కుక్కర్ లో వీటిని మాత్రం వండకూడదు
ప్రెషర్ కుక్కర్ లో ఎలాంటి వంటైనా నిమిషాల్లోనే అయిపోతుంది. ఇది వంటింటి పనిని చాలా తొందరగా అయ్యేలా చేస్తుంది. కానీ కొన్ని రకాల వంటలను ప్రెషర్ కుక్కర్ లో మాత్రం వండకూడదు.
ఈ కాలంలో ప్రెషర్ కుక్కర్ ఇల్లు లేదంటే నమ్మంది. ఎందుకంటే ఇది వంటను చాలా ఫాస్ట్ గా చేసేస్తుంది. వంట పనిని తొందరగా అయ్యేలా చేస్తుంది. అందులోనూ ప్రెషర్ కుక్కర్ ను వాడటం వల్ల గ్యాస్ చాలా ఆదా అవుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ ప్రెషర్ కుక్కర్ లోనే అన్నం నుంచి చికెన్, మటన్, బిర్యానీ ఇలా ఎన్నో రకాల వంటలను వండుతున్నారు.
ఇదంతా బానే ఉన్నా.. కొన్ని రకాల వంటలను ప్రెషర్ కుక్కర్ లో మాత్రం వండకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటిని ఇందులో వండి తింటే ఆరోగ్యం దెబ్బతింటుందట. ఇంతకీ ఏ వంటలను ప్రెషర్ కుక్కర్ లో వండకూడదో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
పాల ఉత్పత్తులు
ప్రెషర్ కుక్కర్ మన వంటింటి పనులను చాలా సులువుగా అయిపోయేలా చేస్తాయి. అయితే పాల ఉత్పత్తులను మాత్రం ప్రెషర్ కుక్కర్ లో వండకూడదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే కుక్కర్ వల్ల పాల ఉత్పత్తుల్లో ఉండే పోషకాలు, రుచి తగ్గుతాయి. అలాగే వీటిని తింటే మన ఆరోగ్యం కూడా పాడవుతుంది.
ఆకుకూరలు
ఆకు కూరలు మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. వీటిలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఇలా మన శరీరానికి మేలు చేసే ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. రోజూ ఆకు కూరలను తింటే మన ఆరోగ్యానికి ఏ డోకా ఉండదు. అయితే ప్రెషర్ కుక్కర్ లో పాలకూర, కీర, బ్రోకలీ వంటి ఆకుకూరలను మాత్రం వండకూడదంటారు నిపుణులు. ఎందుకంటే వీటిలో ఉండే పోషకాలు పూర్తిగా తొలగిపోతాయి. అలాగే ఈ కూరల టేస్ట్ కూడా మారుతుంది.
పాస్తా
పాస్తాను చాలా మంది ఇష్టంగా తింటారు. అయితే తొందరగా ఉడుకుతుందని పాస్తాను ప్రెషర్ కుక్కర్ లో వేస్తుంటారు. కానీ ఇలా అస్సలు చేయకూడదు. ఎందుకంటే ప్రెషర్ కుక్కర్ లో పాస్తాను వేస్తే దానికి అత్తుక్కుపోయే అవకాశం ఉంది. ఒకవేళ దానిని కుక్కర్ లో వండాల్సి వస్తే తక్కువ విజిల్స్ లోనే స్టవ్ ను ఆఫ్ చేయాలి.
మెత్తని కూరగాయలు
ఈ కూరగాయ ఆ కూరగాయ అని తేడా లేకుండా ప్రెషర్ కుక్కర్ లో వేసి వండేవారు కూడా ఉన్నారు. కానీ మెత్తని కూరగాయలను మాత్రం కుక్కర్ లో అస్సలు వండకూడదు.అంటే కీరదోసకాయ, క్యాప్సికమ్ వంటి మెత్తని కూరగాయలను ప్రెషర్ కుక్కర్‌లో వండకూడదు. ఎందుకంటే ఇవి తొందరగా ఉడికి, రుచి మారుతుంది.
ధాన్యాలు
ధాన్యాల్లో మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే ఎన్నో రకాల పోషకాలుంటాయి. అయితే ఈ పోషకాలు మనకు అందాలంటే మాత్రం ధాన్యాలను కుక్కర్ లో వేసి వండకూడదు. ముఖ్యంగా బార్లీ, క్వినోవా వంటి ధాన్యాలను ప్రెషర్ కుక్కర్‌లో వండితే అవి తొందరగా మెత్తబడి పోషకాలు తగ్గిపోతాయి. అందుకే వీటిని కుక్కర్ లో కాకుండా గిన్నెలో వండటమే మేలు.