిన్ సమస్య తగ్గుతుంది. యవ్వనంగా కూడా కనపడతారు.