కాంజీవరం నుంచి బెనారసి వరకు.. ఈ చీరల్లో మీ లుక్ ఎంత బాగుంటుందో..
వేరే దేశాల సంగతి పక్కన పెడితే మన దేశంలో ఎంతో అందమైన చీరలు తయారవుతాయి. మన దేశంలో ప్రతి రాష్ట్రం దాని స్వంత విభిన్న రకం చీరలకు ప్రసిద్ది చెందింది. ఇండియాలో ఎన్నో రకాల చీరలు ఫేమస్ అయ్యాయి. వీటిలో కొన్ని చీరల గురించి ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
భారతదేశం 'భిన్నత్వంలో ఏకత్వానికి' ప్రసిద్ధి చెందింది. ఈ దేశంలో ఎన్నో రకాల భాషలు మాట్లాడతారు. అలాగే వివిధ రాష్ట్రాలు తమ స్వంత సాంప్రదాయ దుస్తులకు ప్రసిద్ధి చెందాయి. ఇండియాలో చాలా మటుకు ఆడవారు ఎక్కువగా చీరలనే ధరిస్తారు. దాదాపు ప్రతి రాష్ట్రానికి ఒక్కో రకం చీరలు ఉన్నాయి. అలాంటి కొన్ని విభిన్నమైన చీరల గురించి ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ఈ చీరలు ఆడవాళ్ల అందాన్ని మరింత పెంచుతాయి.
కాంజీవరం చీర
కాంజీవరం చీర తమిళనాడుకు చెందిన ఒక ప్రసిద్ధ చీర. రంగురంగుల శిల్పాలు, పనితనానికి కంజీవరం చీర ప్రసిద్ధి చెందింది. ఈ పట్టుచీరల డిజైన్స్ ను ఆడవారు ఎక్కువగా ఇష్టపడతారు. వీటిని పెళ్లిళ్లు, ఫంక్షన్లకు, స్పెషల్ అకేషన్లకు కట్టుకెళ్తే అందంగా కనిపిస్తారు.
బెంగాలీ చీర
పశ్చిమబెంగాల్ ఆడవారు ఎక్కువగా రెడ్, వైట్ రంగు చీరలనే ఎక్కువగా ఇష్టపడతారు. వీటినే ధరిస్తారు. దేశవ్యాప్తంగా ఇష్టపడే ఫేమస్ లుక్ ఇది. ఈ చీరలు సాధారణంగా తెలుపు రంగులో, ఎరుపు అంచుతో ఉంటాయి. ప్రతి బెంగాలీ మహిళ సాధారణంగా దుర్గా పూజ, పెళి లేదా ఏదైనా పెద్ద కార్యక్రమానికి దీనికి ధరిస్తుంది.
బనారసి చీర
బనారసి చీరలు ఉత్తరప్రదేశ్ లోని వారణాసి ప్రాంతంలో తయారవుతాయి. ఈ చీరలు అందానికి ప్రసిద్ధి చెందాయి. దేశం నలుమూలల నుంచి ఈ బనారస్ సందర్శనకు వచ్చిన ప్రతి మహిళ ఈ చీరను ఖచ్చితంగా కొంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ చీరను బంగారు, వెండి దారాలను ఉపయోగించి తయారుచేస్తారు. శిల్పకళ, పనితనం ఎంత ఎక్కువగా ఉంటే ఆ చీర అంత ఎక్కువ రేటు ఉంటుంది. ఈ చీరలు మార్కెట్ లో ఈజీగా దొరుకుతాయి.
పటోలా చీర
కేరళకు చెందిన పటోలా చీరలను లైట్ కాటన్ తో తయారు చేస్తారు. సమ్మర్ లో ధరించడానికి ఇవి బెస్ట్ చీరలు. రంగురంగుల శిల్పాలు, జనపనార, వైర్ డిజైన్లతో పటోలా చీరను మరింత అందంగా తయారుచేస్తారు.
గుజరాతీ చీర
గుజరాత్ ప్రజలు దుస్తులకు ప్రసిద్ధి చెందారు. ఇక్కడి చానియా-చోలీ కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఇది ప్రపంచవ్యాప్తంగా గర్బా చేసేటప్పుడు ధరిస్తారు. లహరియా చీర వంటి వివిధ రకాల గుజరాతీ చీరలు ఉన్నాయి. అవి వేర్వేరు రంగులు, నమూనాలు, డిజైన్లలో ఉంటాయి.